చివ‌రి గంట‌లో ఆవిరైన లాభాలు

సెన్సెక్స్ 200 పాయింట్ల‌కు పైగా కోల్పోగా, నిఫ్టీ 11,200 స్థాయిని కోల్పోయింది.

చివ‌రి గంట‌లో ఆవిరైన లాభాలు

బుధ‌వారం దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 11,142 వ‌ద్ద స్థిర‌ప‌డింది. లోహరంగ షేర్లు భారీగా నష్టపోయాయి. డాల‌రుతో పోలిస్తే రూపాయి మార‌కం విలువ 70.34 పాయింట్ల వ‌ద్ద కొన‌సాగుతుంది. నేటి ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం 3గంట‌ల ప్రాంతంలో ప్రాంత వ‌ర‌కు లాభాల‌తో కొన‌సాగాయి. ఆ త‌రువాత ఆరంభ లాభాల‌ను కోల్పోయి న‌ష్టాల బాట‌ప‌ట్టాయి. ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై అనిశ్చితి, యూఎస్‌, చైనాల మ‌ధ్య వాణిజ్య‌ప‌రంగా కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌లు మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపుతున్నాయి. జెట్‌ ఎయిర్‌వేస్ సంస్థ‌ అత్యున్నత స్థాయిలోని మేనేజ్‌మెంట్‌ కంపెనీని వీడటంతో ఈ కంపెనీ షేర్లు భారీగా న‌ష్ట‌పోతున్నాయి. ఫ‌లితంగా ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్‌ 203 పాయింట్ల నష్టంతో 37,114 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల నష్టంతో 11,142 వద్ద స్థిర‌ప‌డ్డాయి. బ‌జాజ్ ఫైనాన్స్‌, ఈచ‌ర్ మోటార్స్‌, యూపీఎల్‌, ఇండియ‌న్ ఆయిల్ , కార్పొరేష‌న్‌, ఇండియా బుల్స్ హౌసింగ్ షేర్లు లాభ‌ప‌డ్డాయి. మ‌రోవైపు య‌స్ బ్యాంక్‌, టాటామోటార్స్‌, జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, జెఎస్‌డ‌బ్ల్యూ స్టీల్‌, గెయిల్ ఇండియా షేర్లు న‌ష్ట‌పోతున్నాయి.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…

15.05.2019.jpg

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly