కారు రుణాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు...

సాధారణంగా రుణదాతలు కారు రుణాలను 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తారు

కారు రుణాలపై బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు...

కొత్తగా కారు కొనాలనుకుంటున్నారా లేదా ఉన్న కారును అప్ గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా కుటుంబం కోసం మరొక కారును తీసుకోవాలని అనుకుంటున్నారా? కారణం ఏమైనప్పటికీ, కారు రుణం అనేది కొనుగోలును సులభతరం చేస్తుంది. సాధారణంగా రుణదాతలు కారు రుణాలను 3 నుంచి 5 సంవత్సరాల కాలపరిమితితో అందిస్తారు. కానీ కొంత మంది రుణదాతలు మాత్రం 7 సంవత్సరాల కాలపరిమితి వరకు కారు రుణాలను అందిస్తారు.

దీర్ఘ కాలానికి గాను మీరు కారు రుణం తీసుకున్నట్లైతే, అప్పుడు మీరు తక్కువ మొత్తంలో నెలవారీ వాయిదా (ఈఎంఐ)లను చెల్లించాల్సి ఉంటుంది, ఇది కారు కొనుగోలును మరింత సులభం చేస్తుంది. కానీ మీరు పూర్తి రుణం చెల్లించే నాటికి ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కారు కొనుగోలు అనేది పెట్టుబడి కాదు, కావున కారు కొనుగోలు కోసం పెద్ద మొత్తంలో రుణం తీసుకోవడం ఆహ్వానించదగిన విషయం కాదు.

ఒకవేళ మీరు స్వల్ప కాలానికి కారు రుణం తీసుకున్నట్లైతే, ఈఎంఐ ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది, ఒకవేళ మీరు సకాలంలో ఈఎంఐలు చెల్లించలేకపోయినట్లైతే, అది మీ క్రెడిట్ రిపోర్టుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అలాగే రుణ మొత్తానికి కూడా షరతులు వర్తిస్తాయి. కొంతమంది రుణదాతలు కారు ఎక్స్-షోరూమ్ ధరపై 100 శాతం రుణాన్ని మంజూరు చేస్తారు, మరికొంత మంది మాత్రం కేవలం 80 శాతం మాత్రమే రుణం ఇస్తారు. కారు రుణంపై కేవలం వడ్డీ రేటును మాత్రమే కాకుండా దానిపై వర్తించే ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలను కూడా పరిశీలించండి.

కారు రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు వివరాలను మీ కోసం కింద తెలియచేశాము.

ఉదాహరణకు రుణం మొత్తం - రూ. 1 లక్ష, కాల వ్యవధి - 5 సంవత్సరాలు అనుకుంటే…

car loan.png

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

(Source - Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly