నష్టాలతో ముగిసిన మార్కెట్లు,

వడ్డీ రేట్లు తగ్గినా కోలుకోని మార్కెట్లు, సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టపోగా, నిఫ్టీ 10,855 వద్ద స్థిరపడింది.

నష్టాలతో ముగిసిన మార్కెట్లు,

దేశీయ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 286 పాయింట్ల నష్టంతో 36,690 వద్ద, నిఫ్టీ 90 పాయింట్ల నష్టంతో 10,855 వద్ద ముగిసాయి. ఐటీ, ఫార్మా రంగాల షేర్లు తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో , ఎనర్జీ, ఇన్ఫ్రా రంగాల షేర్లు అధికంగా నష్టపోయాయి. డాలరుతో పోలిస్తే రూపాయే మారకం విలువ 70.88 వద్ద ముగిసింది.

నేడు స్వల్ప నష్టాలతో ప్రారంభమయిన మార్కెట్లు నష్టాలతోనే ట్రేడింగ్ ముగించాయి. ఆర్‌బీఐ 35బేసిస్‌ పాయింట్ల మేరకు రేపొరేటును తగ్గించినా మదుపరుల్లో నమ్మకాన్ని మాత్రం పెంచలేకపోయింది. నిఫ్టీ బ్యాంక్‌, ఆటో, రియాల్టీ సూచీలు 1-2శాతం వరకు విలువ కోల్పోయాయి. మహీంద్రా అండ్‌ మహీంద్ర షేర్లు ఐదేళ్ల కనిష్టానికి చేరుకొన్నాయి. 26శాతం లాభాలు తగ్గినట్లు కంపెనీ ఫలితాలు ప్రకటించడంతో ఈ షేర్లను మదుపరులు విక్రయించారు. జూన్‌ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.918 కోట్ల మేరకు లాభాలను ఆర్జించింది. నేటి ట్రేడింగ్‌లో 6శాతం వరకు కుంగి రూ.518.45 వద్ద స్థిరపడింది.

నేడు నిప్టీలో జీ ఎంటర్టైన్మెంట్, సిప్లా, హిందూస్తాన్ యూనీలీవర్, యస్ బ్యాంక్, హీరో మోటో కార్ప్ షేర్లు లాభపడగా, ఇండియాబుల్స్ హౌసింగ్, మహీంద్రా&మహీంద్రా, టాటా స్టీల్, టాటా మోటార్స్, బీపీసీఎల్ షేర్లు నష్టపోయాయి.

నిఫ్టీలో నేడు లాభ‌, న‌ష్టాల‌తో ముగిసిన మొద‌టి అయిదు కంపెనీల షేర్లు…
07.08.2019.jpg

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly