ఆర్‌టీజీస్, నెఫ్ట్ మ‌ధ్య తేడా?

ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ రెండు ఎప్పుడు ఉప‌యోగ‌ప‌డ‌తాయో తెలుసుకుందాం

ఆర్‌టీజీస్, నెఫ్ట్ మ‌ధ్య తేడా?

బ్యాంకు ఖాతా నుంచి ఇతరులకు డబ్బు పంపాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ రెండు ఆప్ష‌న్లు అందుబాటులో ఉంటాయి. ఈ రెండూ న‌గ‌దు లావాదేవీల‌కు ఉప‌యోగించే అయినా ప‌నిచేసే విధానంలో తేడా ఉంటుంది. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ రెండు వేర్వేరు ఖాతాల మధ్య డబ్బును బదిలీ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఎన్ఈఎఫ్టీ, ఆర్టీజీఎస్ మధ్య వ్యత్యాసం, బదిలీ పరిమితి, ఛార్జీలు, సమయ వేళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ఎన్ఈఎఫ్టీ : ఎన్ఈఎఫ్టీ లావాదేవీ రియల్ టైంలో కాకుండా బ్యాచ్ లలో జరుగుతుంది. దీని ద్వారా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు (రెండు, నాల్గవ శనివారాలు మినహా) నగదును బదిలీ చేసుకోవచ్చు. రోజులో మొత్తం 12 బ్యాచ్ లు ఉంటాయి. ఆన్ లైన్ వయా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా ఎన్ఈఎఫ్టీ చేయవచ్చు. ఎన్ఈఎఫ్టీ ద్వారా కనిష్టంగా బదిలీ చేయగలిగే మొత్తం రూ. 1 కాగా, గరిష్ట బదిలీకీ ఎలాంటి పరిమితి లేదు.

ఉదాహరణకు వ్యక్తి ఢిల్లీ నుంచి డబ్బు పంపించాల్సిన అవసరం ఉంది. అతని బ్యాంకు ఖాతా హైదరాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది. న‌గదు పంపించాల్సి ఖాతా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఉంది. అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుకు వెళ్లి, ఎన్ఈఎఫ్టీ ద్వారా రూ. 50,000 బదిలీ చేయాల్సిందిగా కోరతాడు. అప్పుడు కౌంటర్లో ఉన్న సిబ్బంది అతనికి ఒక రసీదు ఇచ్చి, ఒక గంటలో బ్యాంకు ఖాతాకు నగదు చేరుతుందని చెబుతాడు. ఎన్ఈఎఫ్టీ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఫండ్ ట్రాన్స్ఫర్. దీనిని ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు నిధులను బదిలీ చేయడానికి విస్తృతంగా ఉపయోగిస్తారు.

ఆర్టీజీఎస్ : ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. పేరు సూచించినట్లుగా, ఇతర ఖాతాలకు నిధులు రియల్ టైంలో బదిలీ అవుతాయి. ఎన్ఈఎఫ్టీ మాదిరిగా రెండు గంటల పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. ఆర్టీజీఎస్ ఫండ్ బదిలీ రియల్ టైంలో జరుగుతుంది. దీని అర్ధం నిధుల బదిలీ తక్షణమే జరుగుతుంది. ఆర్టీజీఎస్ ద్వారా ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు (రెండు, నాల్గవ శనివారాలు మినహా) నగదును బదిలీ చేసుకోవచ్చు. ఆర్టీజీఎస్ ద్వారా నగదు బదిలీ చేయాల్సిన కనీస మొత్తం రూ. 2,00,000. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితి లేదు. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా శాఖకు వెళ్ల‌డం ద్వారా ఆర్టీజీఎస్ చేయవచ్చు. వెంట‌నే చెల్లింపులు అయ్యే విధానం ఆర్టీజీఎస్ అందుబాటులో ఉండంటంతో పాటు బ్యాంకుకు వెళ్ల‌కుండా ఆన్‌లైన్ లో లావాదేవీలు చేసే విధానం అందుబాటులో ఉంటుంది. వ్యాపార కార్య‌కాల‌పాల్లో ఈ ప‌ద్ధ‌తిని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు.

అయితే గ‌తంలో ఈ రెండు ప‌ద్ధ‌తుల్లో లావాదేవీలు చేసేందుకు రుసుములు ఉండేవి. ప్ర‌స్తుతం వాటిని రిజ‌ర్వుబ్యాంకు తొలిగించింది. డిజిట‌ల్ విధానంలో లావాదేవీల‌ను మ‌రింత పెంచేందుకు రిజ‌ర్వుబ్యాంకు ఈ నిర్ణ‌యం తీసుకుంది. బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌కు ఈ ప్ర‌యోజ‌నాల‌ను అందించాల‌ని రిజ‌ర్వుబ్యాంకు పేర్కొంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly