ఏకమైన మూడు బ్యాంకులు..

మార్చి30న తేదీన రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది

ఏకమైన మూడు బ్యాంకులు..

దేశ బ్యాంకింగ్ రంగంలో మరో అతిపెద్ద విలీనం చోటు చేసుకుంది. గతంలో ఎస్బీఐలో దాని అనుబంధ బ్యాంకులు విలీనం అయిన తరువాత మరోసారి మూడు బ్యాంకులు విలీనం కానున్నాయి. విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లు ఈ రోజు నుంచి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విలీనం కానున్నారు. మార్చి30న తేదీన రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ విలీనంతో దేశంలోనే మూడవ అతి పెద్ద బ్యాంకుగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అవతరించనుంది. మొదటి రెండు స్థానాల్లో ఎస్‌బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఉన్నాయి. ఇక నుంచి దేనా బ్యాంకు, విజయా బ్యాంకు శాఖలను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా శాఖలుగా పరిగణించడంతో పాటు వారి ఖాతాదారులను, ఉద్యోగులను కూడా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఖాతాదారులుగా పరిగణిస్తారు. మూడు బ్యాంకుల కలయికతో, దాని వ్యాపారం విలువ సుమారు రూ. 15 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో రూ. 8.75 కోట్ల డిపాజిట్లు, రూ. 6.25 కోట్ల అడ్వాంసులు ఉన్నాయి. ఇక బ్యాంకు షేర్ల విషయానికి వస్తే, ప్రతి 1000 విజయా బ్యాంక్‌ షేర్లకు గాను 402 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు, అలాగే ప్రతి 1000 దేనా బ్యాంక్‌ షేర్లకు 110 బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు లభించనున్నాయి. ప్రభుత్వం కూడా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో రూ. 5,042 కోట్లను పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయిచింది. ఇక పై బ్యాంకు అఫ్ బరోడా కింద మొత్తం 9,500 బ్రాంచీలు, 13,400 ఏటీఎంలు, 85 వేల మంది ఉద్యోగులు, 12 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నట్లు బ్యాంకు తెలిపింది.

(source - livemint)

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly