ఆరోగ్య బీమాలో రూమ్ అద్దెకు ఉప పరిమితులు

అందులో ముఖ్యమైనది గది అద్దె. ఇది బీమా హామీ మొత్తంలో కొంత శాతంగా గానీ, కొంత మొత్తంగా గానీ ఉంటుంది

ఆరోగ్య బీమాలో రూమ్ అద్దెకు ఉప పరిమితులు

ఆరోగ్య బీమా పాలసీ ని ఎంచుకునే సమయంలో చూడవలసిన మరో ముఖ్యమైన అంశం సబ్-లిమిట్స్ (ఉప-పరిమితులు). ఆరోగ్య బీమా పాలసీ సంపూర్ణ పాలసీ అయినప్పటికీ ఉప-పరిమితులు ఎంత వరకు ఉన్నాయో తెలుసుకోవాలి. అందులో ముఖ్యమైనది గది అద్దె. ఇది బీమా హామీ మొత్తంలో కొంత శాతంగా గానీ, కొంత మొత్తంగా గానీ ఉంటుంది.

ఆరోగ్య బీమా గది అద్దె ఉప పరిమితి అంటే ఏమిటి?
దీని అర్థం రోజువారీ గది అద్దె, రోజువారీ ఐసీయూ అద్దె, సంబంధిత ఖర్చులు బీమా హామీ మొత్తంలో 1 శాతం (గది అద్దె), అలాగే బీమా హామీ మొత్తంలో 2 శాతం (ఐసీయూ అద్దె) వరకు ఉంటుంది. ఈ కింద తెలిపిన చార్జీలు రూమ్, ఐసీయూ అద్దెపై ఆధారపడి ఉంటాయి.

  • నర్సింగ్ కేర్, ఆర్ఎంఓ చార్జీలు, ఐవీ ఫ్లూయిడ్స్ / బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ / ఇంజెక్షన్ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు, ఇలాంటి మరికొన్ని చార్జీలతో పాటు సర్జన్, అనస్థీషిస్ట్, మెడికల్ ప్రాక్టీషనర్, కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్ ఫీజులు.

  • బ్లడ్, ఆక్సిజన్, ఆపరేషన్ థియేటర్ చార్జీలు, సర్జికల్ పరికరాలు, మెడిసిన్స్ & డ్రగ్స్, డయాలసిస్, కిమోథెరపీ, రేడియోథెరపీ, కృత్రిమ అవయవాల ఖర్చు, పేస్ మేకర్ , ఆర్ధోపెడిక్ ఇంప్లాంట్లు, ఇన్ఫ్రా కార్డియాక్ వాల్వ్ రీప్లేస్మెంట్స్, వాస్క్యులర్ స్టెంట్స్, లేబొరేటరీ డయాగ్నొస్టిక్ పరీక్షలు, ఎక్స్- రే, అలాగే వైద్యపరంగా అవసరమైన వివిధ ఖర్చులు.

వ్యాధి సంబంధిత ఉప పరిమితులు కూడా ఉండవచ్చు. క్యాట‌రాక్ట్‌, ఫ్రాక్చ‌ర్‌, జాయింట్ స‌ర్జ‌రీలు లాంటి కొన్ని ర‌కాల చికిత్స‌ల‌కు ప‌రిహారం అందించ‌డంలో కొన్ని ప‌రిమితులు ఉన్నాయి. ఉదా : ఒక వ్యక్తి రూ 5 లక్షల బీమా హామీ ఉన్న పాలసీ తీసుకున్నారనుకుందాం. ఒకవేళ క్యాటరాక్ట చికిత్స చేయించుకుంటే, బీమా హామీ మిగిలి ఉన్నప్పటికీ, ఒక కంటికి రూ. 20-25 వేలు మాత్రమే చెల్లిస్తారు. మిగిలిన ఖర్చును పాలసీదారుడు భరించాలి. ఈ చెల్లింపులు పాలసీ ని బట్టి మారుతుంటాయి . కాబట్టి ఈ విషయాలను పాలసీ తీసుకునే సమయంలో పరిశీలించడం మంచిది.

మీ వద్ద రూ 5 లక్షల పాలసీ ఉందనుకుందాం . ఇందులో గది అద్దె పరిమితిని 1 శాతం అంటే రూ 5,000 లకు విధిస్తే , అంతకు మించి ఖరీదైన గదిని మీరు ఎంచుకుంటే , రూ 5 వేలకు పైబడిన ఖర్చులను మీరే భరించవలసి ఉంటుంది. దీనితో పాటు ఇతర ఖర్చులైన నర్సింగ్, కన్సల్టింగ్ డాక్టర్ ఫీజు, సర్జరీ , సర్జన్ ఫీజు వంటి వాటిలో కూడా పరిమితికి మించిన సొమ్మును పాలసీదారుడు భరించవలసి ఉంటుంది. ఒకే ఆసుపత్రిలో ఉండే వేరువేరు గదుల అద్దె పెరుగుదల మిగిలిన ఇతర ఖర్చులపై కూడా ఉంటుంది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఒకవేళ మీరు రూ 7,500 ల గదిని తీసుకునిఉంటే , ఖర్చులను దీనికి అనుగుణంగా చెల్లిస్తారు . ఈ కింది పట్టిక ద్వారా ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు:

insurance1.jpg

పైన తెలిపిన ఉదాహరణ లో పాలసీ దారుడికి అధిక బీమా హామీ ఉన్నప్పటికీ గది ఉప పరిమితుల కారణంగా, అతను రూ. 39,467 సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కింది పట్టిక ని గమనించి పాలసీదారులు ఉప పరిమితులు ఉన్న పాలసీ ని ఎంచుకోవాలో లేక ఉప పరిమితులు లేని పాలసీ ని ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు:

insurance.jpg

ఉపపరిమితులు ఉన్న పాలసీల లో అనుమతించిన గదిని మాత్రమే ఎంచుకోవడం ద్వారా ఆసుపత్రి ఖర్చులను బీమా పాలసీ లోనే కవర్ చేసుకోవచ్చు. ఉప పరిమితులు లేని పాలసీ ఉన్న వారు అధిక గది అద్దె ఉన్న ఆసుపత్రులను కూడా ఎంచుకుని బీమా పాలసీ లో కవర్ చేసుకోవచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly