ఆరోగ్య బీమా గురించి ప్ర‌చారంలో ఉన్న అపోహ‌లు

వైద్య శాస్త్రంలో ఆధునిక‌త పెరిగిన ఈ రోజుల్లో చాలా వ్యాధుల‌కు చికిత్స కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే జ‌రుగుతోంది

ఆరోగ్య బీమా గురించి ప్ర‌చారంలో ఉన్న అపోహ‌లు

ఆరోగ్య బీమా గురించి ప్ర‌చారంలో ఉన్న అపోహ‌లు న‌మ్మి పాల‌సీ తీసుకోకుండా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ప‌డుతుంటారు. అవి ఏంటంటే…

1.చిన్న వ‌య‌సులో ఆరోగ్య బీమా అంత అవ‌స‌రం లేదు…
చిన్న వ‌య‌సులోనే ఆరోగ్య బీమా తీసుకోవ‌డం మంచిది. అందుకు ఎన్నో కార‌ణాలున్నాయి. ముందస్తు వ్యాధులు ఉండి ఆరోగ్య బీమా తీసుకున్న‌ట్ల‌యితే, ఈ వెయిటింగ్ పీరియ‌డ్ రెండు నుంచి నాలుగేళ్లు ఉంటుంది. ప్ర‌మాదాలు, వ్యాధులు ఆక‌స్మికంగా సంభ‌విస్తున్నాయి. కాబ‌ట్టి వీలైనంత చిన్న వ‌య‌స్సులో ఆరోగ్య బీమా తీసుకోవ‌డం ద్వారా ఈ వెయిటింగ్ పీరియ‌డ్ సమస్యను అధిగమించవచ్చు. ఆరోగ్య బీమా ప్రీమియం, వ‌య‌సుతో పెరుగుతుంది . కాబ‌ట్టి చిన్న వ‌య‌సులోనే ఆరోగ్య బీమా తీసుకోవ‌డం ఉత్త‌మం.

2.మొద‌టి రోజు నుంచే ఆసుప‌త్రి ఖ‌ర్చులను కంపెనీలు భ‌రిస్తాయి…
ప్ర‌మాదాలు మినహా, అన్ని బీమా పాల‌సీల‌లో 30 రోజుల వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకున్న వెంట‌నే, బీమా కంపెనీ నుంచి స‌హాయం అందుతుంద‌ని ఊహించ‌కండి. పాల‌సీలోని వివ‌రాల‌ను క్షుణ్నంగా త‌నిఖీ చేసుకోండి, బీమా క్లెయిం చేసుకునేట‌ప్ప‌డు మీకు నిరాశ ఎదురు కాదు.

3.క్లెయిం చేసుకోవ‌డం కోసం క‌చ్చితంగా 24 గంట‌లుండాలి…
వైద్య శాస్త్రంలో ఆధునిక‌త పెరిగిన ఈ రోజుల్లో చాలా వ్యాధుల‌కు చికిత్స కేవ‌లం కొన్ని గంట‌ల్లోనే జ‌రుగుతోంది. కంటి శ‌స్త్ర చికిత్స‌, లిథోగ్ర‌ఫీ, డ‌యాలిసిస్‌, కీమోథెర‌పీల‌కు ఒక్క రోజులోనే చికిత్స అయిపోతోంది. కాబ‌ట్టి కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో పూర్త‌యిన చికిత్స‌ల‌కు కూడా బీమా కంపెనీలు క్లెయింల‌ను ప‌రిష్క‌రిస్తున్నాయి. ఇంకా కొన్ని బీమా కంపెనీలు దంతాల చికిత్స లాంటి ఔట్ పేషేంట్ సేవ‌ల‌కు కూడా బీమా స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. అయితే వీటి ప్రీమియం కాస్త అధికంగా ఉండవచ్చు.

4.నెట్వర్క్ ఆసుపత్రులలో మాత్రమే బీమా సౌకర్యం పొందొచ్చు…
బీమా కంపెనీ తెలిపిన నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందే సౌకర్యం ఉంటుంది. అయితే నాన్ - నెట్వర్క్ ఆసుపత్రులలో కూడా చ్చికిత్స పొంది , చెల్లించిన సొమ్మును బీమా కంపెనీ నుంచి రియింబర్సుమెంట్ పొందొచ్చు. అలాగే క్లెయిమ్ పరంగా కూడా నెట్వర్క్, నాన్ - నెట్వర్క్ ఆసుపత్రులలో ఎటువంటి వ్యత్యాసం ఉండదు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly