క‌రోనా నేప‌థ్యంలో ఎస్‌బీఐ అత్య‌వ‌స‌ర రుణాలు

అద‌నంగా రూ.200 కోట్ల రుణాల‌ను ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ కింద అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది

క‌రోనా నేప‌థ్యంలో ఎస్‌బీఐ అత్య‌వ‌స‌ర రుణాలు

వ్యాపారాల‌పై క‌రోనా ప్ర‌భావం చూపుతున్న నేప‌థ్యంలో అర్హులైన వారికి రుణాల‌ను జారీచేసేందుకు ఎస్‌బీఐ ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ (సీఈసీఎల్‌) ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా త‌మ రుణ‌గ్ర‌హీత‌ల‌కు అద‌నంగా రూ.200 కోట్ల వ‌ర‌కు రుణాల‌ను జూన్ 30,2020 వ‌ర‌కు జారీచేయ‌నుంది. దీని వ‌డ్డీరేటు 7.25 శాతం. కాల‌ప‌రిమితి 12 నెల‌లు.

కొవిడ్-19 కార‌ణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి మ‌ద్ద‌తుగా నిలిచేందుకు బ్యాంకు ఈ నిర్ణ‌యం తీసుకుంది. అర్హ‌త గ‌ల బ్యాంకు వినియోగ‌దారుల‌కు ఈ రుణాల‌ను అందించ‌నుంది. ఈ మేర‌కు బ్యాంకు అన్ని శాఖ‌ల‌కు స‌ర్క్కులార్ జారీచేసింది.

మార్చి 16, 2020 నాటికి SMA 1 లేదా 2 గా వర్గీకరించబడని అన్ని ప్రామాణిక ఖాతాలకు ఇది వ‌ర్తిస్తుంది. ఎన్‌పీఏ/ ఒత్తిడితో కూడిన ఆస్తిగా మారే అవకాశం ఉన్న ఖాతాలను గుర్తించడానికి ఆర్‌బీఐ గ‌తంలో స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ (ఎస్‌ఎంఏ) ప్రవేశపెట్టింది.

SMA-1 ఖాతాలు అంటే 31 నుండి 60 రోజుల కంటే ఎక్కువ గ‌డువుకు మించి ఉన్న రుణాలు. చెల్లించాల్సిన బ‌కాయిల వ్య‌వ‌ధి 61 నుంచి 90 రోజుల కంటే ఎక్కువ‌గా ఉంటే SMA -2 ఖాతాలుగా ప‌రిగ‌ణిస్తారు. రుణగ్రహీతలు ప్రస్తుతం ఉన్న ఫండ్ బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ పరిమితుల్లో గరిష్టంగా 10 శాతం పొందగలరని, ఇది రూ. 200 కోట్ల రూపాయ‌ల‌కు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది.

ఫిక్కీ తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో దేశంలో 50 శాతానికి పైగా కంపెనీల కార్య‌క‌లాపాల‌పై క‌రోనా ప్ర‌భావం ఉండ‌నుంద‌ని తెలిపింది. 80 శాతానికి పైగా వ్యాపారాలు లిక్విడిటీ స‌మ‌స్య‌ను ఎదుర్కుంటాయ‌ని అంచ‌నా వేసింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly