జీవితంలో వివిధ ద‌శ‌ల్లో ఆర్థిక‌ప్ర‌ణాళిక ఎలా ఉండాలి?

జీవితంలో ఎదుర‌య్యే ముఖ్యమైన సంద‌ర్భాల‌లో అత్యవసరమైన‌వి, అత్య‌వ‌స‌రం కాని వాటిని చూసుకుని నిర్ణ‌యాలు తీసుకోవాలి.

జీవితంలో వివిధ ద‌శ‌ల్లో ఆర్థిక‌ప్ర‌ణాళిక ఎలా ఉండాలి?

ప్ర‌తీ ఒక్క‌రు త‌మ భవిష్య‌త్తుకు సంబంధించిన ప్ర‌ణాళిక వేసుకోవ‌డం చాలా అవ‌స‌రం. ఆర్థిక ప్రణాళికలో పొదుపు చేయ‌డం, ఆర్థిక‌ లక్ష్యాలను పెట్టుకోవ‌డం, ఆర్థిక భ‌ద్ర‌త‌, బీమా, రుణాలు, సంపద బదిలీకి ప్రణాళిక చేయడం వంటి ప‌లు ర‌కాల అంశాలు ఉంటాయి. జీవితంలో ప్ర‌తీ ద‌శ‌లోనూ మ‌న‌కు వివిధ ర‌కాల అవ‌స‌రాలు ఉంటాయి. వాట‌న్నింటికీ ఒకే విధంగా ప్ర‌ణాళిక ఉండ‌దు. జీవితంలో ఎదుర‌య్యే ముఖ్యమైన సంద‌ర్భాల‌లో అత్యవసరమైన‌వి, అత్య‌వ‌స‌రం కాని వాటిని చూసుకుని నిర్ణ‌యాలు తీసుకోవాలి. ఉదాహరణకి, జీవిత బీమా ప్రీమియం చెల్లింపు, ప‌ద‌వీ విరమణ నిధికి చేసే కేటాయింపుల‌ను ముఖ్య‌మైన వాటిగా ప‌రిగ‌ణించాలి.

నాలుగు దశల్లో ఆర్థిక ప్ర‌ణాళిక‌:

తొలిద‌శ‌:

సంపాదించ‌డ ప్రారంభించిన తొలినాళ్ల‌లో పొదుపు ప్ర‌ణాళిక వేసుకోవ‌డం అల‌వాటు చేసుకోవాలి. స‌రైన బ‌డ్జెట్ వేసుకోవ‌డం ద్వారా ఎంత పొదుపుచేస్తున్నాం, ఎంత ఖ‌ర్చుచేస్తున్నాం అనేది తెలుస్తుంది. . మీ బడ్జెట్లో పొదుపులను అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలి. ఈ ద‌శ‌లో రుణాల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం మంచిది. పదవీ విరమణ కోసం కొన్ని పెట్టుబడులను ప్రారంభించడం అనేది ఈ దశలోనే ప్రారంభించాలి. దీనికి చాలా ఎక్కువ స‌మ‌యం ఉంద‌ని అనిపించవచ్చు. కానీ, ముందుగానే ప్రారంభించ‌డం వ‌ల్ల కాంపౌండింగ్ వృద్ధితో మంచి మొత్తాన్ని ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యానికి పొంద‌వ‌చ్చు. ఈ దశలో ఇతర లక్ష్యాల కోసం పెట్టుబడులు చేయ‌డం ఒక ఆప్ష‌న్ గా భావించ‌వ‌చ్చు. ఆదాయం పెరిగిన తర్వాత పెట్టుబ‌డులను ప్రారంభించవచ్చు.

ఈ ద‌శ‌లో ఒక ప్రాథమిక ఆరోగ్య బీమా పాల‌సీని త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. వీటితో పాటు జీవిత, వాహ‌న‌, వ్యక్తిగత ప్రమాద బీమా పాల‌సీలను తమ అవ‌స‌రాల‌కు అనుగుణంగా తీసుకోవాలి. క్రెడిట్ చరిత్రను స‌క్ర‌మంగా ఉండేలా చూసుకోవాలి. విద్యారుణం లాంటివి కలిగి ఉంటే వాటిని చెల్లించాలి. ఈ ద‌శ‌లో రుణాలు తీసుకుని తిరిగి స‌రిగా చెల్లించ‌క‌పోతే ఆ ప్ర‌భావం భవిష్యత్తులో మీ రుణ ల‌భ్యత‌పై ప్ర‌భావం చూపుతుంది. ఈ దశలో ఎస్టేట్ ప్లానింగ్ ఆప్ష‌న్. క్ర‌మంగా సంప‌ద పెరిగిన‌ప‌డు భవిష్యత్తులో దీన్ని చేయ‌వ‌చ్చు.

రెండో ద‌శ‌:

ఈ ద‌శ‌లో మీపై ఆధారపడిన ఆధార‌డిన కుటుంబం ఉంటుంది. కాబ‌ట్టి జీవిత బీమా భద్రతకు కీలకమైన అంశం. మీకుటుంబ స‌భ్యుల ర‌క్ష‌ణ కోసం అవ‌స‌ర‌మైన‌ జీవిత బీమాను తీసుకోవాలి. మీ కుటుంబ స‌భ్యులంద‌రికి వ‌ర్తించే విధంగా ఆరోగ్య బీమాను తీసుకోవాలి. ఈ ద‌శ‌లో ఆదాయం, ఖర్చులు రెండూ పెరుగుతాయి. వ్య‌యాల‌కు సంబంధించి కుటుంబ బ‌డ్జెట్ ను రూపొందించుకోవాలి. ఈ దశలో పొదుపు చేసేందుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి. చిన్న, మధ్యస్థ, దీర్ఘకాలిక లక్ష్యాలకు స‌రిప‌డ పొదుపు చేస్తూ కుటుంబ బ‌డ్జెట్ కు లోబ‌డి ఖ‌ర్చుచేయ‌డం స‌వాలుగా ఉంటుంది. మీ ఆదాయానికి అనుగుణంగా పొదుపు కోసం కాలానుగుణంగా మీ బడ్జెట్ ను సవరించాలి. ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా వృద్ధి , ద్రవ్యత అవసరాలకు అనుగుణంగా ఉన్న ఒక పోర్ట్ఫోలియోను నిర్మించడానికి పెట్టుబడి పెట్టండి.

పెట్టుబడులు, బీమాపై నామినీల‌ను నియ‌మిచండం వంటి ప్రాథమిక ఎస్టేట్ ప్రణాళికను నిర్మించుకోవాలి. ఈ ద‌శ‌లో నిధుల లభ్యత కంటే అవసరాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాబ‌ట్టి రుణం తీసుకోవాల్సిన అవ‌స‌రం ఎక్కువ‌గా ఉంటుంది. అవ‌స‌రాల‌కు రుణ‌మ‌నే కాకుండా ఆస్తుల కొనుగోలు చేసేందుకు రుణం తీసుకోవ‌చ్చు. దీర్ఘ‌కాలంలో అంటే ప‌ద‌వీవిర‌మ‌ణ నాటికి ఆస్తులు వృద్ధి చెంది భ‌రోసాగా ఉంటుంది. అయితే తీసుకున్న రుణాల‌కు అనుగుణంగా చెల్లింపులు చేయ‌డం చాలా ముఖ్యం, దీని ప్ర‌భావం క్రెడిట్ స్కోర్ పై ప‌డ‌కుండా చూసుకోవాలి.

వృద్ధి ద‌శ‌:

ఈ ద‌శ‌ను చేరే స‌మ‌యానికే మీరు స‌క్ర‌మైన ప్ర‌ణాళిక క‌లిగి ఉంటే ఎటువంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు. ఈ దశ‌లో ఆదాయం కూడా పెరుగుతుంది. ఖ‌ర్చులు కూడా క్ర‌మంగా త‌గ్గుతాయి కాబ‌ట్టి పొదుపు చేసే మొత్తం పెరుగుతుంది. ఈ ద‌శ‌లో ఖ‌ర్చులు చేసే అవ‌స‌రం ఉంటే చాలా జాగ్ర‌త్త‌గా చేయాలి. వీలైనంత వ‌ర‌కూ పొదుపు ఎక్కువ చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. ఈ ద‌శలో సంపదను క‌లిగి ఉండేవారు ఎస్టేట్ ప్లానింగ్ చేయాలి. విల్లు ఎలా సిద్ధం చేయాలని ప్లాన్ చేయడానికి సమయాన్ని వెచ్చించండి. మీ పెట్టుబ‌డులు,సంప‌ద‌కు సంబంధించి అన్ని అంశాలు స‌క్ర‌మంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి.

పదవీ విరమణ దశ:

పదవీ విరమణ సమయంలో మరోసారి ఆర్ధిక వనరుల బడ్జెట్ వేసుకోవాలి. ప‌ద‌వీవిర‌మ‌ణ నిధిపై వ‌చ్చే ఆదాయంతో కుటుంబ నిర్వ‌హ‌ణ‌ చేయాలి. ఈ స‌మయంలో అందే ఆదాయ ప‌రిమితోలోనే ఖర్చులు చేయాలి. ద్రవ్యోల్బణం నుంచి ప‌ద‌వీవిర‌మ‌ణ నిధిని రక్షించడానికి ఆమొత్తాన్ని న‌ష్ట‌భ‌యం త‌క్కువ‌గా ఉండి, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించే రాబ‌డి అందించే పెట్టుబడులను చేయాలి. ఆరోగ్య ఖర్చులు మీ ఆదాయాన్ని హ‌రించే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి మీకు, మీ భాగస్వామికి తగినంత ఆరోగ్య బీమా కీలకం. పదవీ విరమణ ప్రారంభంలో ముఖ్యంగా ఆర్ధిక సరళీకృత చేసుకోవాలి . వినియోగంలో ఉన్న‌పలు ఖాతాలు, పెట్టుబడుల‌ను తగ్గించడం, పత్రాలను క‌చ్చితంగా నిర్వహించడం, నవీకరించడం వంటివి చేయాలి.

జీవితంలో ప్రతి దశలో ముఖ్యమైన , క్లిష్టమైన కార్యకలాపాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా పరిమితంగా ఉండే సమయం, నిధులను వినియోగించుకుంటూ మంచి ప్ర‌ణాళిక‌ను రూపొంచుకోవ‌డం ముఖ్యం

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly