కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతీ..

ఒక్క మే నెలలోనే 17,039 యూనిట్లను విక్రయించినట్లు సంస్థ తెలిపింది

కార్ల అమ్మకాల్లో దూసుకుపోతున్న మారుతీ..

దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మొదటి 10 కార్లలో ఎనిమిది కార్లు మారుతీ సుజుకీ సంస్థకు చెందినవేనని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏఎం) తెలిపింది. మే నెలలో అమ్ముడైన కార్ల జాబితా ఆధారంగా ఎస్ఐఏఎం ఈ వివరాలను తెలిపింది.

ఎస్ఐఏఎం ప్రకారం, మారుతీ సుజుకీ సంస్థకు చెందిన పాపులర్ హ్యాచ్‌ బ్యాక్ కారు ‘స్విఫ్ట్’ మే నెలలో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఒక్క మే నెలలోనే 17,039 యూనిట్లను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. సంస్థకు చెందిన ఎంట్రీ లెవల్ మోడల్ అయిన ‘ఆల్టో’ 16,394 యూనిట్ల అమ్మకాలతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక మూడవ స్థానంలో మారుతీ సుజుకీ సంస్థకే చెందిన కాంపాక్ట్ సెడాన్ ‘డిజైర్’ నిలిచింది. దేశవ్యాప్తంగా 16,196 యూనిట్లను సంస్థ విక్రయించింది. గత ఏడాది ఇదే నెలలో 24,365 యూనిట్ల అమ్మకాలతో ‘డిజైర్’ మొదటి స్థానంలో ఉంది.

అనంతరం 15,176 యూనిట్ల విక్రయాలతో ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ ‘బ్యాలనో’ నాల్గవ స్థానంలో ఉంది, ఇది గత ఏడాది మే నెలలో 19,398 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇక ఐదవ స్థానంలో కొత్త వ్యాగన్ ఆర్ నిలిచింది. మే నెలలో 14,561 యూనిట్ల వ్యాగన్ ఆర్ కార్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది మే నెలలో పాత వ్యాగన్ ఆర్ 15,974 యూనిట్లతో ఐదవ స్థానంలోనే నిలిచింది. మే నెలలో 11,739 యూనిట్ల విక్రయాలతో మారుతీకి చెందిన యుటిలిటీ వాన్ ఈకో ఆరో స్థానంలో నిలిచింది.

అనంతరం హ్యుందాయ్ మోటార్ ఇండియాకు చెందిన ఎస్‌యూవీ క్రెటా గత నెలలో 9,054 యూనిట్లను విక్రయించి ఏడవ స్థానాన్ని నిలుపుకుంది. గత ఏడాది మే నెలలో 11,004 యూనిట్లను సంస్థ విక్రయించింది. తరువాతి స్థానంలో కూడా హ్యుందాయ్ మోటార్ ఇండియాకు చెందిన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఎలైట్ ఐ20 నిలిచింది. మొత్తం 8,958 యూనిట్ల విక్రయంతో ఎనిమిదో స్థానంలో నిలిచింది. గత ఏడాది మే నెలలో 10,664 యూనిట్లను విక్రయించి తొమ్మిదవ స్థానంలో ఉంది.

అనంతరం మారుతీ సుజుకీ సంస్థకు చెందిన మల్టీ పర్పస్ కారు ‘ఎర్టిగా’ 8,864 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదవ స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో కూడా మారుతీ సుజుకీ సంస్థకే చెందిన కాంపాక్ట్ కారు ‘విటారా బ్రీజా’ 8,781 యూనిట్లతో పదవ స్థానంలో నిలిచింది. గత ఏడాది మేలో 15,629 యూనిట్లతో అత్యధికంగా అమ్ముడైన కారు ‘విటారా బ్రీజా’ కావడం విశేషం.

భారతదేశంలో మొత్తం కార్ల అమ్మకాలు దాదాపు 20 శాతం తగ్గి 2,39,347 యూనిట్లకు పడిపోయాయి. అంతకుముందు ఏడాది వీటి సంఖ్య 3,01,238 యూనిట్లుగా ఉంది.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly