స‌రైన ప్ర‌ణాళిక‌తో పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు భ‌రోసానివ్వండి

సంపాదించడం ప్రారంభించిన తొలి రోజుల నుంచే ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకుంటే దీర్ఘ‌కాలంలో ఎక్కువ నిధి(లార్జ్ కార్ప‌స్‌)ను స‌మ‌కూర్చుకోగ‌ల‌రు.

స‌రైన ప్ర‌ణాళిక‌తో పిల్ల‌ల భ‌విష్య‌త్తుకు భ‌రోసానివ్వండి

త‌ల్లిదండ్రులు వారి పిల్లల‌కు ఇచ్చే గొప్ప బహుమ‌తి ఏంటి?- నాణ్య‌మైన విద్య‌. పిల్ల‌లు ఆత్మ‌విశ్వాసంతో వారి వృత్తి, ఉద్యోగాల‌లో మంచి ప‌రిణితి సాధించేందుకు, వారి జీవిత ల‌క్ష్యాల‌ను సాధించేందుకు ఎంతోగానే తోడ్ప‌డుతుంది. వారు ప‌నిచేసే రంగంలోని ఇండ‌స్ట్రీలు, సంస్థ‌లులో లీడ‌ర్‌గా ఎద‌గ‌డంతో పాటు, త‌రువాతి త‌రాల‌కు ఆద‌ర్శంగా నిలుస్తారు. విద్య వారిని పారిశ్రామిక వేత్త‌లుగా తీర్చిదిద్దుతుంది. చాలా మందికి ఉపాది క‌ల్పిస్తుంది. దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ప్రొఫెషనల్ మార్గం - అర్హత ఉన్న నిపుణుల ద్వారా, ప్రపంచ స్థాయి నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానంతో, స్థిరమైన దీర్ఘకాల వృద్ధిని సాధించేందుకు అవ‌కాశం ఉంటుంది. జ‌నాభా పెరుగుద‌లతో పాటు, జీవ‌ణ ప్ర‌మాణాలు కూడా మెరుగుపెడుతుండ‌టం వ‌ల్ల‌ నాణ్య‌మైన వ‌స్తువుల ఉత్ప‌త్తి, వాటి నిర్వ‌హ‌ణ ఎంతో అవ‌స‌రం. దేశీయంగా ఇటువంటి ఉత్ప‌త్తుల‌ను త‌యారీ చేసేందుకు నిపుణుల అవ‌స‌రం ఎంత‌గానో ఉంది. ఇది మెరుగైన విద్య‌ను అందించ‌డం ద్వారా మాత్ర‌మే సాధ్య‌మ‌వుంతుంది. అన్ని స్థాయిల‌లోనూ నాణ్య‌మైన విద్య‌ను అందించే సంస్థ‌లు కొన్ని మాత్ర‌మే ఉన్నాయి. చిన్న‌ప్ప‌టీ నుంచీ నాణ్య‌మైన విద్య అందించ‌గ‌లిగితే, ఉన్న‌త త‌ర‌గ‌తుల‌లో మిగిలిన విద్యార్ధుల‌తో పోటి ప‌డ‌టం సుల‌భమ‌వుతుంది. నాణ్య‌మైన విద్య కోసం ఖ‌ర్చు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. స‌రైన ఆర్ధిక ప్ర‌ణాళిక ద్వారా ల‌క్ష్యాన్ని చేరుకోగ‌ల‌రు. సంపాద‌న ప్రారంభ‌మైన నాటి నుంచి ల‌క్ష్యాల‌కు అధిక ప్రాధ‌న్య‌త ఇవ్వాలి. పిల్ల‌ల విద్య‌తో పాటు ఇంటి కొనుగోలు, ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌, కారు కొనుగోలు, విహార‌యాత్ర‌లు వంటి ల‌క్ష్యాల‌ను చేరుకునేందుకు త‌గిన ప్ర‌ణాళిక రూపొందించుకుని, మ‌దుపు చేయాల్సి ఉంటుంది. సంపాదించడం ప్రారంభించిన తొలి రోజుల నుంచే ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకుంటే దీర్ఘ‌కాలంలో ఎక్కువ నిధి(లార్జ్ కార్ప‌స్‌)ను స‌మ‌కూర్చుకోగ‌ల‌రు.

ఉదాహ‌ర‌ణ‌కి, అనిల్ 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో ఉద్యోగంలో చేరాడు. త‌న 30 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నాడు. 32 సంవ‌త్స‌రాలకు పిల్ల‌లు పుడితే, అత‌నికి 35 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చేస‌రికి పిల్ల‌ల‌ను స్కూల్‌లో చేర్పించాలి. నాణ్య‌మైన విద్య కోసం ప్ర‌ముఖ విద్యాసంస్థ‌లో చేర్చేందుకు త‌గిన మొత్తం అవ‌స‌రం. ఇందుకు చాలా పెట్టుబ‌డి మార్గాలు ఉన్నాయి. అయితే మ‌దుపు చేయ‌డం ప్రారంభించే ముందు, ఎంచుకున్న పెట్టుబ‌డుల‌ నియ‌మ నిబంధ‌న‌లు, కాల‌ప‌రిమితి, రాబ‌డి, లిక్వీడిటీ, ర‌క్ష‌ణ‌, ప‌న్ను ప్ర‌యోజ‌నాలు, ప్ర‌భుత్వ విధానాల‌ను అర్ధంచేసుకోవాలి.

రిక‌రింగ్ డిపాజిట్ ఖాతా:
మొద‌టి నెల సంపాద‌నతో ప్రారంభించి, కొంత స్థిర మొత్తాన్ని, స్థిర వ‌డ్డీ రేటుతో నియ‌మిత కాలంపాటు డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ స‌మ‌యానికి అందుబాటులో ఉన్న మొత్తాన్ని అంచ‌నా వేయ‌వ‌చ్చు. ఈ విధానం ద్వారా పెట్టుబ‌డులు చేయ‌డం అల‌వాటుగా మారుతుంది. వ‌డ్డీకి ప‌న్ను వ‌ర్తిస్తుంది.

పీపీఎఫ్‌: దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌కు ఈఈఈ(మిన‌హాయింపు, త‌ర‌హా ప‌న్ను ప్ర‌యోజ‌నాలను అందిస్తుంది. 7వ ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు. వార్షికంగా రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మ‌దుపు చేయ‌వ‌చ్చు.

ఎస్ఎస్‌వై(సుక‌న్య స‌మృద్ధి యోజ‌న‌): పై ప‌థ‌కం మాదిరిగా ఉంటుంది. అయితే ఈ ప‌థ‌కం ప్ర‌త్యేకించి బాలిక‌ల కోసం రూపొందించింది. బాలిక‌కు 18 సంవ‌త్స‌రాల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కు పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తించ‌రు.
గ‌మ‌నిక‌: పై పెట్టుబ‌డుల‌కు వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌భుత్వ నిర్ణ‌యించ‌డం వ‌ల్ల రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది. ఈ కార‌ణంగా ఎక్కువ నిధి ఏర్పాట‌వ‌దు. అయితే పెట్టుబ‌డులు పూర్తి సుర‌క్షితంగా ఉంటాయి.

ఈక్వీటీ మ్యూచువ‌ల్ ఫండ్లు:
దీర్ఘ‌కాలంలో(10 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ కాలానికి) అధిక రాబ‌డుల‌ను పొంద‌వ‌చ్చు. మీరు తీసుకునే రిస్క్ ఆధారంగా త‌గిన ఫండ్‌ను ఎంచుకోవాలి. పెట్టుబ‌డుల‌కు గ‌రిష్ట ప‌రిమితి లేదు. దీర్ఘ‌కాలానికి, అధిక రాబ‌డుల‌తో ఎక్కువ నిధిని స‌మ‌కూర్చుకోవ‌చ్చు.
ఉదాహ‌ర‌ణ‌:
నెల వారీగా రూ. 5 వేలు పెట్టుబ‌డి పెడితే 10 సంవ‌త్స‌రాల కాల‌వ్య‌వ‌ధిలో వృద్ధి ఏవిధంగా ఉంటుందో… ఈకింది ప‌ట్టిక ద్వారా తెలుసుకోవ‌చ్చు. ప్ర‌తీ సంవ‌త్స‌రం నెల‌వారీ చెల్లింపును 10 శాతం వ‌ర‌కు పెంచుకుంటే అధిక రాబ‌డుల‌ను పొంద‌వ‌చ్చు.

qe.png

చివ‌రిగా:
మొత్తం ఒకే ప‌థ‌కంలో కాకుండా, వివిధ పెట్టుబ‌డి సాధాన‌ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా న‌ష్ట‌భ‌యం త‌గ్గించుకోవ‌చ్చు. అంతేకాకుండా వివిధ స‌మ‌యాల‌లో నిధులు అందుబాటులో ఉంటాయి. పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటున్న ప్ర‌తీ ప‌థ‌కం గురించి పూర్తిగా తెలుసుకోవ‌డం మీ హ‌క్కు. ఎందుకంటే అది మీరు క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బు. ఎండోమెంట్‌, యులిప్స్ వంటి ప‌థ‌కాల‌కు దూరంగా ఉండండి. వీటిలో ప్రీమియం ఎక్కువ‌గానూ, రాబ‌డి త‌క్కువ‌గానూ ఉంటుంది. ఈ ప‌థ‌కాల‌లో త‌గిన జీవిత బీమా గానీ, ఆర్‌డీ ఖాతా వంటి వాటిలో వచ్చే రాబ‌డి గానీ ఉండ‌దు.
నేటి స‌ర‌దాలు త్యాగం చేస్తేనే రేపు సంతోష‌దాయ‌క‌మైన జీవితాన్ని పొంద‌గ‌ల‌మ‌ని గుర్తించుకోండి.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly