గుంటూరులో జ‌రిగిన ఈనాడు సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా గుంటూరులో శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు.

గుంటూరులో జ‌రిగిన ఈనాడు సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్, గుంటూరు, తేదీ 15.06.2019
క్ర‌మానుగ‌త మ‌దుపుతో ఆర్థిక భ‌రోసా…

  • ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మించి రాబ‌డి రావాలి
  • వార్షికాదాయానికి 20 రెట్ల బీమా

ప్ర‌తి వ్య‌క్తి తాను అనుకున్న ఆర్థిక ల‌క్ష్యాలు సాధించాలంటే క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు పెట్ట‌డంతో పాటు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మిచం రాబ‌డులు వ‌చ్చే ప‌థ‌కాల‌ను ఎంపిక చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ల‌లో హెచ్చుత‌గ్గులుఉ స‌ర్వ‌సాధార‌ణం. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాల పెట్టుబ‌డులు పెడ‌దామ‌ని వ‌చ్చిన మ‌దుప‌రులు సైతం రెండేళ్ల‌పాటు స‌రైన వృద్ధి క‌నిపించ‌క‌పోతే డ‌బ్బు వెన‌క్కి తీసుకుంటారు. దీనివ‌ల్ల వారు ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డంతో పాటు అనుకున్న ల‌క్ష్యాల‌ను చేరుకోలేక‌పోతున్నారు. మార్కెట్‌లో ఎటువంటి ప‌రిస్థితులు ఉన్నా క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు (సిప్‌) ఆప‌కూడ‌దు అని మార్కెట్ నిపుణులు సూచించారు. శ‌నివారం గుంటూరు న‌గ‌రంలో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు విశేష స్పంద‌న ల‌భించింది. తొలుత ఈనాడు గుంటూరు యూనిట్ ఇన్‌ఛార్జి పి.రామాంజ‌నేయులు మ‌దుప‌రుల స‌ద‌స్సు ల‌క్ష్యాల‌ను వివ‌రించారు. అనంత‌రం నిపుణులు మార్కెట్‌పై మ‌దుప‌రుల‌కు ఉన్న సందేహాల‌ను నివృత్తి చేశారు.

ల‌క్ష్యాల‌కు అనుగుణంగా…
ఆచంట శ్రీనివాస్, ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ రీజ‌న‌ల్ హెడ్
IMG_20190615_180525.jpg
ఆర్థిక లక్ష్యాలు నిర్థేశించుకొని అందుకు అనుగుణంగా రాబ‌డి వ‌చ్చే పెట్టుబ‌డి ప‌థ‌కాల‌ను ఎంపిక చేసుకోవాలి. మనం ఎంత సంపాదించాం అనే దాని కంటే ఎంత ఖ‌ర్చు పెడుతున్నాం అన్న‌దే కీల‌కం. ఖ‌ర్చుల్ని త‌గ్గించి, మ‌దుపు పెంచిన‌ప్పుడే ల‌క్ష్యాల‌ను చేరుకుంటాం.

  • మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో డెట్, లిక్విడ్, ఈక్విటీలు ఉంటాయి. మ‌న ల‌క్ష్యాల‌ను స్వ‌ల్ప, మ‌ధ్య‌, దీర్ఘ‌కాలికంగా విభ‌జించుకొని పెట్టుబ‌డులు అందుకు అనుగుణంగా వివిధ ప‌థ‌కాల‌ను ఎంచుకోవాలి. ఏడాదిలోపు అయితే లిక్విడ్, 3 నుంచి 5 ఏళ్ల‌లోపు డ‌బ్బులు అవ‌స‌ర‌మైతే డెట్, 7 నుంచి 10 సంవ‌త్స‌రాలు అయితే ఈక్వీటీల్లో పెట్టుబ‌డులు పెట్టాలి.
  • ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక రాబ‌డి, త‌క్కువ రిస్క్ ఉండే బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు. కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోగ‌లిగితే మ‌ల్టీ అసెట్ ఫండ్స్ ఎంపిక చేసుకోవ‌చ్చు.
  • పెట్టుబ‌డి ప‌థ‌కాలు ఏవైనా ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అధిగ‌మించి రాబ‌డి ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటు ప్ర‌భుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ ఉన్న సంస్థ‌ల్లోనే పెట్టుబ‌డులు పెట్టాలి.
  • మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప్ర‌తినెలా కొంత మొత్తం చేయ‌డాన్నే సిప్ అంటారు. క్ర‌మ‌శిక్ష‌ణగా దీర్ఘ‌కాలం ఈ విధానంలో మ‌దుపు చేస్తే మంచి రాబ‌డికి అవ‌కాశం ఉంది. ఆదాయం మొద‌లైన ప్రారంభం నుంచే సిప్ చేయ‌డం మంచిది.
  • విశ్రాంత ఉద్యోగులు క్ర‌మానుగ‌త ఉప‌సంహ‌ర‌ణ ప్ర‌ణాళిక (ఎస్‌డ‌బ్ల్యూపీ) లో పెట్టుబ‌డి పెట్టి ప్ర‌తినెలా సొమ్ము తీసుకోవ‌చ్చు. పెట్టుబ‌డి పెట్టిన త‌ర్వాత 13 వ నెల నుంచి తీసుకోవ‌డం మంచిది.

ఉద్యోగంలో చేరిన‌ప్పుడే…
పి. సాయికృష్ట‌, స‌ర్టిఫైడ్ ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్

IMG_20190615_185129.jpg
సంపాదించే ప్ర‌తి వ్య‌క్తీ త‌న అవ‌స‌రాలు, కోరిక‌లు మ‌ధ్య వ్య‌త్యాసాన్ని తెలుసుకోవాలి. కోరిక‌ల‌ను అవ‌స‌రాలుగా భావించి ఖ‌ర్చుపెడితే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడ‌తాయి. ఆర్థిక ల‌క్ష్యాల‌ను గుర్తించి వాటిని చేరుకోవ‌డానికి ప్ర‌ణాళిక‌లు రూపొందించుకొని అందుకు అనుగుణంగా మ‌దుపు ప‌థ‌కాల‌ను ఎంచుకోవాలి.

IMG_20190615_185154.jpg
  • ఉద్యోగంలో చేరిన‌ప్పుడు విశ్రాంత జీవితానికి స‌రిపోయేంత ఆదాయాన్ని సంపాదించే ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోవాలి. అందుకు అనువైన పెట్టుబ‌డులు ఎంచుకొని దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డులు పెట్ట‌డం వ‌ల్ల‌నే అవ‌స‌ర‌మైన నిధి స‌మ‌కూరుతుంది.
  • వార్షికాదాయానికి 20 రెట్ల విలువైన జీవిత బీమా పాల‌సీలు తీసుకోవ‌డం ఉత్తమం. ఒక‌వేళ త‌క్కువ మొత్తం వ‌చ్చేట‌ట్లు బీమా చేస్తే అనుకోని ప‌రిస్థితుల్లో ఆ మొత్తం కుటుంభానికి భ‌రోసా క‌ల్పించ‌వ‌ని గుర్తించాలి.
  • ఆస్తులు సంపాదించ‌డ‌మే కాదు…వాటిని కాపాడుకోవ‌డంతో పాటు వార‌సుల‌కు ఎవ‌రికి ఎంత సొమ్ము ఎప్పుడు వెళ్లాలో తెలిపేలా వీలునామా రాయ‌డం త‌ప్ప‌నిస‌రి. దీనివ‌ల్ల కుటుంబ‌స‌భ్యుల‌కు ఇబ్బందులు ఉండ‌వు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly