ఖ‌మ్మంలో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా ఖ‌మ్మంలో అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించాయి

ఖ‌మ్మంలో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సు విశేషాలు
  • పెట్టుబడుల్లో వైవిద్యం ఉండాలి
  • ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి
    -సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులో నిపుణుల సూచనలు
IMG_20190907_184616.png

దీర్ఘకాలిక వ్యూహంతో కాస్త క్రమశిక్షణగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టినప్పుడే లాభాలు సంపాదించేందుకు అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచించారు . శనివారం ఖమ్మంలో ‘ఈనాడు సిరి ఇన్వెస్టర్స్ క్లబ్ , ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ , జెన్ మనీ’ సంయుక్తంగా నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సుకు మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా జెన్ మనీ జనరల్ మేనేజర్ జె .వేణుగోపాల్ మాట్లాడుతూ … 1990 లో జీడీపీ 300 బిలియన్ డాలర్ల లోపు ఉండేది . అక్కడి నుంచి నేడు 2. 6 ట్రిలియన్ డాలర్లు అంటే గత 3 దశాబ్దాల్లో సుమారు 9 రేట్లు పెరిగింది. ఇదే సమయంలో సెన్సెక్స్ 36 రేట్లు పెరిగింది. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందితే స్టాక్ మార్కెట్ మంచి ఫలితాలు అందిస్తుంది . ప్రస్తుత మందగమనంలో ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లాలంటే ప్రభుత్వ పెట్టుబడులకు తోడు , ప్రైవేట్ భాగస్వామ్యం , ఎగుమతులు , వినియోగం పెరిగేలా అడుగులు పడాలి . మంచి వ్యూహం, క్రమశిక్షణ లేకుంటే ట్రేడింగ్ లో ఎక్కువ సందర్భాల్లో నష్టాల్లో వస్తాయి . సరైన కంపెనీని సరైన ధరకు కొని దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగిస్తేనే మంచి లాభాలు పొందవచ్చు. నిరాశావాదం ఎక్కువ ఉన్నపుడు మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం . ఆశావాదం కన్పిస్తుంటే లాభాలను స్వీకరించాలి . ఒక్కో పెట్టుబడి పథకం ఒక్కో సమయంలో మంచి రాబడిని అందిస్తుంది . ఎప్పుడు ఏ పథకం ఎంత ప్రతిఫలం ఇస్తుందన్నది కచ్చితంగా చెప్పడం ఎవరికి సాధ్యంకాదు. అందుకే వీలైనంతగా వైవిధ్య పెట్టుబడి పథకాలను ఎంచుకొని మదుపు చేయడమే మేలు అని సూచించారు .

IMG_20190907_180044.png

ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ ప్రాంతీయ అధిపతి బి . రాజేంద్ర మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు పొదుపు మదుపు చేసాకే ఉన్నంతలో ఖర్చు చేసినపుడే ఆర్థిక స్వేచ్ఛ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కాలంతో పాటు విలువ కరిగిపోయే విధంగా కాకుండా పెట్టుబడి వృద్ధి చెందే పథకాలను ఎంచుకోవాలి . మార్కెట్ హెచ్చుతగులను అధిగమిస్తూ సగటు ప్రయోజనాన్ని పొందాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో క్రమానుగత ఎట్టుబడి విధానం (సిప్ ) ని ఎంచుకోవడం ఉత్తమం. వీలైనంత కాలం పెట్టుబడిని కదపకూడదు . సంపాదించే వయసులోనే పదవి విరమణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. ద్రవ్యోల్భణం అధిగమించేలా, రాబడి వచ్చేలా పెట్టుబడులు ఉండాలి . అప్పుడే ఆర్థిక విజయం సాధించగలం అని తెలిపారు. సదస్సుకు ఈనాడు ఖమ్మం యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీధర్ లాల్ హాజరయ్యారు

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly