2020 క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌

ప‌న్ను రిట‌ర్నుల‌కు సంబంధించిన అన్ని ముఖ్య‌మైన తేదీల‌ను ఇ-క్యాలెండ‌ర్ గుర్తు చేస్తుంది

2020 క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసిన ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌

ఆదాయ‌పు ప‌న్ను శాఖ 2020 సంవ‌త్స‌రానికి గానూ కొత్త క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. ప‌న్ను సంబంధిత అన్ని ముఖ్య‌మైన గడువు తేదీల జాబితాను ఇందులో పొందుప‌రిచింది. ప‌న్ను చెల్లింపుదారులు వారి ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను సుల‌భంగా ఫైల్ చేయ‌డంలో స‌హాయ‌ప‌డేందుకు ఫైల్ ఇట్ యుర్‌సెల్ఫ్ పేరుతో క్యాలెండ‌ర్‌ను రూపొందించింది. ఈ ఇ-క్యాలెండ‌ర్ ఐటీఆర్ రిట‌ర్నులు ఎప్పుడు ఫైల్ చేయ్యాలో గైడ్ చేస్తుంది. ఈ విష‌యాన్ని ఈ-మెయిల్ ద్వారా ఆదాయ‌పు ప‌న్ను శాఖ, ప‌న్ను చెల్లింపుదారుల‌కు తెలియ‌జేస్తుంది.

ప‌న్ను చెల్లింపుదారుల‌కు, ఆదాయ‌పు ప‌న్ను శాఖ అందించే ప‌లు ర‌కాల సేవ‌ల గురించి కూడా ఇ-క్యాలెండ‌ర్ తెలియ‌జేస్తుంది.

  • జ‌న‌వ‌రి నెల క్యాలెండ‌ర్‌ డిసెంబ‌రు31,2019తో ముగిసిన త్రైమాసికానికి టీసీఎస్‌, టీడీఎస్ డిపాజిట్ల గ‌డువు తేదీల‌ను గుర్తు చేస్తుంది.
  • 2020-21 సంవ‌త్స‌రానికి నాల్గ‌వ‌, ఆఖ‌రి వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు మార్చి 15 చివ‌రి తేదీ.
  • 2019-20సంవ‌త్స‌రానికి ఆల‌స్యంగా లేదా స‌వ‌రించిన ఆదాయ‌పుప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేందుకు చివ‌రితేది మార్చి 31.
  • ఆర్థిక సంవ‌త్స‌రం 2019-20, 4వ‌త్రైమాసికం, టీసీఎస్ స్టేట్‌మెంట్ స‌మ‌ర్పించేందుకు చివ‌రి తేది మే 15.
  • అసెస్మెంటు సంవ‌త్స‌రం 2021-22 మొద‌టి వాయిదా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు చివ‌రి తేది జూన్ 15.
  • వ్య‌క్తులు ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు(ఐటీఆర్‌) దాఖ‌లు చేసేందుకు చివ‌రి తేది జులై 31.
  • రెండ‌వ వాయిదా అడ్వాన్స్ టాక్స్ చెల్లించేందుకు చివ‌రి రిమైండ‌ర్ సెప్టెంబ‌రు 15.
  • కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు, ఆడిట్ చేయవలసిన ఖాతాలందరికీ ఐటిఆర్ దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 30 చివరి తేదీ.
  • అసిస్మెంట్ సంవ‌త్స‌రం 2020-21 కోసం మూడవ విడత ముందస్తు పన్ను చెల్లించడానికి డిసెంబర్ 15 చివరి తేదీ.

క్యాలెండ‌ర్ కోసం క్లిక్ చేయండి

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly