గుంటూరులో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా గుంటూరులో శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు.

గుంటూరులో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు
  • క్ర‌మానుగ‌త మ‌దుపుతో లాభాలు
  • దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులే ఉత్త‌మం
    -సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు
GUNTUR-INNER-1.png

“జీవ‌న‌శైలిలో వ‌చ్చిన మార్పుల వ‌ల్ల ఖ‌ర్చులు పెరిగాయి. వీటిని త‌ట్టుకోవాలంటే…ఆదాయం ప్రారంభ‌మైన రోజు నుంచే మ‌దుపు చేయ‌డం అల‌వాటు చేసుకోవాలి” అని ఆర్థిక నిపుణులు సూచించారు. శ‌నివారం గుంటూరులో ‘ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్’ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్‌ క‌రీం ల‌ఖాని మాట్లాడుతూ …‘గ‌తంతో పోలిస్తే ఇప్పుడు వ‌స్తువులు, సేవ‌లు ధ‌ర‌లు ఎంత‌గానో పెరిగాయి. భవిష్య‌త్తులోనూ ఇది కొన‌సాగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఆదాయం పెరిగే కొద్దీ…పెట్టుబ‌డుల శాతం పెంచుకోవాలి. క్ర‌మానుగ‌తంగా పెట్టుబ‌డులు పెడుతుంటేనే …స‌గ‌టు ప్ర‌యోజ‌నం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి ల‌భిస్తుంది. ముఖ్యంగా ప్ర‌తి ఒక్క‌రూ ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ల గురించి ఆలోచించుకోవాలి. బీమా పాల‌సీలు పూర్తి అవ‌గాహ‌న‌తో తీసుకోవాలి. అనుకున్న ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకునే విధంగా పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంపిక చేసుకోవాలి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు దీర్ఘ‌కాలం కొన‌సాగించాల‌ని’ సూచిం చారు.

GUNTUR-INNER-2.png

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్‌ రీజ‌న‌ల్ హెడ్ ప‌ద్మ‌నాభ‌ముని మాట్లాడుతూ ‘ఈక్విటీల్లో పెట్టుబ‌డులు పెట్టేవారు స్వ‌ల్ప‌కాలంటోనే లాభాలు రాలేద‌ని మార్కెట్ నుంచి వైదొలుగుతున్నారు. ఇది స‌రికాదు. బంధువులు, స్నేహితులు సూచించార‌ని కాకుండా మార్కెట్‌పై అవ‌గాహ‌న పెంచుకుని మ‌దుపు చేస్తే ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. మ‌నం పెట్టుబ‌డి పెడుతున్న కంపెనీ త‌యారు చేస్తున్న ఉత్ప‌త్తి, దానికి మార్కెట్‌లో ఉన్న గిరాకీ, ప్ర‌స్తుత ప‌రిస్థితి త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీస‌కోవాలి. మ‌నం పెట్టిన పెట్టుబ‌డికి న‌ష్టం రాకుండా చూసుకోవ‌డ‌మే విజ‌య ర‌హ‌స్యం. మార్కెట్ పెరుగుతున్నా…త‌గ్గుతున్నా …పెట్టుబ‌డుల‌ను ఆప‌కుండా కొన‌సాగించాల‌ని’ వివ‌రించారు. దీంతోపాటు నిపుణులు స్టాక్ మార్కెట్ ప్ర‌స్తుత ప‌రిస్థితి, ఆర్థిక ప్ర‌ణాళిక‌లు, ద్ర‌వ్యోల్బ‌ణం వ‌ల్ల భవిష్య‌త్తు అవ‌స‌రాల‌కు ఎంత మొత్తం అవ‌స‌రం అవుతుంద‌ని మ‌దుపు ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాల‌పై అనేక సూచ‌నలు చేశారు. మ‌దుప‌రుల సందేహాల‌ను నివృత్తి చేశారు. ‘ఈనాడు’ గుంటూరు ఇన్‌ఛార్జి పి.రామాంజ‌నేయులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly