ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఎస్‌బీఐకి గృహ రుణ బ‌దిలీ చేసుకోండి

ఫిబ్ర‌వ‌రి 28,2019 వ‌రకు గృహ రుణ బ‌దిలీపై ప్రాసెసింగ్ ఫీజుల‌ను ఎస్‌బీఐ ర‌ద్దుచేసింది.

ప్రాసెసింగ్ ఫీజు లేకుండా ఎస్‌బీఐకి గృహ రుణ బ‌దిలీ చేసుకోండి

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) త‌మ వినియోగ‌దారుల‌కు వివిధ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తూ రుణాల‌ను మంజూరు చేస్తుంది. సొంత ఇల్లు క‌లిగి ఉండ‌డం అనేది చాలా మంది క‌ల‌గా ఉంటుంది. గృహం కొనుగోలు చేసి, ఇతర బ్యాంకులో రుణం తీసుకున్న వారి కోసం ఎస్‌బీఐ ఒక కొత్త ప‌థ‌కాన్ని ప్ర‌వేశపెట్టింది. అధిక వ‌డ్డీకి గృహా రుణాలు తీసుకున్న వారు ప్రాసెసింగ్ రుసుములు లేకుండా త‌మ గృహ రుణాల‌ను ఎస్‌బీఐకి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. దీనితో త‌క్కువ వ‌డ్డీ ప్ర‌యోజ‌నం కూడా పొంద‌వ‌చ్చు. దీనితో మీరు నెల‌వారీగా చెల్లించే ఈఎమ్ఐ త‌గ్గుతుంది. ఈ ఆఫ‌ర్ ఈ నెల చివ‌రి వ‌ర‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. అందువ‌ల్ల ఇత‌ర బ్యాంకుల‌లో ఉన్న గృహ‌రుణాల‌ను ఎస్‌బీఐకి బ‌దిలీ చేయాల‌నుకునే వారు ఫిబ్ర‌వ‌రి 28,2019 లోపుగా త‌మ రుణాల‌ను బ‌దిలీ చేసుకుంటే ఏవిధ‌మైన ప్రాసెసింగ్ ఫీజు చెల్లించ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని ఎస్‌బీఐ అధికారిక ట్వ‌ట్ట‌ర్‌ ద్వారా తెలిపింది.

ఇత‌ర బ్యాంకుల వ‌ద్ద రుణం తీసుకుని గృహం కొనుగోలు చేసిన వారికి బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆఫ్ హోమ్ లోన్ పేరుతో ప‌థ‌కాన్ని ఎస్‌బీఐ ఆఫ‌ర్ చేస్తుంది.

వాణిజ్య బ్యాంకులు, ప్రైవేట్‌, విదేశీ బ్యాంకులు, నేష‌న‌ల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) వ‌ద్ద రిజిష్ట‌ర్ అయిన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్‌సీ),ల‌లో రుణాలు తీసుకున్న‌వారు, వారు ప‌నిచేస్తున్న కార్యాల‌యాల( కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు, వాటి అనుబంధ‌సంస్థ‌లలో ప‌నిచేస్తున్న ఉద్యోగులు వారి సంస్థ‌లు) నుంచి రుణాల‌ను తీసుకున్న వారు ఎస్‌బీఐ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆఫ్ హోమ్ లోన్ ద్వారా త‌మ గృహ రుణాల‌ను ఎస్‌బీఐ కి బ‌దిలీ చేసుకోవ‌చ్చు. ఇల్లు/ ప‌్లాట్‌కి సంబంధించిన అస‌లు ప‌త్రాల‌ను రుణ గ్ర‌హీత వ‌ద్ద ఉండాలి.

sbi in.jpg

ఎస్‌బీఐ అందించే గృహ రుణాల‌కు సంబంధించిన ముఖ్య‌మైన అంశాలు:

 • త‌క్కువ వ‌డ్డీ రేట్లు
 • జీరో ప్రాసెసింగ్ రుసుములు
 • ఇత‌ర రుసుములు ఉండ‌వు
 • ముందుగా చేసిన చెల్లింపులపై పెనాల్టీ ఉండ‌దు.
 • రోజు వారీగా త‌గ్గుతున్న మొత్తంపై మాత్ర‌మే వ‌డ్డీ విధిస్తారు.
 • తిరిగి చెల్లింపుల కాల‌వ్య‌వ‌ధి 30 సంవ‌త్స‌రాలు.
 • మ‌హిళ‌లు తీసుకున్న రుణాల‌పై వ‌డ్డీ రాయితీ
 • చెక్ ఆఫ్ ఫెసిలిటీ అందించిన వారికి వ‌డ్డీ రాయితీ ఉంటుంది.

అర్హ‌త‌:

 • భార‌తీయులై ఉండాలి
 • క‌నీస వ‌య‌సు 18 సంవ‌త్స‌రాలు
 • గ‌రిష్ట వ‌య‌సు 75 సంవ‌త్స‌రాలు
 • రుణ కాల‌ప‌రిమితి 30 సంవ‌త్స‌రాలు

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly