ఇకపై ఇంటి నుంచే బ్యాంకు సర్వీసులు..

కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఖాతాదారులు మాత్రమే పొందగలరు

ఇకపై ఇంటి నుంచే బ్యాంకు సర్వీసులు..

దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఇకపై ఇంటి నుంచే బ్యాంకింగ్ సేవలు పొందే విధంగా ‘డోర్‌స్టెప్ బ్యాంకింగ్’ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బ్యాంకుకు చెందిన అన్ని బ్రాంచులలో ఈ సర్వీసులు అందుబాటులో లేవు. కేవలం కొన్ని బ్యాంకు బ్రాంచులు మాత్రమే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను అందిస్తున్నాయి. అయితే ఈ సర్వీసులు కేవలం కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఖాతాదారులు మాత్రమే పొందగలరు. అలాగే 70 సంవత్సరాల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లు, వికలాంగులు కూడా ఈ సేవలను పొందగలరు. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను కోరుకునే వారు తప్పనిసరిగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబరును కలిగి ఉండాలి. అలాగే ఖాతాదారులు తమ బ్యాంక్ బ్రాంచుకు ఐదు కిలోమీటర్ల లోపు నివసిస్తూ ఉండాలి. జాయింట్ అకౌంట్లు, మైనర్ అకౌంట్లు కలిగిన ఖాతాదారులు ఈ సేవలను పొందలేరు.

డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను అందించడానికి బ్యాంకు కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తుంది. దీనిలో భాగంగా ఆర్థిక లావాదేవీకి రూ.100, అలాగే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీ కోసం రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను పొందాలనుకునే వారు ముందుగా బ్యాంకు బ్రాంచ్‌ను సందర్శించి రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా ఖాతాదారులు క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, టర్మ్ డిపాజిట్, ఫామ్ 15 హెచ్ వంటి వివిధ రకాల సేవలను ఇంటి వద్ద నుంచే పొందవచ్చు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly