ఎడిల్‌వైస్ టోకియో నుంచి స‌ర‌ళ్ నివేశ్‌

పాల‌సీ విధానాలు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా, కొనుగోలు ప్ర‌క్రియ త్వ‌ర‌గా ముగిసేలా ఉండే బీమా ఇది. ప‌రిహారంపై స్ప‌ష్టతనివ్వ‌డం ఈ పాల‌సీ ప్ర‌త్యేక‌త‌.

ఎడిల్‌వైస్ టోకియో నుంచి స‌ర‌ళ్ నివేశ్‌

బీమా రంగం స‌మాజంలో మ‌రింత లోతుకు దూసుకెళ్లేలా భార‌తీయ బీమా ప్రాధికార అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) మార్గాల‌ను సుగ‌మం చేసుకుంటూ వెళుతోంది. ఇందులో భాగంగానే పాయింట్ ఆఫ్ సేల్స్ ప‌ర్స‌న్స్ (పీవోఎస్‌పీ)ను నియ‌మించుకునేందుకు బీమా సంస్థ‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. జ‌నాల‌కు సుల‌భంగా అర్థం చేయించ‌గ‌లిగే బీమాను అందునా ప్రాథ‌మిక పాల‌సీల‌ను పాయింట్ ఆఫ్ సేల్స్ ప‌ర్స‌న్స్ ద్వారా పంపిణీ చేసేందుకే వారిని నియ‌మించ‌డంలోని ప్ర‌ధాన ఉద్దేశం.

మొద‌టి కంపెనీ ఇదే

పీవోఎస్‌పీల ద్వారా పాల‌సీల అమ్మ‌కాలు జ‌రిపేందుకు ఐఆర్‌డీఏఐ అనుమ‌తి పొందిన తొలి సంస్థ ఎడిల్‌వైస్ టోకియో కావ‌డం విశేషం. పాయింట్ ఆఫ్ సేల్స్ ప‌ర్స‌న్స్ ను నియ‌మించడం వెన‌కు ప్ర‌ధాన ఉద్దేశం వారికి త‌క్కువ స‌మ‌యంలోనే బీమాపై త‌గిన శిక్ష‌ణ ఇవ్వ‌డం. త‌ద్వారా ఎక్కువ మంది పాల‌సీ తీసుకునేలా చేయ‌డం. పాల‌సీలు అమ్మేందుకు సంస్థ‌లు అన్ని చోట్లా కార్యాల‌యాలు పెట్ట‌లేవు కాబ‌ట్టి ఇలాంటి పీవోఎస్‌పీల‌ను నియ‌మించ‌డం ద్వారా వారు మారుమూల ప్రాంతాల‌కు సైతం వెళ్లి ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న పెంచి బీమా కొనుగోలు చేసేలా చూస్తారు. సుల‌భంగా అర్థం చేయించ‌గ‌లిగే పాల‌సీల‌ను మాత్ర‌మే పీవోఎస్‌పీల ద్వారా విక్ర‌యింప‌జేస్తారు.

అన్ని ర‌కాల పాల‌సీల విక్ర‌యం

జీవిత బీమా విభాగంలో పూర్తి ర‌క్ష‌ణ‌నిచ్చే టర్మ్ పాల‌సీల‌తోపాటు, ప్రీమియం వెన‌క్కిచ్చే పాల‌సీలు, ఎండోమెంట్‌, మ‌నీబ్యాక్ పాలసీలు లాంటి ర‌క‌ర‌కాల పాల‌సీలు ఎడిల్‌వైస్ టోకియో సంస్థ అందిస్తోంది.

స‌ర‌ళ్ నివేశ్‌

ర‌క్ష‌ణతో పాటు పెట్టుబ‌డికి అవ‌కాశ‌మిచ్చేలా ఎడిల్‌వైస్ టోకియో సంస్థ POS స‌ర‌ళ్ నివేశ్ పాల‌సీని రూపొందించింది. పెట్టుబ‌డి ప్ర‌యోజ‌నాలు పాల‌సీదారుకు కొనుగోలు సమయంలోనే తెలియజేస్తుంది. ఈ పాల‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్ లాగా భావించ‌వ‌చ్చు. డిపాజిట్‌తోపాటు బీమా ల‌భించ‌డం దీని విశేషం.

కొనుగోలు సుల‌భ‌త‌రం

పాల‌సీ కొనుగోలు చేయ‌డం చాలా సుల‌భం. పాల‌సీ ప్ర‌తిపాద‌న ప‌త్రంలో వ్య‌క్తి ఎత్తు, బ‌రువుతో క‌లిపి కేవ‌లం నాలుగే వైద్య సంబంధ ప్ర‌శ్న‌లుంటాయి. వృత్తి, ఆదాయం, విద్యార్హ‌త‌, నామినీ లాంటి ప్రాథ‌మిక వివ‌రాలు అడుగుతారు. ఆధార్ కార్డు ఉన్న‌ట్ల‌యితే ఈ-కేవీసై ద్వారా మీ ఖాతాదారును తెలుసుకోండి ప్ర‌క్రియ మ‌రింత సుల‌భ‌త‌రం అవుతుంది. ప్ర‌తిపాద‌న మొద‌లుకొని, పాల‌సీని వివ‌రించి జారీచేసేందుకు కేవ‌లం 20 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంద‌ని ఆ సంస్థ చీఫ్ యాక్చువ‌రీ సుభ్ర‌జిత్ ముఖ్యోపాధ్యాయ్ అన్నారు. ఆన్‌లైన్‌లోనూ ఈ పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. క‌మిష‌న్ ఉండ‌దు కాబ‌ట్టి ప్రీమియంపై 3శాతం డిస్కౌంట్ ల‌భిస్తుంది.

పాల‌సీ కాల‌ప‌రిమితి

స‌ర‌ళ్ నివేశ్ నాన్ పార్టిసిపేటింగ్ పాల‌సీ కాబ‌ట్టి పెట్టుబ‌డి ప్ర‌యోజ‌నాలపై సంస్థ ముందుగానే హామీ ఇస్తోంది. 10 నుంచి 20 ఏళ్ల ప‌రిధిలో కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌చ్చు. దీనికి ప్రీమియం చెల్లించే కాలం 5 నుంచి 12 ఏళ్ల దాకా నిర్ణ‌యించారు. గ‌రిష్ఠంగా రూ.10ల‌క్ష‌ల బీమా హామీ సొమ్ము వ‌చ్చేలా పాల‌సీని ఎంచుకోవ‌చ్చు. బీమా హామీ సొమ్ము, పాల‌సీదారు వ‌య‌సు, పాల‌సీ కాల‌ప‌రిమితి, ప్రీమియం చెల్లింపు గ‌డువుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోనికి తీసుకొని ప్రీమియాన్ని నిర్ణ‌యిస్తుంది కంపెనీ.

పాల‌సీ ప్ర‌యోజ‌నాలు

మెచ్యూరిటీ తీరాక పాల‌సీ ప్ర‌యోజ‌నాలు నేరుగా పాల‌సీదారుకే చెందుతాయి. బీమా హామీ సొమ్ము మేర‌కు ప‌రిహారం చెల్లిస్తారు. పాల‌సీ గ‌డువు ఇంకా ఉండ‌గానే అనుకోకుండా పాల‌సీదారుకు ఏదైనా జ‌రిగితే నామినీకి లేదా ల‌బ్ధిదారుకు పాల‌సీ ప‌రిహారాన్ని అందిస్తారు.

  • వార్షిక ప్రీమియానికి ప‌దింత‌ల సొమ్ము
  • బీమా హామీ సొమ్ము
  • అప్ప‌టి దాకా చెల్లించిన ప్రీమియంల విలువ‌లో 105 శాతం
    పై మూడింటిలో ఏది ఎక్కువ విలువ అయితే ఆ మొత్తాన్ని ల‌బ్ధిదారుకు అందేలా బీమా సంస్థ చూసుకుంటుంది.

ప‌నిచేసే విధానం

35ఏళ్ల వ్య‌క్తి ఈ పాల‌సీ కొనేందుకు సుముఖ‌త చూపించాడ‌నుకుందాం. 20ఏళ్ల కాల‌ప‌రిమితి ఉన్న పాల‌సీకి 10ఏళ్ల పాటు ప్రీమియంలు చెల్లించే ప్లాన్ కొనుగోలు చేశార‌నుకుందాం.
మొత్తం బీమా హామీ సొమ్ము రూ.5లక్ష‌ల‌కు తీసుకున్న‌ట్ట‌యితే…వార్షిక ప్రీమియం రూ.24,917 అవుతుంది.
ఇలా ప‌దేళ్ల‌కు ప్రీమియం చెల్లించుకుంటే వెళ్తే పాల‌సీ ట‌ర్మ్ ముగిసే స‌మ‌యానికి పాల‌సీదారుకు రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం అందుతుంది. చెల్లించిన ప్రీమియంలతో పోలిస్తే నిక‌ర రాబ‌డి 4.5శాతం ఉంటుంది.
ఈ పాల‌సీని అర్థంచేసుకోవ‌డ‌మే కాదు కొన‌డ‌మూ చాలా సులువు

(Courtesy: LiveMint)

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly