ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ ఖాతా గురించి మీకు తెలుసా..

మల్టీ ఆప్షన్ డిపాజిట్ (ఎంఓడీ) ఖాతాతో అనుసంధానించిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను 'సేవింగ్స్ ప్లస్ ఖాతా' అంటారు

ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ ఖాతా గురించి మీకు తెలుసా..

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ వినియోగదారుల కోసం వివిధ రకాల ఖాతాలను అందిస్తుంది. సాధారణ సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ), రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) ఖాతాలతో పాటు ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ ఖాతాను కూడా అందిస్తుంది. ఎస్బీఐ వెబ్ సైట్ ప్రకారం, మల్టీ ఆప్షన్ డిపాజిట్ (ఎంఓడీ) ఖాతాతో అనుసంధానించిన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాను ‘సేవింగ్స్ ప్లస్ ఖాతా’ అంటారు. ఈ ఖాతాలో, ప్రవేశ పరిమితి కంటే ఎక్కువ ఉన్న ఫండు పొదుపు ఖాతా నుంచి ఆటోమేటిక్ గా ఎఫ్డీ లేదా టర్మ్ డిపాజిట్ కు బదిలీ అవుతుంది.

ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ ఖాతా కనీస బ్యాలెన్స్, వడ్డీ రేట్లు, ఇతర ముఖ్య వివరాలను మీ కోసం కింద తెలియచేశాము.

  1. సేవింగ్స్ బ్యాంక్ ఖాతా తెరవడానికి అర్హత ఉన్న ఎవరైనా ఎస్బీఐ సేవింగ్స్ ప్లస్ ఖాతాను తెరవవచ్చు.
  1. మల్టీ ఆప్షన్ డిపాజిట్ (ఎంఓడీ) కు బదిలీ చేసే కనీస ప్రవేశ పరిమితి రూ. 35,000.

  2. ఎస్బీఐ సాధారణ సేవింగ్స్ ఖాతాకు ఇచ్చే వడ్డీ రేటునే సేవింగ్స్ ప్లస్ ఖాతాకు కూడా అందిస్తారు.

  3. ఎంఓడీకి బదిలీ చేయాల్సిన కనీస మొత్తం రూ. 10,000.

  4. డిపాజిట్ కాలపరిమితి 1 నుంచి 5 సంవత్సరాలు.

  5. వినియోగదారులకు మల్టీ ఆప్షన్ డిపాజిట్‌ పై రుణ సౌకర్యం కూడా లభిస్తుంది.

  6. మెట్రో, పట్టణ ప్రాంతాలలో పొదుపు ఖాతాను కలిగి ఉన్న వినియోగదారులు నెలకు రూ. 3,000 కనీస బ్యాలన్స్ ను నిర్వహించాలి. అదే సెమీ అర్బన్, గ్రామీణ శాఖలలోని వినియోగదారులు వరుసగా రూ. 2000, రూ. 1000 కనీస బ్యాలెన్స్ ను నిర్వహించాల్సి ఉంటుంది.

  7. ఏటీఎం కార్డు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు కూడా ఈ ఖాతాకు అందుబాటులో ఉంటాయి.

  8. ఒకవేళ ఖాతా బ్యాలెన్స్ రూ. 3000 కంటే తక్కువగా ఉన్నట్లయితే, ఖాతాలో రూ. 3000 బ్యాలెన్స్ నిర్వహించడానికి ఎంఓడీలు విచ్ఛిన్నమవుతాయి.

  9. ఒకవేళ బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ ను నిర్వహించకపోతే, వినియోగదారులు పెనాల్టీ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

(source - livemint)

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly