క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు స‌మీక‌రించేదెలా?

క్రౌడ్ ఫండింగ్ ఆన్‌లైన్ వేదిక‌ల ద్వారా ప్ర‌జ‌లు అవ‌స‌రాల‌కు విరాళాల‌ను సేక‌రించ‌వ‌చ్చు

క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు స‌మీక‌రించేదెలా?

క్రౌడ్ ఫండింగ్ అంటే పెద్ద సంఖ్యలో ఉన్న వ్యక్తుల నుంచి వివిధ అవ‌స‌రాల‌ కోసం డబ్బు స‌మీకరించేందుకు లేదా స‌హాయంగా పొందడం. ఆన్లైన్ వేదికల ద్వారా వ్య‌క్తులు త‌మ‌ వ్యక్తిగత కారణం లేదా విపత్తు ఉపశమనం లేదా ఇత‌ర ఏవైనా కార‌ణాల వ‌ల్ల నిధులు సేకరించటానికి సహాయప‌డుతుంది.

కెట్టో, క్రౌడ్ ఎరా, ఇంపాక్ట్ గురు వంటి ఆన్లైన్ వేదిక‌లు నిధుల సేకరించేందుకు స‌హ‌క‌రిస్తాయి. ఇటీవలి కాలంలో క్రౌడ్ ఫండింగ్ ప్రజాదరణ పొందింది. కేరళ వరదల సమయంలో, విపత్తు ఉపశమనం నిధులను సేక‌రించ‌డం కోసం పెద్ద సంఖ్యలో క్రౌడ్ ఫండింగ్ ను ఉపయోగించారు. అత్య‌వ‌స‌ర వైద్య పరిస్థితి ఏర్ప‌డ‌టం, ఆరోగ్య బీమా కవర్ లేక‌పోవ‌డం చికిత్సకు అయ్యే ఖ‌ర్చు సొంతంగా భ‌రించాల్సి ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఆరోగ్య బీమా ఉన్నా ఆ ప‌రిమితి స‌రిపోక‌పోవ‌డం వ‌ల్ల నిధులు కొరత రావొచ్చు. అలాంటి సంద‌ర్భాల్లో వారు క్రౌడ్ ఫండింగ్ ద్వారా చికిత్స ఖర్చును పొంద‌వ‌చ్చు.

క్రౌడ్ ఫండింగ్ కు సోషల్ మీడియా ప్ర‌ధాన కేంద్రం. వాట్సాప్ , ఫేస్ బుక్ సామాజిక మాంధ్య‌మాల్లో ప్రచార కార్యక్రమాన్నినిర్వ‌హించ‌డం ద్వారా ప్రజలకు చేరువై డబ్బును స‌మీక‌రించేందుకు వీలుగా ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. ఎవరైనా ఈ ప్లాట్ఫారమ్లను ఉపయోగించి నిధుల సేకరణను ప్రారంభించవచ్చు.క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ ను ఉపయోగించడానికి, మీ సంప్రదింపు వివరాలతో ఒక ఫారం నింపి ప్ర‌క్రియ‌ను ప్రారంభిచ‌వ‌చ్చు.

ఎవరైనా ఈ వేదిక‌ల‌ను ఉపయోగించి నిధుల సేకరణను ప్రారంభించవచ్చు. నిధుల సేకరణకు ఈ క్రౌడ్ ఫండింగ్ ఫ్లాట్ ఫామ్ ల‌ను చేరి వ్య‌క్తులు త‌మ‌ సంప్రదింపు వివరాలు, నిధుల స‌మీక‌ర‌ణ ఉద్దేశం తో ఒక ఫారం నింపి ప్రచారం కార్య‌క్ర‌మం ప్రారంభించ‌చ్చు. సామాజిక కారణాల కోసం నిధులు సేకరించడం కొంత సుల‌భంగా ఉంటుంది. ఉదాహరణకు, లబ్దిదారుడు ఒక వ్యక్తి కంటే ఒక లాభాపేక్ష లేని సంస్థ లేదా ఒక ఆసుపత్రి అయితే నిధుల స‌మీక‌ర‌ణ సుల‌భంగా ఉంటుంది. ఎవరికైనా సహాయం చేయాల‌ని కోరుకుంటే, డెబిట్ లేదా క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పేటీఎమ్, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ త‌దిత‌ర మార్గాల ద్వారా చేయవచ్చు. ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా స‌మీక‌రించిన నిధులను క్రౌడ్ ఫండింగ్ సంస్థ‌లు నేరుగా లబ్దిదారుని ఖాతాకు జ‌మ‌చేస్తారు.

క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్ వారు సాధారణంగా త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చేందుకు ప్ర‌జ‌లు త‌మ‌కు అవ‌స‌ర‌మ్యే నిధుల్లో క‌నీసం 20 నుంచి 30 శాతం నిధులుతో రావాల‌ని సూచిస్తుంటారని నిపుణులు అంటున్నారు. నిధుల కొరతను పూరించేందుకు అవసరమయ్యే డబ్బుని స‌మీక‌రించేందుకు ఈ వేదికలు చ‌ర్య‌లు తీసుకుంటాయి. అయితే వ్య‌క్తులు సామాజిక, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల కోసం ఏమీ లేకుండా కూడా నిధులను సేక‌రించ‌వ‌చ్చు. ఉదాహరణకు విద్యా వ్యయానికి రూ. 5 లక్షలు అవసరమైతే, త‌మ పొదుపు లేదా త‌ల్లిదండ్రుల నుంచి రూ. 1-2 లక్షల ఏర్పాటు చేసుకుంటే మిగిలినవి క్రౌడ్ ఫండింగ్ ద్వారా స‌మీక‌రించ‌వ‌చ్చు. ఈ విధానంలో ప్ర‌జ‌ల నుంచి విరాళాల ద్వారాస‌మీక‌రించే డబ్బు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు .

ఫీజులు:
చాలా వ‌ర‌కూ క్రౌడ్ ఫండింగ్ వేదికలు ముందస్తు డబ్బుని వసూలు చేయవు. అయితే ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మం విజ‌య‌వంత‌మైతే ప్రచారానికి ఫీజుగా,
స‌మీక‌రించిన మొత్తం డబ్బులో 8-10 శాతం వసూలు చేస్తారు. ఇందులోనే ప్లాట్‌ఫామ్ ఫీజు, జీఎస్‌టీ ఇతర గేట్ వే ఫీజులను కలిగి ఉంటుంది.

పన్ను ప్రయోజనం:
విపత్తు సహాయ నిధులకు విరాళంగా ఇచ్చే వారికి సెక్ష‌న్ 80జీ కింద పన్నురాయితీ ఉంటుంది. వ్యక్తిగత అవసరాల కోసం నిధులను స‌మీక‌రించే విరాళాలు నేరుగా వ్య‌క్తిగ‌త బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తాయి కాబ‌ట్టి వాటిపై ప‌న్ను రాయితీ వర్తించదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly