మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్- జెన్ సెక్యూరిటీస్ సంయుక్తంగా ఆదివారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వ‌హించింది

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్
  • ఖర్చులను తట్టుకునేలా రాబడి రావాలి
  • పెట్టుబడి పథకాల ఎంపికలో ఇదే ముఖ్యం
    -సిరి ఇన్వెస్టర్స్‌ క్లబ్‌ సదస్సులో నిపుణుల సూచనలు

దీర్ఘకాలిక లక్ష్యాలకు అనువైన పెట్టుబడి పథకాలను ఎంపిక చేసుకోవడంలోనే ఆర్థిక విజయం ఆధారపడి ఉంటుందని నిపుణులు సూచించారు. పిల్లల చదువులు, వారి వివాహం, ఆరోగ్యం, ఉద్యోగ విరమణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు వేసుకోవాలన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ‘ఈనాడు సిరి ఇన్వెస్టర్స్‌ క్లబ్‌, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, జెన్‌ మనీ’ సంయుక్త ఆధ్వర్యంలో మదుపరుల అవగాహన సదస్సు జరిగింది.

ఇందులో ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రీజినల్‌ హెడ్‌ వెంకట వినోద్‌ మాట్లాడుతూ… ద్రవ్యోల్బణం కొనుగోలు శక్తిని తగ్గిస్తుందని, పెట్టుబడి పెట్టే సమయంలో ఈ విషయాన్ని గమనించాలన్నారు. పెరుగుతున్న ఖర్చులకు దీటుగా రాబడిని పొందేలా మదుపు పథకాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. ‘సంపాదనలోని మిగులు మొత్తాన్ని షేర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌, స్థిరాస్తి, బ్యాంకు డిపాజిట్లు ఇలా వైవిధ్యంగా మదుపు చేయాలి. చిన్న వయసు నుంచే దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రారంభిస్తే ఎటువంటి ఆర్థిక లక్ష్యాలనైనా సాధించవచ్ఛు స్వల్ప కాలంలోనే అధిక రాబడి రావాలని ఆశించడం సరికాదు. వచ్చిన ఆదాయంలో నుంచి కొంత పొదుపు చేయాలి. ఆ తరవాతే ఖర్చు చేయాలనే సూత్రాన్ని పాటించాలి. ప్రస్తుత ఆదాయం, ఖర్చు ఎంత? భవిష్యత్తులో మన అవసరాలు ఏ మేర ఉంటాయి? తదితర వాటిని విశ్లేషించుకోవాలి. అందుకు అనుగుణంగా మదుపు చేయాలి’ అని వివరించారు.

18DSC4.png

జెన్‌ మనీ ఫండ్‌ మేనేజర్‌ నేతి రామకృష్ణ మాట్లాడుతూ… ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాగుంటే కంపెనీల పరిస్థితులూ బాగుండే అవకాశాలు ఉంటాయన్నారు. ‘షేర్‌ ధర ఆ వృద్ధిని అనుసరిస్తుంది. వచ్చే మూడు నుంచి ఆరు నెలల కాలంలో దశల వారీగా మంచి కంపెనీల షేర్లలో మదుపు చేయొచ్ఛు దీర్ఘకాలిక వ్యూహాన్ని అనుసరించాలి. అప్పు చేసి పెట్టుబడులు పెట్టకూడదు. సరైన వ్యూహం, క్రమశిక్షణ లేకుండా మార్కెట్లో ట్రేడింగ్‌ చేస్తే నష్టాలు వచ్చే అవకాశమే ఎక్కువ’ అని పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు వల్ల లాభాలు, ఆర్థిక ప్రణాళికల అవసరం, బీమా తదితర అంశాలపైనా వారు మదుపరులకు అవగాహన కల్పించారు. పలు అంశాలపై వారి సందేహాలను నివృత్తి చేశారు. ‘ఈనాడు’ మహబూబ్‌నగర్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి శ్రీధర్‌ హాజరయ్యారు.

18DSC6.png

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly