రుణం తీసుకునే ముందు పరిగణించాల్సిన విషయాలు..

చాలా మంది రుణం తీసుకునే సమయంలో వడ్డీ రేట్లను పరిశీలించకుండా, కేవలం సులువుగా రుణం పొందడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు

రుణం తీసుకునే ముందు పరిగణించాల్సిన విషయాలు..

మీరు ఎప్పుడైనా రుణం తీసుకున్నారా? ఒకవేళ ఇప్పుడు తీసుకోవాలని భావిస్తున్నట్లైతే, తక్కువ వడ్డీ రేటుకే రుణం పొందాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీకే రుణం పొందడానికి మీరు మంచి క్రెడిట్ నివేదికతో పాటు మంచి క్రెడిట్ స్కోర్ ను కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అనేది మీరు తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని సూచిస్తుంది. అయితే, సరైన రుణాన్ని ఎంచుకోవడంలో మీరు అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

వివిధ రుణదాతల వడ్డీ రేట్లను పోల్చి చూడండి :

సాధారణంగా మీ ఖర్చులకు తగ్గా ఆదాయం లేని సందర్భంలో లేదా అనారోగ్య పరిస్థితుల్లో లేదా ఫోన్ కొనుగోలు చేయడం లేదా కారును కొనుగోలు చేయడం వంటి అవసరాల కోసం రుణాలను తీసుకుంటారు.

సాధారణంగా చాలా మంది రుణం తీసుకునే సమయంలో వడ్డీ రేట్లను పరిశీలించకుండా, కేవలం సులువుగా రుణం పొందడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. అలా కాకుండా తక్కువ వడ్డీ రేటు కోసం వివిధ ఆర్ధిక సంస్థలను సంప్రదించాల్సిందిగా ఆర్థిక నిపుణులు సూచిస్తున్నాయి. అయితే, ఇప్పటికే పొదుపు ఖాతా లేదా ఏదైనా ఇతర బ్యాంకింగ్ సంబంధాన్ని కలిగి ఉన్న ఆర్థిక సంస్థలను ఎంచుకోవడం మంచిది.

రుణ చెల్లింపుకు తక్కువ కాలపరిమితిని ఎంపిక చేసుకోండి :

సాధారణంగా, ఆర్థిక సంస్థలు మీకు అనేక రుణ కాలపరిమితి ఆప్షన్లను అందిస్తాయి. ఎక్కువ కాలపరిమితిని ఎన్నుకున్నట్లైతే, తక్కువ ఈఎంఐని చెల్లించాలి. అదే తక్కువ కాలపరిమితిని ఎన్నుకున్నట్లైతే, ఎక్కువ ఈఎంఐని చెల్లించాలి.

ఉదాహరణకు, మీరు మూడు సంవత్సరాల కాలపరిమితికి గాను 11 శాతం వడ్డీ రేటుతో రూ. 5 లక్షల రుణం తీసుకున్నట్లైతే, మీరు చెల్లించాల్సిన ఈఎంఐ
రూ. 16,369 గా ఉంటుంది. అదే ఐదు సంవత్సరాల కాలపరిమితికి అయితే, రూ. 10,871 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

అయితే, మూడు సంవత్సరాల కాలపరిమితికి గాను రూ. 89,297 కి మీరు చెల్లించే మొత్తం వడ్డీ , ఐదు సంవత్సరాల కాలపరిమితికి గాను రూ. 1.52 లక్షలకి మీరు చెల్లించే మొత్తం వడ్డీతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. అందువలన, తక్కువ కాలపరిమితిని ఎంచుకోవడం ఉత్తమం.

ప్రాసెసింగ్ చార్జీలు, పెనాల్టీ లను తనికీ చేయండి :

సాదరంగా రుణ గ్రహీతలు ప్రాసెసింగ్ చార్జీలపై ఎక్కువగా ద్రుష్టి పెట్టరు. ఒకవేళ ప్రాసెసింగ్ చార్జ్ ఎక్కువగా ఉండి, వడ్డీ రేటు 0.1 శాతం నుంచి 0.15 శాతం (10 నుంచి 15 బేసిస్ పాయింట్ల) కంటే తక్కువగా ఉన్నట్లయితే, అప్పుడు మీరు పెద్దగా ప్రయోజనం పొందకపోవచ్చు.

ఇక్కడ మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే పెనాల్టీ చార్జీలు. ఉదాహరణకు, చాలా ఆర్థిక సంస్థలు వ్యక్తిగత రుణాలపై ముందస్తు చెల్లింపు పెనాల్టీ చార్జీలను విధిస్తున్నారు. ఒకవేళ మీరు రుణానికి సంబంధించి ముందస్తు చెల్లింపు చేసినట్లయితే, మీరు డబ్బును కోల్పోవాల్సి వస్తుంది.

మీరు రుణాన్ని తీసుకునే ముందు, ముందస్తు చెల్లింపు పెనాల్టీ చార్జీలను తనికీ చేసుకోవడం మంచిది, అలాగే జీవన శైలి ఖర్చుల (లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్) కోసం రుణం తీసుకోవడం మంచిది కాదు.

అందువలన మీరు రుణం తీసుకోవాలని అనుకున్నప్పుడు, వడ్డీ రేట్లను పోల్చి చూడండి, అలాగే తక్కువ కాలపరిమితిని ఎంపిక చేసుకోండి. అదే విధంగా ప్రాసెసింగ్ చార్జీలు, పెనాల్టీ చార్జీలను కూడా తనికీ చేయండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly