మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరును ఎలా తెలుసుకుంటున్నారు?

మీరు పెట్టుబ‌డులు చేసిన ఫండ్ల‌ను ఇత‌ర సంబంధిత ఫండ్ల‌తో పోల్చిచూసుకొని ప‌నితీరును తెలుసుకోవాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరును ఎలా తెలుసుకుంటున్నారు?

మ్యూచువ‌ల్ ఫండ్ల పనితీరును తెలుసుకునేందుకు మొద‌టిగా చూసేది రాబ‌డి. మ‌రి ఎంత లాభం వ‌స్తే ఫండ్ ప‌నితీరు బాగుంద‌ని అంచనా వేస్తారు. దీనికి స‌మాదానం మూడు ద‌శ‌ల్లో దొరుకుతుంది.

త‌గిన లాభాలు వ‌స్తున్నాయా?

మొద‌ట‌గా పెట్టుబ‌డిదారుడు ల‌క్ష్యాల‌కు అనుగుణంగా క‌నీస రాబ‌డి వ‌స్తుందా? లేదా? చూసుకోవాలి. రాబ‌డి అంచ‌నా రేటు ఒక్కో పెట్టుబ‌డిదారుడికి ఒక్కో రకంగా ఉంటుంది. వ్య‌క్తుల నష్ట‌భ‌యం బ‌ట్టి రాబ‌డిఅంచ‌నా రేటు ఉంటుంది. క‌నీస రాబ‌డి రేటు అంచనా వేసేందుకు వివిధ అంశాల‌ను దృష్టిలో పెట్టుకోవాలి. త‌క్కువ కాలంలో ఎక్కువ నిధి స‌మ‌కూరాలంటే, రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉంటే, అప్పుడు ఎక్కువ రాబ‌డి రేటు అంచ‌నా వేయాలి. దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు కొన‌సాగించాల‌నుకుంటే త‌క్కువ పెట్టుబ‌డుల‌తో రిస్క్ త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. దీనికి రాబ‌డి రేటు త‌క్కువ ఉంటుంది. మీ పెట్టుబ‌డులు క‌నీస రాబ‌డిని చేరుకుంటున్నాయా అనేది చూసుకోవాలి.

బెంచ్‌మార్క్‌ని చేరుకుంటున్నాయా?

బెంచ్‌మార్క్ రాబడి ఒక నిర్దిష్ట కాలానికి మార్కెట్ నుంచి వచ్చే ఆదాయాన్ని సూచిస్తాయి. ఈక్విటీ పెట్టుబ‌డుల‌కు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ స్టాక్ మార్కెట్ సూచీలు దీనికి మంచి ఉదాహ‌ర‌ణ‌. ఈ సూచీల రాబ‌డిని బెంచ్‌మార్క్‌గా పెట్టుకోవ‌చ్చు. యాక్టివ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే రాబ‌డి ఫండ్ మేనేజ‌ర్ల నిర్వ‌హ‌ణ‌లో ఫండ్లు మంచి ప‌నితీరును క‌న‌బ‌రుస్తాయ‌ని ఆశించ‌వ‌చ్చు. అయితే బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్న రాబ‌డి అంచ‌నా పోర్ట్ఫోలియోకి స‌రిపోలేదిగా ఉండాలి. ఉదాహ‌ర‌ణ‌కు మిడ్‌క్యాప్ ఫండ్‌ను లార్జ్‌ క్యాప్ ఫండ్‌తో పోల్చాల‌నుకుంటే ఫండ్ ప‌నితీరును తెలుసుకోవ‌డం క‌ష్టం.

ఇత‌ర‌ ఫండ్ల‌తో పోటీపడుతున్నాయా?

ఫండ్ మేనేజ‌ర్ మీ పెట్టుబ‌డుల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హిస్తున్నారా? అనేది తెలుసుకునేందుకు ఇత‌ర ఫండ్ల‌తో పోల్చిచూసుకుంటే ఈ విష‌యం అర్ధ‌మ‌వుతుంది. ఫండ్ ప‌నితీరును తెలుసుకునేందుకు ఎంచుకుంటున్న కంపెనీల ఫండ్లు అదే కేట‌గిరీ లేదా రంగానికి చెందినవై ఉండాలి. ఉదాహ‌ర‌ణ‌కు స్వ‌ల్ప‌కాలిక డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేస్తే అల్ర్టా షార్ట్ డెట్ ఫండ్‌ను దీర్ఘ‌కాలం డెట్ ఫండ్ల‌లో పొదుపు చేసే మ‌నీ మార్కెట్ సాధ‌నాల‌ను పోల్చి చూస్తే ఎటువంటి ఫ‌లితం ఉండ‌దు. మీ పెట్టుబ‌డులు స‌రైన‌వేనా కాదా తెలుసుకోవాలంటే ఇవ‌న్నీ ప‌రిశీలించిన త‌ర్వాత నిర్ణ‌యించుకోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly