డిజిట‌ల్ క‌రెన్సీ, క్రిప్టో క‌రెన్సీ రెండింటికీ తేడా?

డిజిట‌ల్ క‌రెన్సీ, క్రిప్టోక‌రెన్సీల‌కు మ‌ధ్య తేడాలు.

డిజిట‌ల్ క‌రెన్సీ, క్రిప్టో క‌రెన్సీ రెండింటికీ తేడా?

డిజిట‌ల్ క‌రెన్సీ :

ఏవిధ‌మైన ముద్ర‌ణ లేదా భౌతిక రూపం లేకుండా ఎల‌క్ట్రానిక్ ప‌ధ్ధ‌తిలో లావాదేవీలు చేసే వాటిని డిజిట‌ల్ క‌రెన్సీ అంటారు.
మ‌నం వినియోగించే వ్యాలెట్లు మొద‌లైనవి.

క్రిప్టో క‌రెన్సీ:

ఇది డిజిట‌ల్ క‌రెన్సీ లో ఒక ర‌కం. క్రిప్టో క‌రెన్సీ కొంత విలువ క‌లిగి ఉండి, క్రిప్టోగ్ర‌ఫీ సాంకేతిక‌త‌ ఆధారంగా ఉంటుంది. మైనింగ్ చేయ‌డం ద్వారా ఈ వ‌ర్చువ‌ల్ క‌రెన్సీని పొందుతారు. గ‌ణితం, సైన్స్, కంప్యూట‌ర్ త‌దిత‌ర శాస్త్రాల‌న్నీ క‌లిపి ఉండే ఆల్‌గారిథ‌మ్ ల‌ను చేయ‌డం ద్వారా క్రిప్టోక‌రెన్సీని పొంద‌వ‌చ్చు. ఈ లావాదేవీలు చాలా సురక్షిత‌మైనవ‌ని చెబుతుంటారు. దానికి కార‌ణం వీటి ద్వారా లావాదేవీలు చేసే స‌మాచారం బ్లాక్ చైన్ ఆధారంగా వికేంద్రీకృత‌మై ఉంటుంది.

డిజిట‌ల్ క‌రెన్సీ క్రిప్టోక‌రెన్సీ ల‌కు మ‌ధ్య 5 తేడాలు

నిర్మాణం:

  • డిజిట‌ల్ క‌రెన్సీ కేంద్రీకృత డేటాబేస్ ఆధారంగా ప‌నిచేస్తుంది.

  • క్రిప్టో క‌రెన్సీ వికేంద్రీకృత డేటాబేస్ ద్వారా ప‌నిచేస్తుంది.

గుర్తింపు:

  • డిజిట‌ల్ క‌రెన్సీ ఖాతా తెరిచేందుకు వ్య‌క్తి తాలుఖా వివ‌రాలు కేవైసీ వంటివి త‌ప్ప‌నిస‌రిగా కావాలి.

  • క్రిప్టోక‌రెన్సీకి వ్క‌క్తితో నిమిత్తం లేదు. సంబంధిత వివ‌రాలు మ‌ర్చిపోతే మీ ఖాతా మీరు తెరుచేందుకు వీలుకాదు.

పార‌ద‌ర్శ‌క‌త‌:

  • క్రిప్టో క‌రెన్సీలో లావాదేవీలు చాలా పార‌ద‌ర్శ‌కంగా ఉంటాయి. ఎవ‌రు ఏ లావాదేవీలు చేస్తున్నార‌నేది అందులో ఉండే స‌భ్యుల‌కు తెలుస్తుంది. బ్లాక్ చైన్ లో వారంద‌రూ ఆ స‌మాచారాన్ని చూడ‌వ‌చ్చు.

లావాదేవీల్లో మార్పులు:

  • డిజిట‌ల్ లావాదేవీలు అన్నీ సెంట్ర‌ల్ డేటాబేస్ తో లింక్ అయి ఉంటాయి. కాబ‌ట్టి వినియోగ‌దార్లు చేసే లావాదేవీల‌ను స‌ద‌రు సంస్థ ర‌ద్దు లేదా నిలుపుద‌ల‌ చేయ‌వ‌చ్చు.లావాదేవీల‌లో ఏవైనా అనుమానాస్ప‌ద లావాదేవీలు జ‌రిగిన‌ట్లు గుర్తిస్తే వాటిని ర‌ద్దు చేసేందుకు ఇందులో వీలుంటుంది.

  • క్రిప్టో క‌రెన్సీలో ఒక‌సారి లావాదేవీలు జ‌రిపిన త‌రువాత మార్పులు చేసేందుకు దాదాపు వీలుండ‌దు.

చ‌ట్టం:

  • డిజిట‌ల్ క‌రెన్సీలు చ‌ట్ట‌ప‌రంగా ఆమోదం క‌లిగి ఉంటాయి. వీటి లావాదేవీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుంది.

  • మ‌న దేశంలో అయితే క్రిప్టోక‌రెన్సీలకు చ‌ట్ట‌ప‌రంగా ఆమోదించ‌లేదు . కొన్నిదేశాల్లో దీని గుర్తింపుకు సంబంధించిన ప్ర‌క్రియ ప్రారంభ ద‌శ‌లోనే ఉంది.

బ్లాక్‌చైన్‌తో భ‌ద్రంగా డిజిట‌ల్ బ్యాంకింగ్ క‌థ‌నం చ‌ద‌వండి

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly