హెచ్ఆర్ఏ పొందుతున్న‌వారికి సెక్ష‌న్ 80జీజీ వ‌ర్తించ‌దు

సెక్ష‌న్ 80జీజీ కింద సంవ‌త్స‌రానికి రూ.60,000 వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది

హెచ్ఆర్ఏ పొందుతున్న‌వారికి సెక్ష‌న్ 80జీజీ వ‌ర్తించ‌దు

ప‌నిచేసే సంస్థ నుంచి హెచ్ఆర్ఏ పొందుతున్న‌ప్ప‌టికీ, ఆదాయ ప‌న్ను చ‌ట్టం 1961 ప్ర‌కారం సెక్ష‌న్ 80జీజీ కింద ప‌న్ను మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకున్న‌వారిరి తాజాగా ఆదాయ ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేసింది. అస‌లు మిన‌హాయింపు ఎవ‌రికి ల‌భిస్తుంది. ఎవ‌రు క్లెయిమ్ చేసుకోవ‌చ్చో తెలుసుకుందాం…

ఎవ‌రికి వ‌ర్తిస్తుంది?
సెక్ష‌న్ 80GG కింద ప‌న్ను మిన‌హాయింపు కేవ‌లం హెచ్ఆర్ఏ పొంద‌ని ( చిన్న సంస్థ‌ల్లో ఉద్యోగం చేస్తూ, అసంఘ‌టిత రంగానికి చెందితే) లేదా స్వ‌యం ఉపాది పొందే వారికి ల‌భిస్తుంది. ఏడాదికి రూ.60,000 వ‌ర‌కు మిన‌హాయింపు ప‌రిమితి ఉంటుంది.

ఎవ‌రికి వ‌ర్తించ‌దు?
సొంత ఇల్లు క‌లిగి ఉండి వేరే ఇంట్లో అద్దెకు ఉంటే సెక్ష‌న్ 80జీజీ కింద మిన‌హాయింపు ల‌భించ‌దు.
ఈ సెక్ష‌న్ 80 జీజీ ప్ర‌కారం, మొత్తం ఆదాయంలో 25 శాతం (క్యాపిట‌ల్ గెయిన్స్ మిన‌హాయించి), అస‌లు అద్దె - 10 శాతం ఆదాయం లేదా ఏడాదికి రూ.60 వేలు… ఈ మూడింటిలో ఏది త‌క్కువ‌గా ఉంటే అంత మొత్తం మిన‌హాయింపు ల‌భిస్తుంది.

 • ఉదాహ‌ర‌ణ‌కు… నెల‌స‌రి ఆదాయం రూ.50,000 అనుకుంటే, అద్దె నెల‌కు రూ.12,000 చెల్లిస్తున్నారు.

 • రూ.50 వేల నుంచి 25 శాతం అంటే 12,500 - ఆదాయంలో 10 శాతం అంటే రూ.7000,

 • రూ.60 వేలు సంవ‌త్స‌రానికి (నెల‌కు రూ.5,000). ఈ సంద‌ర్భంలో త‌క్కువ అంటేనెల‌కు రూ.5 వేలు…దీంతో మీకు రూ.60 వేలు సంవ‌త్స‌రానికి క్లెయిమ్ చేస‌కోవ‌చ్చు.

  హెచ్ఆర్ఏ పొందితే…
  హెచ్ఆర్ఏ ల‌భించే ఉద్యోగుల‌కు సెక్ష‌న్ 10 (13A) చ‌ట్టం ప్ర‌కారం వేరే నిబంధ‌న‌లు ఉంటాయి. ఇందులో మిన‌హాయింపు ప‌రిమితి ఉండ‌దు.
  ఇంటి అద్దె భ‌త్యంగా అందుకున్న మొత్తంలో ఈ మూడు అంశాల్లో ఏది త‌క్కువ‌గా ఉంటే దానికి ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

 • మూల వేత‌నంలో 50శాతం(మెట్రో న‌గ‌రాల్లో), 40శాతం(మెట్రోయేత‌ర న‌గ‌రాల్లో)

 • సంస్థ నుంచి అందుకున్న వాస్త‌వ హెచ్ఆర్ఏ

 • చెల్లించిన వాస్త‌వ అద్దెలోంచి 10 శాతం మూల వేత‌నం తీసివేయ‌గా వ‌చ్చే మొత్తం

ఉదాహ‌ర‌ణ‌కు-
ఉద్యోగి నెలకు రూ.60వేల మూల వేత‌నం పొందుతున్నాడు. అద్దె ఇంటికోసం రూ.20 వేలు క‌డుతున్నాడు. తాను ఉద్యోగం చేసే సంస్థ హెచ్ఆర్ఏ రూ.15 వేలు చెల్లిస్తుంది. ఇప్పుడు లెక్క చూద్దాం…

 • మూల‌వేత‌నంలో 50 శాతం అంటే రూ.30,000 … ఏడాదికి రూ.3,60,000 ( నెల‌కు రూ.30వేలు * 12 నెల‌లు)
 • సంస్థ నుంచి అందుకున్న హెచ్ఆర్ఏ… రూ.1,80,000 ( నెల‌కు రూ.15 వేలు * 12 నెల‌లు)
 • వాస్త‌వ అద్దెలోంచి 10 శాతం మూల వేత‌నం తీసివేస్తే… రూ.14,000. ( రూ.20 వేలు ,12 నెల‌లు-మూల‌వేత‌నం నుంచి 10 శాతం) ఇది సంవ‌త్స‌రానికి రూ.1.68 ల‌క్ష‌లుఅవుతుంది. ఇదే త‌క్కువ‌గా ఉంది కాబ‌ట్టి అంత మొత్తం మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఇది సెక్ష‌న్ 80GG ప‌రిమితి రూ.60 వేల కంటే చాలా ఎక్కువ‌.

అయితే రెండు సెక్ష‌న్‌ల కింద ప‌న్ను మిన‌హాయింపు కోరేందుకు వీలుండ‌దు. ఎవ‌రికి ఏది వ‌ర్తిస్తుందో దాని ప్ర‌కారమే క్లెయిమ్ చేసుకోవాలి. ఒక‌వేళ మీకు ఈ విషయంలో స్ప‌ష్ట‌త లేక‌పోతే చార్ట‌ర్డ్ అకౌంటెంట్ స‌ల‌హాలు తీసుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly