ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు దీపావళి కానుక..

జోనల్ కార్యాలయాలు సమర్పించిన సమాచారం ఆధారంగా 60 రోజుల బోనస్‌ను అంచనా వేసినట్లు నోటిఫికేషన్ తెలిపింది

ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు దీపావళి కానుక..

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) తన ఉద్యోగులకు దీపావళి కానుక ఇచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ఓలోని అన్ని గ్రూప్ ‘సీ’, గ్రూప్ ‘బీ’ (నాన్-గెజిటెడ్) ఉద్యోగులకు 60 రోజుల ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్‌బీ) ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓ నిర్ణయించింది. జోనల్ కార్యాలయాలు సమర్పించిన సమాచారం ఆధారంగా 60 రోజుల బోనస్‌ను అంచనా వేసినట్లు నోటిఫికేషన్ తెలిపింది.

బోనస్ చెల్లింపులు ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన సూచనలు, ఇతర నిబంధనల ప్రకారం ఉంటుందని నోటిఫికేషన్ తెలిపింది. ఈపీఎఫ్‌ఓ ఉద్యోగుల బోనస్‌ను నిర్ణయించే సూత్రం (సగటు ఎమోల్యూమెంట్స్ X రోజుల సంఖ్య) /30.4* (* అంటే నెలలో సగటు రోజుల సంఖ్య). ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు వడ్డీని జమ చేసే ప్రక్రియను ఈపీఎఫ్‌ఓ ​​ప్రారంభించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను చాలా మంది పీఎఫ్ ఖాతాదారులు ఇప్పటికే 8.65 శాతం వడ్డీని పొందారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో, కార్మిక మంత్రి నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఈపీఎఫ్‌ఓ 2018-19 సంవత్సరానికి గాను ఈపీఎఫ్‌ఓ పై వడ్డీ రేటును 8.65 శాతానికి పెంచాలని నిర్ణయించింది. గత మూడు సంవత్సరాలలో వడ్డీ రేటును పెంచడం ఇదే మొదటిసారి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly