మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులకు ఆరోగ్య బీమా హామీ

ఇన్సులిన్ ఆధారిత మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తుల కోసం రెలీగేర్ హెల్త్ ఇన్సురెన్స్‌, అందిస్తున్న ఆరోగ్య‌బీమా ప‌థ‌కం - కేర్ ఫ్రీడ‌మ్.

మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులకు  ఆరోగ్య బీమా హామీ

ఆరోగ్య బీమా అందించే సంస్థ‌ల‌లో ఒక‌టైన రెలీగేర్ హెల్త్ ఇన్సురెన్స్‌, ‘కేర్ ఫ్రీడ‌మ్’ పేరుతో ఒక కొత్త ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప‌థ‌కం ద్వారా ఇన్సులిన్ ఆధారిత మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఆరోగ్య బీమా హామీని అందించ‌నుంది. ఈ కేర్ ఫ్రీడ‌మ్ ఫ‌థ‌కం ద్వారా డ‌యాబెటిక్ ఉన్న వారికి మాత్ర‌మే కాకుండా, నిరాశ, ఆందోళ‌న, అధిక‌ రక్తపోటు వంటి వాటితో బాధ‌ప‌డేవారికి కూడా బీమా సౌక‌ర్యాల‌ను అందిస్తుంద‌ని రెలీగేర్ హెల్త్ ఇన్సురెన్స్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్ట‌ర్ అనూజ్ గులాటి తెలిపారు.

కేర్ ఫ్రీడ‌మ్, రూ.3ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు హామీ ఇచ్చే అంశాల‌తో వ‌స్తుంది. అంతేకాకుండా మ‌ధుమేహంకు సంబంధించిన మొత్తం హెల్త్ చెక‌ప్‌ను నిర్ధిష్ట ప‌రిమితుల‌తో అందిస్తారు. మ‌ధుమేహం వంటి దీర్ఘ‌కాలిక‌ వ్యాధుల‌తో భాద‌ప‌డుతున్నవారికి మెరుగైన‌, ప్ర‌త్యేక‌మైన ఆరోగ్య ర‌క్ష‌ణను సుల‌భంగా పొందాల‌నే ఉద్దేశ్యంతో రెలీగేర్ హెల్త్ ఇన్సురెన్స్‌ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. కేర్ ఫ్రీడ‌మ్ ఫ‌థ‌కం, ఎటువంటి ప్రీ పాల‌సీ మెడిక‌ల్ చెక‌ప్స్ లేకుండా క‌వ‌రేజ్‌ను అందిస్తుంది. ఈ పాల‌సీ కింద ఎన్‌రోల్ చేసుకున్న వ్య‌క్తుల ర‌క్త‌పోటు, ఊబ‌కాయం వంటి వివిధ ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు ఇది వ‌ర్తిస్తుంది. ముందుగా నిర్ధారించ‌బ‌డిన వ్యాధుల‌కు రెండు సంవ‌త్స‌రాల‌ స్వ‌ల్ప‌కాలిక వెయిటింగ్ పిరియ‌డ్ త‌రువాత ఈ ప‌థ‌కం క‌వ‌ర్ చేస్తుంది. పెద్ద వ‌య‌స్సులో ఉన్న చాలామంది ఇలాంటి ఆరోగ్య ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందువ‌ల్ల ముందుగానే ఇలాంటి పాల‌సీలు తీసుకోవ‌డం ద్వారా త‌గినంత హామీ ల‌భిస్తుంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly