హెడ్జ్ ఫండ్లు అంటే ఏంటి?

హెడ్జ్ ఫండ్లు అధిక నిక‌ర విలువ క‌లిగిన పెట్టుబ‌డుదారుల‌కే వ‌ర్తిస్తాయి. రిస్క్‌తో పాటు రాబ‌డి కూడా అధికంగా ఉంటుంది

హెడ్జ్ ఫండ్లు అంటే ఏంటి?

హెడ్జ్ అనే ప‌దానికి అర్థం పెట్టుబ‌డుల పోర్ట్ఫోలియోలో న‌ష్టాలు రాకుండా సుర‌క్షిత వ్యూహం. హెడ్జ్ ఫండ్లు త‌క్కువ రిస్క్‌తో ఎక్కువ రాబ‌డి వ‌చ్చేవిధంగా ఫండ్ మేనేజ‌ర్లు కృషి చేస్తారు. హెడ్జ్ ఫండ్‌ను ప్ర‌త్నామ్నాయ పెట్టుబ‌డి పండ్ లేదా ఏఐఎఫ్ అంటారు. హెడ్జ్ ఫండ్ కోసం సెబీ వ‌ద్ద‌ ఎటువంటి రిజిస్ర్టేష‌న్ అవ‌స‌రం లేదు. మ్యూచువ‌ల్ ఫండ్ మాదిరిగా స‌మ‌యానుసారం ఎన్ఏవీని వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం లేదు.

హెడ్జ్ ఫండ్లు అంటే ఏంటి?

హెడ్జ్ ఫండ్ అంటే ప్రైవేటు పెట్టుబ‌డి సాధ‌నం. దీనిని ఫండ్ మేనేజ‌ర్ నిర్వ‌హిస్తారు. హెడ్జ్ ఫండ్ అధిక నిక‌ర విలువ గ‌ల‌ మ‌దుప‌ర్లు (హెచ్ఎన్ఐ), బ్యాంకులు, బీమా సంస్థ‌లు, పెన్ష‌న్ ఫండ్ల ద్వారా స‌మీక‌రించిన నిధుల‌ను నిర్వ‌హిస్తాయి. ఎక్కువ మొత్తంలో రిస్క్ తీసుకొని వివిధ విభాగాల్లో పెట్టుబ‌డులు పెడ‌తాయి. హెడ్జ్ ఫండ్ల పోర్ట్ఫోలియో ఈక్విటీలు, డెరివేట్‌వ‌లు, బాండ్లు, క‌రెన్సీ, ఇత‌ర విభాగాలు క‌లిపి ఉంటుంది. రిస్క్ త‌గ్గించి అధిక రాబ‌డిని రాబ‌ట్టేందుకు వీలైనంత‌గా ప్ర‌య‌త్నిస్తారు. వేగంగా లాభాలు పొందేందుకు ఫండ్ మేనేజ‌ర్ ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ‌ పెట్టుబ‌డులు క‌లిగి ఉండి రిస్క్ తీసుకోవాల‌నుకుంటే ఈ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు.

ఈ ర‌క‌మైన ఫండ్ల నుంచి రాబ‌డిని ర‌ప్పించేందుకు ఫండ్ మేనేజ‌ర్లు కీల‌క పాత్ర వ‌హించాల్సి ఉంటుంది. ఫండ్ మేనేజ‌ర్ అనుభ‌వం, ప‌నితీరును కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి.

పెట్టుబ‌డుల్లో వైవిధ్య‌త‌:

హెడ్జ్ ఫండ్ల పెట్టుబ‌డుల్లో వైవిద్య‌త ఉంటుంది. ఈ ర‌క‌మైన ఫండ్లు ఈక్విటీ, డెట్, డెరివేటివ్స్‌, క‌రెన్సీ, రియ‌ల్ ఎస్టేట్, బాండ్ల‌లో పెట్టుబ‌డులు పెడ‌తాయి. అప్పుడు అన్ని ర‌కాల పెట్టుబ‌డుల నుంచి లాభాల‌ను పొందే అవ‌కాశం ఉంటుంది.

రిస్క్ ఎక్కువ‌:

అదేవిధంగా ఈ ఫండ్లు అధిక రిస్క్‌ను క‌లిగి ఉంటాయి. అధిక రాబ‌డిని కూడా ఇస్తాయి. చాలా వ‌ర‌కు హెడ్జ్ ఫండ్ల‌కు లాక్‌-ఇన్ పీరియ‌డ్ ఉంటుంది.

అధిక ఫీజు:

ఈ ఫండ్ల‌కు ఫీజు కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. మొత్తం ఫండ్ ఆస్తి విలువ‌లో 2 శాతం ఫీజు ఛార్జ్ చేస్తారు. ఇంకా అద‌నంగా వ‌చ్చిన లాభంలో 20 శాతం తీసుకుంటారు. మ‌రికొన్ని హెడ్జ్ ఫండ్ల‌కు మేనేజ్‌మెంట్ ఫీజు మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది.

ప‌న్ను:

ఈ ఫండ్ల నుంచి వ‌చ్చిన ఆదాయంపై ప‌న్ను ఉంటుంది. అంటే యూనిట్‌హోల్డ‌ర్ల‌కు ప‌న్ను బాధ్య‌త ఉండ‌దు.

నియంత్ర‌ణ‌లు:

హెడ్జ్ ఫండ్లు ఎలాంటి నియ‌మ నిబంధ‌నలు లేవు. ఈ ఫండ్ సెబీతో రిజిస్ట‌ర్ చేయాల‌న్న నిబంధ‌న‌లు ప్ర్తత్యేకంగా ఏమి లేవు. రిపోర్టింగ్ కూడా అవ‌స‌రం లేదు. మ్యూచువ‌ల్ ఫండ్ల మాదిరిగా ఎన్ఏవి వెల్ల‌డించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

అధిక నిక‌ర విలువ క‌లిగిన‌ పెట్టుబ‌డుదారుల‌కు మాత్ర‌మే:

ఇవి కేవ‌లం అధిక నిక‌ర విలువ క‌లిగిన పెట్టుబ‌డుదారుల‌కు అనుకూలంగా ఉంటాయి. అంటే బ్యాంకులు, బీమా సంస్థ‌లు, పెన్ష‌న్ ఫండ్లు వంటివి. క‌నీస పెట్టుబ‌డి కోటి రూపాయ‌లు ఉంటుంది.

చాలా మంది హెడ్జ్ ఫండ్లు కూడా మ్య‌చువ‌ల్ పండ్ల వంటివే అనుకుంటారు. అయితే రెండింటి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంటుంది. అది ఏంటంటే…

hedge.jpg

హెడ్జ్ ఫండ్లు ఎలా ప‌నిచేస్తాయి?

హెడ్జ్ ఫండ్ల‌లో లాభం పొందేందుకు బ‌హుళ వ్యూహాలు ఉంటాయి. అందులో కొన్ని ముఖ్య‌మైన‌వి…

షార్ట్ సెల్లింగ్‌:
షేర్ల ధ‌ర‌లు త‌గ్గిపోతాయ‌ని అనుకున్న‌ప్పుడు ఫండ్ మేనేజ‌ర్ భ‌విష్య‌త్తు గురించి అంచ‌నా వేసి న‌ష్ట‌పోకుండా షేర్ల‌ను విక్ర‌యిస్తాడు.

ఆర్బిట్రేజ్:
లాభాన్ని పొందేందుకు ఒకేస‌మయంలో సెక్యూరిటీల‌ను వేర్వేరు మార్కెట్ల‌లో అమ్మ‌డం, కొనుగోలు చేయ‌డం చేయ‌వ‌చ్చు. దీనికోసం ఎన్ఎస్ఈ, బీఎస్ఈల‌లో కూడా అమ్మ‌కం, కొనుగోళ్లు జ‌ర‌పొచ్చు.

సంద‌ర్భానుసారంగా వ్య‌వ‌హ‌రించ‌డం:
విలీనం, వాటాను సొంతం చేసుకోవ‌డం, విస్త‌రించ‌డం వంటి సంద‌ర్భాల‌లో మ‌దుపు చేసి లాభాలు వంటి సంద‌ర్భాల‌లో మ‌దుపు చేసి లాభాలు పొందుతారు.

డిస్కౌంట్ సేల్‌:
కొన్ని కంపెనీలు దివాళా తీసేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల షేర్ల‌ను డిస్కౌంట్ ధ‌ర‌ల‌తో కొనుగోలు చేయ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం పొందుతారు.

హెడ్జ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేముందు దృష్టిలో పెట్టుకోవాల్సిన కొన్ని అంశాలు:

  • ఈ ర‌క‌మైన ఫండ్లు అధిక నిక‌ర విలువ క‌లిగిన, అనుభ‌వం ఉన్న పెట్టుబ‌డుదారుల కోసం అనుకూలంగా ఉంటాయి.
  • పెట్టుబడులు పెట్టేముందు ఫండ్ల‌కు సంబంధించిన డాక్యుమెంట్ల‌ను క్షుణ్ణంగా చ‌ద‌వండి
  • వ్య‌య నిష్ప‌త్తి, ఫీజు వంటివి తెలుసుకోండి
  • లాక్-ఇన్ పీరియ‌డ్ , ఉప‌సంహ‌ర‌ణ ప‌రిమితులు ప‌రిశీలించండి
  • ఫండ్ మేనేజ‌ర్‌గా గురించి పూర్తిగా తెలుసుకోండి

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly