డ్యూయల్ డిస్ ప్లే ఫోన్ ను లాంచ్ చేసిన నుబియా..

నుబియా జడ్20 బ్లాక్, బ్లూ, రెడ్ వంటి మూడు రంగులలో అందుబాటులో ఉండనుంది

డ్యూయల్ డిస్ ప్లే ఫోన్ ను లాంచ్ చేసిన నుబియా..

ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ నుబియా సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. దీని పేరు నుబియా జడ్20. ఇందులో రెండు వైపులా డిస్ ప్లే ను అమర్చడం విశేషం. నుబియా జడ్20 బ్లాక్, బ్లూ, రెడ్ వంటి మూడు రంగులలో అందుబాటులో ఉండనుంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాగా, రెండవది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. ఇది ఆండ్రాయిడ్ 9 (పై) ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇక ధర విషయానికి వస్తే, 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర
రూ. 35,200 కాగా, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 37,200 గా సంస్థ నిర్ణయించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ను తక్కువ ధరకే విక్రయించడం విశేషం. ఈ ఫోన్ ను భారత మార్కెట్ లోకి ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా స్పష్టంగా తెలీదు.

నుబియా జడ్20 స్పెసిఫికేషన్స్ ను ఒకసారి పరిశీలిస్తే…

  • వెనుకవైపు 6.42 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే
  • ముందువైపు 5.10 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్‌ప్లే
  • స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 9 (పై ) ఆపరేటింగ్ సిస్టం
  • 6 జీబీ ర్యామ్ / 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • వెనుకవైపు 48+16+8 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్
  • 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
  • టైపు-సీ ఛార్జింగ్ పోర్ట్
  • 27W ఫాస్ట్ ఛార్జింగ్

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly