ఏటీఎం నగదు ఉపసంహరణలపై ఎలాంటి చార్జీలు లేవు..

బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ను మైంటైన్ చేయకపోయినా ఎలాంటి ఛార్జీలు ఉండవు

ఏటీఎం నగదు ఉపసంహరణలపై ఎలాంటి చార్జీలు లేవు..

ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న సమయంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ఆర్ధిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా మూడు నెలల పాటు ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా నగదును ఉపసంహరించుకుంటే ఎలాంటి ఛార్జీలు ఉండవని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. అదే విధంగా బ్యాంకు ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ను మైంటైన్ చేయకపోయినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ఆమె తెలిపారు. అలాగే డిజిటల్ వాణిజ్య లావాదేవీలపై బ్యాంకు ఛార్జీలను కూడా తగ్గించనున్నట్లు ఆమె తెలిపారు.

కనీస బ్యాలెన్స్ అవసరం :

చాలా బ్యాంకులు తమ ఖాతాదారులు ఖచ్చితంగా మంత్లీ యావరేజ్ బ్యాలన్స్ మెయిన్టైన్ చేయాలని నిబంధనలను విధిస్తున్నాయి. ఒకవేళ బ్యాలన్స్ మెయిన్టైన్ చేయకపోతే జరిమానా విధిస్తున్నాయి. సాధారణంగా కనీస బ్యాలెన్స్ రేంజ్ రూ. 5,000 నుంచి రూ. 10,000 మధ్య ఉంటుంది. మార్చి 10న ఎస్‌బీఐ మంత్లీ యావరేజ్ బ్యాలన్స్ ఛార్జీలను మాఫీ చేసిన విషయం తెలిసిందే.

డెబిట్ కార్డ్-కమ్ ఏటీఎం ఛార్జీలు :

సాధారణంగా, బ్యాంకులు తమ సొంత ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లావాదేవీలను, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు ఉచిత లావాదేవీలను అనుమతిస్తాయి. ఒకవేళ మీరు ఈ పరిమితులను మించినట్లైతే, లావాదేవీ రకం ఆధారంగా రూ. 8 నుంచి రూ. 20 వరకు ఛార్జీలను విధిస్తాయి.

కరోనా వైరస్ భయాల నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదాయపు పన్ను, వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్‌టీ), దివాలా, దివాలా కోడ్, బ్యాంకు సంబంధిత సమ్మతి విషయాలు, ఇతర ఎనిమిది పాయింట్ల సమ్మతి ఉపశమన ప్యాకేజీలో ప్రకటనలు చేశారు.

ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే గడువును 30 జూన్ 2020 వరకు పొడిగించింది. ఆధార్, పాన్‌లను అనుసంధానం చేసే గడువును కూడా జూన్ 30 వరకు పొడిగించారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly