గ‌డువు త‌ర్వాత పీపీఎఫ్ కొన‌సాగిస్తే ..!

చిన్న వ‌య‌సులో పీపీఎఫ్ ప్రారంభిస్తే 15 ఏళ్ల త‌ర్వాత తిరిగి కొన‌సాగించినా ప్ర‌యోజ‌నం ఉంటుంది.

గ‌డువు త‌ర్వాత పీపీఎఫ్ కొన‌సాగిస్తే ..!

పీపీఎఫ్ మెచ్యూరిటీ గ‌డువు 15 సంవ‌త్స‌రాలు అని తెలిసిందే. ఉదాహ‌ర‌ణ‌కు 2010-11 ఆర్థిక సంవ‌త్స‌రంలో అంటే మార్చి 2011 కి ముందు పీపీఎఫ్ ఖాతా ప్రారంభిస్తే ఏప్రిల్ 2026 కి గ‌డువు ముగుస్తుంది. పీపీఎప్‌పై ఉన్న అద‌న‌పు నియ‌మ, నిబంధ‌న‌లు ఏంటో తెలుసుకుందాం.

పీపీఎఫ్ చందాదారుల‌కు మెచ్యూరిటీ త‌ర్వాత ఉండే 3 ఆప్ష‌న్లు:

  • ఆప్ష‌న్ ఎ - ఖాతా మూసివేత‌
  • ఆప్ష‌న్ బి - గ‌డువు ముగిసిన త‌ర్వాత ఎలాంటి డిపాజిట్లు చేయ‌కుండా ఖాతా కొన‌సాగించ‌డం.
  • ఆప్ష‌న్ సి - ఖాతాలో డిపాజిట్ చేస్తూ మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు కొన‌సాగించ‌డం

ఆప్ష‌న్ ఎ గురించి అందరికే తెలిసిందే. ఇక రెండు, మూడు ఆప్ష‌న్ల‌ను ప‌రిశీలిస్తే ఆప్ష‌న్ బి చాలా మంచి స‌దుపాయ‌మ‌నే చెప్పుకోవ‌చ్చు. ఖాతాను ఎలాంటి డిపాజిట్ చేయ‌కుండా అదేవిధంగా కొన‌సాగిస్తే మొత్తంపై వ‌డ్డీ ల‌భిస్తుంది. అయితే గ‌డువు ముగిసిన త‌ర్వాత ఏడాది లోపు ఖాతా గ‌డువును పొడ‌గించుకోవాలి ఏడాది ముగిస్తే తిరిగి కొన‌సాగించేందుకు అవ‌కాశం ఉండ‌దు. అయితే డ‌బ్బు డిపాజిట్ చేసుకునేందుకే ఈ ఖాతానుకొన‌సాగిస్తే ఉప‌యోగం ఉంటుంది. అంతేకాని, పన్ను మిన‌హాయింపుల కొర‌కు , నిధిని స‌మ‌కూర్చుకునేందుకు అయితే ఈ ఖాతాను కొన‌సాగించ‌డం అన‌వ‌స‌రం. అప్పుడు ఒక ఆర్థిక సంవ‌త్స‌రానికి చందాదారుడు కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అదేవిధంగా ఒక ఖాతా పూర్తిగా మూసివేసే వ‌ర‌కు మ‌రో ఖాతాను ప్రారంభించేందుకు వీలుండ‌దు.

ఆప్ష‌న్ సి:

గ‌డువు త‌ర్వాత పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాల‌నుకుంటే ఐదేళ్లు క‌చ్చితంగా ఖాతాను కొన‌సాగించ‌వ‌ల‌సి ఉంటుంది. ఏడాదికి క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాలి.

ఫారం హెచ్ తో కొన‌సాగింపు:

ఖాతా కొన‌సాగించ‌కుండా డిపాజిట్లు చేస్తే దానిపై వ‌డ్డీ రాదు. అదేవిధంగా సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపులు ల‌భించ‌వు. ఒక‌సారి డిపాజిట్లు చేసేందుకు ఖాతా కొన‌సాగింపు కోరుకున్నాక తిరిగి ర‌ద్దు చేసుకోవ‌డానికి వీలుండ‌దు. ఖాతా కొన‌సాగాలంటే క‌నీస డిపాజిట్ చేయ‌వ‌ల‌సి ఉంటుంది.

చందాదారుడికి ఏడాదికి ఒక‌సారి పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు వీలుంటుంది. మొత్తం ఐదేళ్ల కాలంలో ఖాతాలో ఉన్న మొత్తంలో ఒక‌ ఏడాదికి 60 శాతానికి మించి విత్‌డ్రా చేసుకోకూడ‌దు. ఖాతాదారుడి అవ‌స‌రం మేరకు మొత్తం ఒకేసారి లేదా వాయిదాలుగా ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. పీపీఎఫ్ మెచ్యూరిటీ గ‌డువు 15 ఏళ్లు ముగిసిన త‌ర్వాత ఈ విధంగా మూడు సార్లు ఐదేళ్ల చొప్పున ఖాతా కొన‌సాగించేందుకు అవ‌కాశం ఉంటుంది. కొన‌సాగించిన ప్ర‌తీసారి విత్‌డ్రా నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.

ఆప్ష‌న్ బీ, ఆప్ష‌న్ సి మ‌ధ్య చిన్న వ్య‌త్యాసం ఉంది. ఖాతాను కొన‌సాగించేముందు డ‌బ్బు అవ‌స‌రాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఖాతాను కొన‌సాగించే అవ‌స‌రం లేక‌పోతే చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

పిల్ల‌ల చ‌దువుల‌కు డ‌బ్బు అవ‌స‌ర‌మ‌నుకుంటే ఆప్ష‌న్ బి ఎంచుకోవ‌డం మేలు. అదే ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం అయితే మీకు ఉన్న డ‌బ్బు అవ‌స‌రాన్ని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోవ‌చ్చు. పీపీఎఫ్ ఖాతా చిన్న వ‌య‌సులో ఉన్న‌ప్పుడు ప్రారంభిస్తే గ‌డువు ముగిసిన త‌ర్వాత ఇలా కొన‌సాగింపు చేస్తే ప్ర‌యోజ‌నం ఉంటుంది. మొద‌ట త‌క్కువ మొత్తంతో పెట్టుబ‌డులు కొన‌సాగిస్తూ 40-50 ఏళ్ల వ‌య‌సులో ఈక్విటీ పెట్టుబ‌డుల‌ను త‌గ్గిస్తూ, పీపీఎఫ్‌లో డిపాజిట్ల‌ను పెంచుతూ పోవాలి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly