ఈపీఎఫ్ పాస్‌బుక్‌ ను డౌన్ లోడ్ చేయడం ఎలా?

మీ పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయడానికి, మీరు ముందుగా ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి

ఈపీఎఫ్ పాస్‌బుక్‌ ను డౌన్ లోడ్ చేయడం ఎలా?

ఒక ఉద్యోగిగా, మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతాలో మీ యజమాని చేసిన అన్ని కాంట్రిబ్యూషన్స్ ను ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. మీరు, మీ యజమాని చేసిన కాంట్రిబ్యూషన్ ద్వారా సేకరించిన మొత్తం కార్పస్‌ను కూడా ఈపీఎఫ్ స్టేట్మెంట్ చూపిస్తుంది. మునుపటి యజమాని నుంచి మీ ఈపీఎఫ్ ఖాతాను ప్రస్తుత ఖాతాకు బదిలీ చేయడానికి అవసరమైన సమాచారాన్ని పొందడానికి ఈ స్టేట్మెంట్ సహాయపడుతుంది.

ఈపీఎఫ్ పాస్‌బుక్‌లో మీ పీఎఫ్ ఖాతా నంబర్, ప్రావిడెంట్ ఫండు, పెన్షన్ స్కీమ్ వివరాలు, మీ యజమాని పేరు, ఎస్టాబ్లిష్మెంట్ ఐడీ, ఈపీఎఫ్ఓ ​​కార్యాలయం మొదలైన వివరాలు ఉంటాయి.

మీ పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయడానికి, మీరు ముందుగా ఈపీఎఫ్ఓ ​​వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. దీనిని మీరే నమోదు చేసుకోవచ్చు.

  1. ముందుగా https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ వెబ్ సైట్ ని సందర్శించండి

  2. యాక్టివేట్ యూఏఎన్ పై క్లిక్ చేయండి

  3. మీ స్క్రీన్ పై క్రొత్త పేజీ కనిపిస్తుంది. యూఏఎన్, ఆధార్, పాన్, ఇతర వివరాలను నమోదు చేయండి.

  4. అనంతరం ‘గెట్ ఆథరైజేషన్ పిన్’ పై క్లిక్ చేయండి. మీరు నమోదు చేసిన వివరాలను ధృవీకరించమని అడుగుతూ మీ స్క్రీన్ పై క్రొత్త పేజీ కనిపిస్తుంది. అలాగే, ఎస్ఎంఎస్ ద్వారా ఓటీపీ మీ మొబైల్‌కు వస్తుంది.

  5. ఓటీపీని ఎంటర్ చేసి ‘వ్యాలిడేట్ ఓటీపీ అండ్ యాక్టీవేట్ యూఏఎన్’ పై క్లిక్ చేయండి.

మీ యూఏఎన్ యాక్టీవేట్ అయిన తర్వాత, మీ పాస్‌వర్డ్‌ను కలిగి ఉన్న ఎస్ఎంఎస్ ను పొందుతారు. మీ ఖాతాకు లాగిన్ అవ్వడానికి ఈ పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి. లాగిన్ అయిన తర్వాత మీరు మీ పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు.

మీరు మీ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి ముందు, రిజిస్ట్రేషన్ చేసిన 6 గంటల తర్వాత మాత్రమే మీ పాస్‌బుక్‌ను చూడవచ్చని గుర్తుంచుకోండి.

మీ ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలానో స్టెప్ బై స్టెప్ వివరించడం జరిగింది :

స్టెప్ 1: https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login.jsp వెబ్‌సైట్‌ను సందర్శించండి.

స్టెప్ 2: మీ యూఏఎన్, పాస్‌వర్డ్, క్యాపచ్చి కోడ్‌ను నమోదు చేసి, ‘లాగిన్’ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3: లాగిన్‌ అయిన తరువాత, మీ పాస్‌బుక్‌ను చూడటానికి మెంబర్ ఐడీని ఎంచుకోండి.

ఒకవేళ మీరు ఖాతా పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే, మీరు ఈపీఎఫ్ఓ మెంబర్ ఈ-సేవా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసుకోవచ్చు. (https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/)

మెంబర్ ఈ-సేవా పోర్టల్ నుంచి ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి అవసరమైనది ఏమిటి?

ఈపీఎఫ్ పాస్‌బుక్ స్టేట్‌మెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి, మీరు మెంబర్ ఈ-సేవా పోర్టల్‌లో రిజిస్టర్డ్ ఖాతాను కలిగి ఉండాలి. ఒకవేళ మీరు
మొదటిసారి నమోదు చేసుకున్నట్లైతే, మీరు రిజిస్ట్రేషన్ చేసిన 6 గంటల తర్వాత మాత్రమే మీ పాస్‌బుక్‌ను చూడవచ్చు.

ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌ను చూడటానికి అనుమతించే యాప్ ఉందా?

మీరు ఉమాంగ్ యాప్ ద్వారా మీ ఈపీఎఫ్ స్టేట్‌మెంట్‌ను చూడవచ్చు.

ఈపీఎఫ్ స్టేట్ మెంట్ లో ఉన్న వివరాలు ఏమిటి?

ఈపీఎఫ్ స్టేట్ మెంట్ లో ఈపీఎఫ్ ఖాతా సంఖ్య, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ స్కీమ్ మొదలైన వివరాలు ఉంటాయి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly