పీఎమ్ఏవై(యూ) కింద‌ ఎంత మంది రాయితీ పొందారో తెలుసా?

పీఎమ్ఏవై క్రెడిట్ లింకెడ్ స‌బ్సిడీ స్కీమ్ ద్వారా లబ్ధిపొందుతున్న రాష్ట్రాల‌లో గుజ‌రాత్ మొద‌టి స్థానంలో ఉంది.

పీఎమ్ఏవై(యూ) కింద‌ ఎంత మంది రాయితీ పొందారో తెలుసా?

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌(అర్బ‌న్‌) కింద సుమారు 2.75 ల‌క్ష‌ల మంది ల‌బ్ధిపొందారు. ఈ ప‌థ‌కంలోని క్రెడిట్ లింకెడ్ స‌బ్సిడీ స్కీమ్ ద్వారా ల‌బ్ధిపొందిన రాష్రాల‌లో గుర‌జాత్ మొద‌టి స్థానంలో ఉండ‌గా మ‌హారాష్ట్ర, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లు త‌రువాతి స్థానంలో కొనుసాగుతున్నాయి. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌(అర్బ‌న్‌) కింద, ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాలు(ఈడ‌బ్యూఎస్‌), త‌క్కువ ఆదాయ వ‌ర్గాలు (ఎల్ఐజీ) మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు(ఎమ్ఐజీ) వారికి ప్ర‌భుత్వం రాయితీ అందుస్తుంది. ఈ మూడు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌లో గుజ‌రాత్‌లో 88 వేలకు పైగా, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 74 వేల మంది క్రెడిట్ లింక్డ్ రాయితీ ప‌థ‌కం (సీఎల్ఎస్ఎస్‌) ద్వారా ల‌బ్ధిపొందారు. సీఎల్ఎస్ఎస్ ద్వారా మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్‌ల‌లో 15 వేలు మంది చొప్పున‌, త‌మిళ‌నాడులో 12 వేల మంది ల‌బ్ధిపొందార‌ని ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌ శాఖ కార్య‌ద‌ర్శి దుర్గా శంక‌ర్ మిశ్రా తెలిపారు. సీఎల్ఎస్ఎస్ ద్వారా మొత్తం రూ. 2.67 ల‌క్ష‌లను ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌ శాఖ ల‌బ్ధిదారుల‌కు అందించింది.

ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌(అర్బ‌న్‌)లో నాలుగు విధానాలు అందుబాటులో ఉన్నాయి. సీఎల్ఎస్ఎస్‌, ఇన్‌సిటు స్ల‌మ్ రీడ‌వ‌ల‌ప్‌మెంట్‌(ఐఎస్ఎస్ఆర్‌), అందుబాటు ధ‌ర‌లో ఇళ్లు (ఏహెచ్‌పీ), ల‌బ్ధిదారుడు నిర్మించుకునే ఇళ్ళు (బీఎల్‌సీ) వంటి విధానాల‌లో ల‌బ్ధిదారులు త‌మ సొంతంగా ఇళ్ళు నిర్మించుకునేందుకు ప్ర‌భుత్వం స‌హాకారాన్ని అందిస్తుంది.

ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌ శాఖ ప్ర‌కారం పీఎమ్ఏవై(యూ) కింద ఇళ్ళ నిర్మించుకునే మొత్తం ల‌బ్ధిదారుల‌లో బీఎల్‌సీ విధానాన్ని అనుస‌రించే ల‌బ్ధిదారులు 56 శాతంతో అధిక మొత్తంలో ఉన్నారు. 33 శాతం ఏహెచ్ఆర్, 4 శాతం ఐఎస్ఎస్ఆర్‌, 4 శాతం సీఎల్ఎస్ఎస్ విధానాలలో ల‌బ్ధిపొందుతున్నారు.

పీఎమ్ఏవై (యూ) కింద మంజూరైన గృహాల సంఖ్య ఇప్పటివరకు 65,04,037 కి చేరుకుంది. “హౌసింగ్ ఫ‌ర్ ఆల్ బై 2022” ల‌క్ష్యంతో ల‌బ్ధిదారుల‌కు ఆర్థిక స‌హాయాన్ని అందించేందుకు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ జూన్ 2015 లో పీఎమ్ఏవై (యూ)ను ఆవిష్క‌రించారు.

పీఎమ్ఏవై (యు) లో 80 లక్షల గృహాలను మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, 12 లక్షల ఇళ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా లబ్ధిదారులకు అందజేశామ‌ని మిశ్రా తెలిపారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly