సెన్సెక్స్ లాభం 1900 పాయింట్లు

దేశీయ సూచీలు నేడు దూసుకెళ్లాయి. గ‌త కొన్ని రోజులుగా న‌మోదవుతున్న న‌ష్టాల నుంచి ఒక్క‌సారిగా భారీ లాభాల్లోకి చేరాయి

సెన్సెక్స్ లాభం 1900 పాయింట్లు

మంద‌గ‌మ‌నంలో ఉన్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ధ‌రించేందుకు ప్ర‌భుత్వం కార్పొరేట్ ప‌న్నును త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో మార్కెట్లు ఒక్క‌సారిగా పుంజుకున్నాయి. ఒక్క‌రోజులో భారీ లాభాల‌ను న‌మోదు చేశాయి. ఒక‌రోజులో సూచీలు ఇంత‌మేర‌కు లాభ‌ప‌డ‌టం ద‌శాబ్ద కాలంలో ఇదే మొద‌టిసారి. సెన్సెక్స్ నేడు 1100 పాయింట్లు లాభ‌ప‌డ‌గా, నిఫ్టీ తిరిగి 11,000 పైకి చేరింది. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.71.05 గా కొన‌సాగుతోంది.

ఈ ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఆదాయ ప‌న్ను నిబంధ‌న‌ల‌లో చేసిన మార్పుల ప్ర‌కారం, కార్పొరేట్ ప‌న్ను 22 శాతానికి త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో మార్కెట్ వ‌ర్గాల‌లో ఉత్సాహం నెల‌కొంది. సెన్సెక్స్ ఒక‌ద‌శ‌లో 2200 పాయింట్లు లాభ‌ప‌డింది. నిఫ్టీ కూడా 600 పాయింట్లు పైకి చేరింది. చివ‌రికి కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ ఒక్క‌రోజులో భారీ స్థాయిలో లాభ‌ప‌డి రికార్డును న‌మోదు చేశాయి. చివ‌రికి సెన్సెక్స్ 1921.15 పాయింట్ల లాభంతో 38,014.62 వద్ద స్థిర‌ప‌డింది. నిఫ్టీ 569.40 పాయింట్లు పెరిగి 11,274.20 వ‌ద్ద ముగిసింది.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
20.09.2019.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly