బ్యాంక్ ఖాతాతో పాన్ లింక్ చేయ‌కుంటే రీఫండ్‌ రాదు

మార్చి 1, 2019 నుంచి ఆదాయపన్ను రిఫండ్ నేరుగా ఈ-రిఫండ్ ద్వారానే వ‌స్తుంద‌ని ఆదాయ‌ప‌న్ను శాఖ వెల్ల‌డించింది.

బ్యాంక్ ఖాతాతో పాన్ లింక్ చేయ‌కుంటే రీఫండ్‌ రాదు

ఆదాయ పన్ను రిఫండ్ లు బ్యాంకు ఖాతాలకు ఇ-మోడ్ ద్వారా మాత్రమే అందించ‌నున్న‌ట్లు, ప‌న్నుచెల్లింపుదారులు వారి బ్యాంకు ఖాతాలతో పాన్ లింక్ చేయాల‌ని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. మార్చి 1 నుంచి ఆదాయపన్ను వాపసులు బ్యాంకు ఖాతాల‌లో మాత్రమే జ‌మ‌వుతాయని వెల్ల‌డించింది. నేరుగా, వేగంగా, సురక్షితంగా ప‌న్ను వాపసు పొందడానికి మీ బ్యాంకు ఖాతాతో పాన్ (శాశ్వత ఖాతా నంబర్) లింక్ చేయండి, అని ఆదాయ‌ప‌న్ను శాఖ‌ బుధవారం ప్ర‌చురించి ప‌బ్లిక్ అడ్వైస‌రీ డాక్యుమెంటులో తెలిపింది. బ్యాంకు ఖాతా పొదుపు,క‌రెంటు, ఓవర్డ్రాఫ్ట్ ఏదైనా కావచ్చు. ఆదాయ‌ప‌న్ను శాఖ ఇప్పటివరకు, పన్ను చెల్లింపుదారులకు వాపసు ఇచ్చేందుకు బ్యాంకు ఖాతా లేదా చెల్లింపు చెక్ ల జారీ విధానాన్ని అమ‌లు చేస్తోంది. పన్ను చెల్లింపుదారులు, ఆదాయ‌ప‌న్నుశాఖ ఈ- ఫైలింగ్ వెబ్సైట్లో లాగిన్ అవ‌డం ద్వారా వారి బ్యాంకు ఖాతా పాన్ తో అనుసంధానించి ఉన్న‌దీ లేనిదీ తెలుసుకోవ‌చ్చ‌ని డాక్యుమెంటులో పేర్కొంది. పాన్ ను బ్యాంకు ఖాతాతో లింక్ చేయని వారు త‌మ‌ హోమ్ బ్యాంకు శాఖను సంప్ర‌దించాలి. అనంత‌రం ఈఫైలింగ్ వెబ్ సైట్ లో దీనిని ధ్రువీకరించాలి. ఇటీవలే, ఆదాయపు పన్నుల రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసే వారికి ఆధార్-పాన్ లింక్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ ప్ర‌క్రియ పూర్తి చేసేందుకు మార్చి 31 వ‌ర‌కూ గ‌డువు ఉంది. ఈ నెల ప్రారంభ డేటా ప్రకారం , ఆదాయ‌ప‌న్నుశాఖ‌ ఇప్పటివరకు 42 కోట్ల పాన్ ల‌ను జారీ చేసింది, వాటిలో 23 కోట్లు ఆధార్ అనుసంధానం కలిగి ఉన్నాయి.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly