ఈ-ఇన్‌స్పెక్ష‌న్‌ వ్యవస్థను ప్రారంభించనున్న ఈపీఎఫ్ఓ...

డేటాలో అసమతుల్యత కారణంగా కొద్ది శాతం మంది ఉద్యోగులు యూఏఎన్ ను జనరేట్ చేయలేకపోతున్నారు.

ఈ-ఇన్‌స్పెక్ష‌న్‌ వ్యవస్థను ప్రారంభించనున్న ఈపీఎఫ్ఓ...

ఈపీఎఫ్ఓ కొత్తగా ఒక ఈ-ఇన్స్పెక్షన్ వ్యవస్థను ప్రారంభించనుంది, ఇది తనిఖీ ప్రక్రియను సులభతరం చేస్తుందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ సునీల్ బార్త్వాల్ తెలిపారు. విచారణ కాలాన్ని గరిష్టంగా రెండేళ్లకు పరిమితం చేసే చట్టాన్ని సవరించాలని ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ప్రతిపాదించినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆర్గనైజ్డ్ ఇంటరాక్టివ్ సెషన్‌లో సునీల్ తెలిపారు.

డేటాలో అసమతుల్యత కారణంగా కొద్ది శాతం మంది ఉద్యోగులు యూఏఎన్ (12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నంబర్) ను జనరేట్ చేయలేకపోతున్నారని, ఈ సమస్యను పరిష్కరించడానికి ఈపీఎఫ్ఓ ప్రత్యామ్నాయ ప్రామాణీకరణను పరిశీలిస్తోందని సునీల్ తెలిపారు. యూఏఎన్ ను ఆధార్‌, బ్యాంకు ఖాతా, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో లింక్ చేసిన కేవైసీ కంప్లైంట్ లబ్ధిదారుల ఫిర్యాదులను మూడు రోజులల్లో సెటిల్మెంట్ చేసే విధంగా ఈపీఎఫ్ఓ పనిచేస్తుందని ఆయన తెలిపారు.

దుర్వినియోగం, అవినీతిని అరికట్టడానికి ఐసీఏఐ (ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) మాదిరిగా స్వీయ నియంత్రణ కన్సల్టెంట్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని బార్త్వాల్ ప్రతిపాదించారు. అలాగే ఎగవేతదారులను విచారించటానికి, కేసులను ఆర్థిక నేరంగా పరిగణించాలని ఆయన ప్రతిపాదించారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly