లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్లు

దేశీయ సూచీలు తిరిగి లాభాల బాట ప‌ట్టాయి. సెన్సెక్స్ తిరిగి 35 వేల మార్క్‌కు చేరింది.

లాభాలతో ప్రారంభ‌మైన మార్కెట్లు

దేశీయ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 35,069 వ‌ద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 10,561 వ‌ద్ద ట్రేడింగ్ ఆరంభించాయి. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.72.96 వ‌ద్ద న‌మోద‌వుతోంది. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ముడిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గాయి.

క్రితం స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిసిన మార్కెట్లు నేడు లాభాల‌తో కొన‌సాగుతున్నాయి. అమెరికాలో జ‌ర‌గనున్న మ‌ధ్యంత‌ర ఎన్నిక‌లపై ఆధార‌ప‌డి అంత‌ర్జాతీయ మార్కెట్ల క‌ద‌లిక‌లు ఉండనున్నాయి. ఆ ప్ర‌భావం దేశీయ మార్కెట్ల‌పై కూడా ప‌డే అవ‌కాశ‌ముంది. ప్ర‌స్తుతం మార్కెట్ల‌లో టాటా మోటార్స్, స‌న్ ఫార్మా, గెయిల్ షేర్లు లాభ‌ప‌డుతున్నాయి. మ‌రోవైపు వేదాంతా, ఎస్‌బీఐ, సిప్లా షేర్లు న‌ష్ట‌పోతున్నాయి.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly