ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మధ్య తేడా ఏంటి?

రెండు వేర్వేరు బ్యాంకులకు చెందిన రెండు వేర్వేరు ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు

ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మధ్య తేడా ఏంటి?

సాధారణంగా బ్యాంకులను సందర్శించేటప్పుడు లేదా ఇతరులకు డబ్బు పంపాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ వంటి పదాలను వింటూ ఉంటాం. కానీ ఈ రెండు పదాలు వాస్తవానికి భిన్నమైనవి. అలాగే వాటి ఉపయోగం, పనితీరు కూడా పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కావున ఈ రెండు ఎలా వేర్వేరుగా పనిచేస్తాయో కింద తెలుసుకుందాం.

ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ అనేవి బ్యాంకింగ్ కు సంబంధించిన పదాలు. రెండు వేర్వేరు బ్యాంకులకు చెందిన రెండు వేర్వేరు ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. మొదటగా, వాటిలో ఒక్కొక్కదాన్ని తీసుకుని వాటి లక్షణాలను అర్థం చేసుకుందాం. ఇలా చేయడం ద్వారా ఎన్ఈఎఫ్టీ vs ఆర్టీజీఎస్ మధ్య వ్యత్యాసం, బదిలీ పరిమితి, ఛార్జీలు, సమయ వేళల గురించి మంచి అవగాహన పొందవచ్చు.

ఎన్ఈఎఫ్టీ :

ఎన్ఈఎఫ్టీ లావాదేవి రియల్ టైంలో కాకుండా బ్యాచ్ లలో జరుగుతుంది. దీని ద్వారా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు (రెండు, నాల్గవ శనివారాలు మినహా) నగదును బదిలీ చేసుకోవచ్చు. రోజులో మొత్తం 12 బ్యాచ్ లు ఉంటాయి. ఆన్ లైన్ వయా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా ఎన్ఈఎఫ్టీ చేయవచ్చు. ఎన్ఈఎఫ్టీ ద్వారా కనిష్టంగా బదిలీ చేయగలిగే మొత్తం రూ. 1 కాగా, గరిష్ట బదిలీకీ ఎలాంటి పరిమితి లేదు.

ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి ఢిల్లీలోని ఒక పెద్ద మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతను తన తల్లికి డబ్బు పంపించాల్సిన అవసరం ఉంది. అతని బ్యాంకు ఖాతా హైదరాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. అయితే అతని తల్లికి విజయవాడలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఖాతా ఉంది. అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు వెళ్లి, ఎన్ఈఎఫ్టీ ద్వారా రూ. 50,000 బదిలీ చేయాల్సిందిగా కోరతాడు. అప్పుడు కౌంటర్లో ఉన్న గుమాస్తా అతనికి ఒక రసీదు ఇచ్చి, ఒక గంటలో మీ అమ్మగారి బ్యాంకు ఖాతాకు నగదు చేరుతుందని చెబుతాడు. ఎన్ఈఎఫ్టీ అనగా నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్ఫర్. దీనిని ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.

ఎన్ఈఎఫ్టీ చార్జీలు :

neft charges.png

ఆర్టీజీఎస్ :

ఆర్టీజీఎస్ అనగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. పేరు సూచించినట్లుగా, ఇతర ఖాతాలకు నిధులు రియల్ టైంలో బదిలీ అవుతాయి. కావున ఎన్ఈఎఫ్టీ మాదిరిగా రెండు గంటల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఆర్టీజీఎస్ ఫండ్ బదిలీ రియల్ టైంలో జరుగుతుంది. దీని అర్ధం నిధుల బదిలీ తక్షణమే జరుగుతుంది. ఆర్టీజీఎస్ ద్వారా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (రెండు, నాల్గవ శనివారాలు మినహా) నగదును బదిలీ చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయాల్సిన కనీస మొత్తం రూ. 2,00,000. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా శాఖను సందర్శించడం ద్వారా ఆర్టీజీఎస్ చేయవచ్చు.

రాహుల్ హైదరాబాద్ లో ఒక వ్యాపారవేత్త, అతను ముంబై నుంచి సరుకు తెప్పించి ఇక్కడ విక్రయిస్తూ ఉంటాడు. ఒకసారి రాహుల్ కు సరుకును సరఫరా చేసే వ్యక్తికి నగదు కొరత ఉండడంతో ఆర్డర్ ప్రాసెస్ చేయడానికి రాహుల్ అతనికి రూ. 3 లక్షల నగదును ముందుగా చెల్లించాల్సి వచ్చింది. కానీ అతను కేవలం 15 నిమిషాల్లోనే నగదును పంపిల్సి వచ్చింది. ఎన్ఈఎఫ్టీ ద్వారా నగదు బదిలీ చేస్తే రెండు గంటల సమయం పడుతుందని రాహుల్ కి తెలుసు. దీంతో రాహుల్ బ్యాంకుకి వెళ్లి, తన ఖాతా నుంచి సరకు సరఫరాదారుడి ఖాతాకు ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయాలని బ్యాంకు మేనేజర్ ను కోరాడు. దీంతో డబ్బు వెంటనే బదిలీ అయ్యి, రాహుల్ సమస్య పరిస్కారం అవుతుంది.

ఆర్టీజీఎస్ చార్జీలు :

rtgs charges.png

(Source: Livemint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly