చౌక‌గా గృహ‌, వాహ‌న రుణాలు

బ్యాంకులు అక్టోబ‌ర్‌1 నుంచి రెపోరేటు ఆధారంగానే వ్య‌క్తిగ‌త‌/ రీటైల్ రుణాల‌ను జారీచేయ‌డం ఆర్‌బీఐ త‌ప్ప‌నిస‌రి చేసింది

చౌక‌గా గృహ‌, వాహ‌న రుణాలు

రుణం తీసుకోవాల‌నుకుంటున్నారా? అయితే మీకు శుభ‌వార్త, అక్టోబ‌రు1,2019 నుంచి రెపో రేటు ఆధారిత గృహ, వాహ‌న రుణాలు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర బ్యాంకు అందించే పాల‌సీరేట్ల‌ను వినియోగ‌దారునికి అందించాల‌నే ఉద్దేశ్యంతో, రీటైల్‌, చిన్న వ్యాపార రుణ‌గ్ర‌హీత‌ల‌కు అందించే రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను ఎక్స్ట్‌ర్న‌ల్‌ బెంచ్‌మార్క్‌తో అనుసంధానించాల‌ని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బ్యాంకుల‌ను బుధ‌వారం ఆదేశించింది. ఇత‌ర విభాగాల‌కు చెందిన రుణ‌గ్ర‌హీత‌ల‌ను కూడా బ్యాంకులు అనుసంధానించ‌వ‌చ్చని ఆర్‌బీఐ తెలిపింది. దీంతో వ‌డ్డీ రేట్లు పెరిగినా లేదా త‌గ్గినా రుణ‌గ్ర‌హీత‌ల‌కు త్వ‌రిత గ‌తిన అమ‌లు చేస్తారు.

జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో ఎన్న‌డూ లేని విధంగా జీడీపీ వృద్ధి రేటు మంద‌గించ‌డంతో, బ్యాంకులు ఆర్‌బీఐ పాల‌సీ రేట్లను ప్ర‌యోజ‌నాల‌ను వినియోగ‌దారులు/వ‌్యాపారుల‌కు పూర్తిగా అందించ‌డం ద్వారా వ‌డ్డీ రేట్లు త‌గ్గుతాయ‌ని ఆశిస్తుంది., నిధుల వ్య‌యం త‌గ్గ‌డం కూడా ఆర్థిక వృద్ధికి తోడ్ప‌డుతుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, ఇండియ‌న్ బ్యాంక్‌ల‌తో పాటు ప్రైవేట్ రంగ బ్యాంక్ ఫెడ‌ర‌ల్ బ్యాంకు వంటి కొన్ని బ్యాంకులు ఇప్ప‌టికే త‌మ రుణ రేట్ల‌ను ఎక్స్ట్‌ర్న‌ల్‌ బెంచ్‌మార్క్‌తో అనుసంధానించ‌డం ప్రారంభించాయి. బ్యాంకులు 2016 ఏప్రిల్ నుంచి నిధుల ఉపాంత వ్య‌య ఆధారిత రుణ రేటు(ఎమ్‌సీఎల్ఆర్‌) ఆధారంగా రుణ రేట్ల‌ను నిర్ణ‌యిస్తున్నాయి. అయితే బ్యాంకులు ప్ర‌స్తుతం అమ‌లు చేస్తున్న ఎమ్‌సీఎల్ఆర్ నిబంధ‌నావ‌ళి అంత సంతృప్తికరంగా లేద‌ని ఆర్‌బీఐ పేర్కొంది. బ్యాంకులు రెపోరేటు ఆధారంగా గానీ, 3 లేదా 6 నెల‌ల ట్రెజ‌రీ బిల్లు రాబ‌డి ఆధారంగా గానీ, ఫైనాన్షియ‌ల్ బెంచ్‌మార్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌(ఎఫ్‌బీఐఎల్‌) ప్ర‌చురించిన ప్రామాణిక రేటు ఆధారంగా గానీ, వ‌డ్డీ రేట్ల‌కు రుణాల‌ను జారీ చేయాల్సి ఉంటుంది.

ఒక రుణ విభాగానికి సంబంధించి, ఒక బ్యాంకు ఒకేవిధ‌మైన ప్ర‌మాణిక రేటును అవ‌లంబించాల్సి ఉంటుంది. వేర్వేరు రేట్ల‌ను అనుమ‌తించ‌మ‌ని ఆర్‌బీఐ స్ప‌ష్టం చేసింది. ప్రామాణిక వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌తీ మూడు నెల‌ల‌కు ఒక‌సారి స‌వ‌రించాల‌ని తెలిపింది.

ఆర్‌బీఐ సర్క్యులర్ ప్రకారం, ముంద‌స్తు చెల్లింపు ఛార్జీలు లేకుండా ఎమ్‌సీఎల్ఆర్ లేదా బేస్ రేటు ఆధారంగా రుణాలు తీసుకున్న రుణ‌గ్ర‌హీత‌లు అడ్మినిస్ట్రేటీవ్‌, చట్టపరమైన ఖర్చులు మినహా ఎటువంటి ఛార్జీలు లేకుండా ఎక్స్ట్‌ర్న‌ల్‌ బెంచ్‌మార్క్‌కు మారడానికి అర్హులు. ముందస్తు చెల్లింపు సౌకర్యం లేని ఇతరులు బ్యాంకు,రుణగ్రహీతకు ఆమోదయోగ్యమైన నిబంధనలపై కొన‌సాగ‌వ‌చ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly