రాగి ట్రేడింగ్ విధానం

ప్ర‌పంచంలో స్టీల్, అల్యూమినియం త‌ర్వాత రాగి లోహాన్నే ఎక్కువ‌గా ఉప‌యోస్తారు. క‌మోడిటీ ట్రేడింగ్‌లో రాగి విశిష్ట‌త‌ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం.

రాగి ట్రేడింగ్ విధానం

రాగి వినియోగం ఎక్కువ‌గా విద్యుత్, నిర్మాణ రంగ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉంటుంది. గృహ సంబంధ‌ ప‌రిశ్ర‌మ‌ల‌లోనూ రాగికి ప్ర‌త్యేక పాత్ర ఉంది. స్టీల్,అల్యూమినియం త‌ర్వాత ఎక్కువ‌గా వాడే లోహం రాగి కావ‌డం విశేషం. దాదాపు 25 పైగా దేశాలు రాగిని వెలికితీస్తాయి. కాబ‌ట్టి ఈ లోహానికి కొద‌వ లేదు. విద్యుత్ వాహ‌కాలుగా రాగి వైర్ల‌ను వాడ‌తారు. రాగికి కొర‌త ఏర్ప‌డితే మొద‌ట‌ ప్ర‌భావం చూపించేది విద్యుత్ వ్య‌వ‌స్థ పైనే. ఆ త‌ర్వాత ప‌రిశ్ర‌మ‌ల మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌వుతుంది. కాప‌ర్ నిల్వ‌లు స‌రిపోనూ ఉండ‌డం మూలాన ఆ ప‌రిస్థితి ఇప్పుడ‌ప్పుడే రాదు.

కాంట్రాక్టు వివ‌రాలు

Screen Shot 2017-05-06 at 12.35.48.png

కాంట్రాక్టుల ప్రారంభం :

కాంట్రాక్టు క్యాలెండ‌ర్ ప్ర‌కారం ప్ర‌తినెల‌ మొద‌టి తారీఖు నుంచి కాప‌ర్ కాంట్రాక్టుల‌ను ప్రారంభిస్తారు. ఒక‌వేళ ఆ నెల మొద‌టి తేదీ సెల‌వు రోజైతే, మ‌రుస‌టి ప‌ని రోజు నుంచి కాంట్రాక్టులను ఆరంభిస్తారు.

కాంట్రాక్టుల ముగింపు:

కాంట్రాక్టు క్యాలెండ‌ర్ ప్ర‌కారం నెల‌లో చివ‌రి రోజున కాంట్రాక్టులను ముగిస్తారు. ఒక వేళ కాంట్రాక్టు ముగింపు తేదీ శ‌నివార‌మైనా, ఏదైనా సెల‌వు వ‌చ్చిన ముగింపు తేదీని ముందు రోజుకు కుదిస్తారు.

ట్రేడింగ్ ప‌రిమాణం:

  • కాప‌ర్ ట్రేడింగ్ క‌నీస ప‌రిమాణం 1 మెట్రిక్ ట‌న్నుగా నిర్ణ‌యించారు.
  • ట్రేడింగ్ గ‌రిష్ఠ ప‌రిమాణం 70 మెట్రిక్ ట‌న్నులు.
  • రాగి ట్రేడింగ్ చెల్లింపులు 1 కిలోగ్రాము ప్ర‌తిపాదిక‌న చేస్తారు.

డెలివ‌రీ ప‌ద్ద‌తి:

  • డెలివ‌రీ త‌ప్ప‌కుండా ఉంటుంది. డెలివ‌రీ చేయాల్సిన‌ క‌నిష్ఠ‌ ప‌రిమాణం 9 మెట్రిక్ ట‌న్నులు.
  • డెలివ‌రీ కేంద్రాలు: ముంబ‌యి స‌హ దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాంతీయ కేంద్రాలు.
  • సెటిల్మెంట్ విధానంలో కాంట్రాక్టు గ‌డువు ముగిసిన రెండు రోజుల త‌ర్వాత చెల్లింపులు చేస్తారు.

ట్రేడింగ్‌ను ప్ర‌భావితం చేసే అంశాలు

  • జాతీయ ప‌రిణామాలైన ప్ర‌భుత్వ పాల‌సీలు, ధ‌ర‌ల విధానం, కొత్త గ‌నుల త‌వ్వ‌కాలు, ట్యాక్స్ హ‌లిడేస్, అంత‌ర్జాతీయ ప‌రిణామాలైన డాల‌ర్‌తో రూపాయి మార‌కం, అంత‌ర్జాతీయ స్పాట్ మార్కెట్ ప‌రిస్థితులు మొద‌లైన‌వి రాగి క‌మోడిటీ ట్రేడింగ్ మీద ప్ర‌భావాన్ని చూపిస్తాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly