ఆర్‌బీఐ నిర్ణ‌యాల‌తో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చేయూత‌

ఆర్‌బీఐ రుణ నిబంధ‌న‌ల్లో మార్పులు చేసింది. అదేవిధంగా బల్క్ డిపాజిట్ల ప‌రిమితిని రూ.2 కోట్ల‌కు పెంచింది

ఆర్‌బీఐ నిర్ణ‌యాల‌తో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చేయూత‌

మంచి రేటింగ్ క‌లిగిని నాన్ బ్యాంకింగ్ సంస్థ‌ల‌కు రుణాల‌ను మ‌రింత ఎక్కువ‌గా ఇచ్చేందుకు ఆర్‌బీఐ నిబంధ‌న‌ల‌ను స‌వ‌రించింది. ఎన్‌బీఎఫ్‌సీలు కార్య‌క‌లాపాల‌ను మ‌రింత సౌక‌ర్యంగా కొన‌సాగించేందుకు ఈ నిర్ణ‌యం తోడ్ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంక్షోభం త‌ర్వాత ఎన్‌బీఎఫ్‌సీలకు బ్యాంకులు ఇచ్చే రుణ వ్య‌యాలు భారీగా పెరిగాయి. ఎందుకంటే రిస్క్‌తో కూడిన‌ రుణాలు ఇస్తే బ్యాంకులకు మ‌రింత మూల‌ధ‌నం అవ‌స‌రం ఉంటుంది. దీంతోపాటు బ‌ల్క్‌డిపాజిట్ల ప‌రిమితిని రెట్టింపు చెస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పై రూ.2 కోట్ల కంటే ఎక్కువ డిపాజిట్ల‌ను బ‌ల్క్ డిపాజిట్లుగా ప‌రిగ‌ణించ‌నున్నాయి ఇంత‌కుముందు ఇవి కోటి రూపాయ‌లుగా ఉండేది. దీంతో బ్యాంకుల కార్య‌క‌లాపాల‌కు విసృతమ‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఆర్‌బీఐ పేర్కొంది. వాణిజ్య బ్యాంకులు సాధార‌ణంగా బ‌ల్క్ డిపాజిట్ల‌పై త‌క్కువ వ‌డ్డీ రేట్లు ఇస్తుంటాయి.

ఆర్‌బీఐ ప్ర‌స్తుత నిబంధ‌న‌ల ప్ర‌కారం , కోటి రూపాయ‌ల కంటే ఎక్కు వ డిపాజిట్ల‌పై ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అనుమ‌తించ‌క‌పోవ‌డం బ్యాంకుల చేతిలో ఉంటుంది. కోటి రూపాయ‌లు అంత‌కంటే ఎక్కువ డిపాజిట్ల‌పై ఒక కాల‌వ్య‌వ‌ధి క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ వేర్వేరు వ‌డ్డీ రేట్ల‌ను ఇచ్చే అధికారం ఉంటుంది. కోటి రూపాయ‌ల కంటే త‌క్కువ ట‌ర్మ్ డిపాజిట్ల‌పై ఇది వ‌ర్తించ‌దు. వీటిపై వ‌డ్డీ రేట్లు ఫిక్స్డ్‌గా ఉంటుంది. అయితే వ‌డ్డీ రేట్ల‌ను బ్యాంకులు ముందుగానే చెప్ప‌వ‌ల‌సి ఉంటుంది.

అదేవిధంగా ఆర్‌బీఐ ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి స‌మావేశంలో మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హామీ అవసరం లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష నుంచి రూ. 1.60 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న పెట్టుబడి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పింది. 'చిన్న, సన్నకారు రైతులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని ఆర్‌బీఐ పేర్కొంది. దీనిపై త్వరలోనే అన్ని బ్యాంకులకు నోటీసు జారీ చేయనుంది. హామీ రహిత వ్యవసాయ రుణాల పరిమితిని రూ. లక్ష వరకు పెంచుతూ 2010లో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

రైతుల సంక్షేమం కోసం ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో సరికొత్త పథకం తీసుకొచ్చారు. పేద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6000 అందజేయనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. తాజాగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా రైతులకు మరో కానుక అందిస్తోంది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly