ఆర్థిక ప్ర‌ణాళిక‌లో బీమా, పెట్టుబ‌డులు.. దేనికి ఎంత‌?

అధిక ప్రీమియం చెల్లిస్తున్న పాలసీని రద్దు చేసుకొని ట‌ర్మ్ జీవిత బీమా తీసుకోండి

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో బీమా, పెట్టుబ‌డులు.. దేనికి ఎంత‌?

ప్రశ్న: నా వయసు 38, భార్య 31, బాబు 10, పాప 5 ఏళ్ళు . నెల జీతం రూ . 25 వేలు. ఇతర ఆదాయం రూ. 11 వేలు. నెలసరి ఖర్చులు రూ. 10 వేలు. జీవిత బీమా పాలసీ రూ. 10 లక్షలు. వార్షిక ప్రీమియం రూ.2.50 లక్షలు. ప్రమాద బీమా వార్షిక ప్రీమియం రూ. 50 వేలు.

జవాబు: ముందుగా మీరు ఒక టర్మ్ పాలసీ ని తీసుకోండి. టర్మ్ పాలసీని వార్షిక ఆదాయానికి కనీసం 10-15 రెట్లు బీమా హామీ ఉండేలా చూసుకోవాలి. మీకు 60 ఏళ్ళు వచ్చే దాక పాలసీని కొనసాగించండి. పాలసీలో వివరాలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి, దీని ద్వారా భవిష్యత్తులో క్లెయిమ్ చేయాల్సి వస్తే ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. టర్మ్ పాలసీ లో తక్కువ ప్రీమియం తో అధిక బీమా హామీ పొందొచ్చు. మాక్స్ లైఫ్, ఎస్బీఐ, ఐసీఐసీఐ ఆన్లైన్ టర్మ్ పాలసీలను పరిశీలించండి. కవర్ ఫాక్స్, పాలసీ బజార్ లాంటి వెబ్సైట్లలో ప్రీమియం పరిశీలించవచ్చు.
బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పధకాల (ఎండోమెంట్, మనీ బ్యాక్, యూలిప్స్ లాంటివి) నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
వీటిలో బీమా హామీ తక్కువ, రాబడి తక్కువ, ప్రీమియం ఎక్కువ .

టర్మ్ జీవిత బీమా తీసుకున్న తరువాత, మీ వీలును చూసుకుని అధిక ప్రీమియం చెల్లిస్తున్న పాలసీని రద్దు చేసుకోండి. ఆ ప్రీమియం సొమ్మును ఈ కింది పథకాలలో మదుపు చేయండి.
మీ బాబు ఫై చదువుల కోసం పీపీఎఫ్ లో మదుపు చేయండి. http://eenadusiri.net/PPF-For-child-education-78YbsW1

మీ పాప ఫై చదువులు, వివాహానికి మదుపు చేయటానికి సుక‌న్య స‌మృద్ధి యోజ‌నను పరిశీలించండి. ప్రస్తుత వార్షిక వడ్డీ 8.4 శాతం. వార్షికంగా గరిష్ట పెట్టుబడి రూ . 1.50 లక్షలు. 18వ ఏట నుండి పాక్షిక నగదు ఉపసంహరణ సదుపాయం ను ఆమె ఉన్నత చదువులకు, వివాహానికి ఉపయోగించుకోవచ్చు.
నగదు జమ చేసినప్పుడు, జమ అయిన వడ్డీ ఫై, అలాగే నగదు ఉపసంహరణలపై పన్ను మినహాయింపులు ఉంటాయి.
సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతా గురించి స‌మ‌గ్ర వివరాలు http://eenadusiri.net/Detailed-explanation-of-sukanya-samruddhi-yojana-aD35mGN

ఎన్పీఎస్ లో మదుపు చేయడం వల్ల మీరు మంచి పదవీ విరమణ నిధి, పెన్షన్ పొందొచ్చు. ఈక్విటీ లలో 50 శాతం వరకు మదుపు చేసే అవకాశం ఉండటం వలన, దీర్ఘకాలంలో 9-10% వరకు రాబడి ఆశించవచ్చు. ప్రస్తుత నియమాల ప్రకారం 60 సం వయసులో, జమ అయిన నిధి నుంచి పన్ను మినహాయింపు తో 60 శాతం నిధిని పొందవచ్చు. మిగిలిన 40 శాతం ద్వారా పెన్షన్ పొందవచ్చు. ఇందులో సెక్షన్ 80సి కాకుండా అదనంగా రూ. 50 వేలు పన్ను ఆదా చేసుకోవచ్చు.

చిన్న వయసులో అధికంగా మదుపు చేయడం వలన దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో అధిక నిధిని జమ చేయవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly