ఆరోగ్య‌బీమాలో వెయిటింగ్ పిరియ‌డ్ అంటే?

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేనాటికి ఉన్న ముందస్తు ఆరోగ్య సమస్యలకు కొన్నాళ్ల‌పాటు వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది

ఆరోగ్య‌బీమాలో వెయిటింగ్ పిరియ‌డ్ అంటే?

పాల‌సీ తీసుకునే ముందు స‌ద‌రు వ్య‌క్తికి ఉండే వ్యాధులు లేదా గ‌తంలో తీసుకున్న పాల‌సీ ద్వారా పొందిన వైద్య‌సేవ‌ల‌ను పొంది ఉండొచ్చు. వాటిని ఆరోగ్య బీమా కంపెనీలు ముంద‌స్తు ఆరోగ్య‌స‌మ‌స్య‌లుగా ప‌రిగ‌ణిస్తాయి. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేనాటికి ఉన్న ముందస్తు ఆరోగ్య సమస్యలకు కొన్నాళ్ల‌పాటు వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. అంటే ఈ స‌మ‌యంలో పాల‌సీ తీసుకున్నాస‌రే బీమా వ‌ర్తించ‌దు. హెర్నియా,టాన్సిల్స్ త‌దిత‌ర వ్యాధుల‌కు రెండేళ్ల వెయిటింగ్ పిరియ‌డ్ ఉండొచ్చు. అంటే వీటికి బీమా స‌దుపాయం పొందాలంటే పాల‌సీ ప్రారంభించి రెండేళ్లు పూర్త‌యి ఉండాలి.

ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పిరియ‌డ్:
కొన్ని బీమా సంస్థ‌లు తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు, జీవన శైలి వ్యాధులైన మధుమేహ్యం , బీపీ, హృదయ సంబంధిత ముంద‌స్తు రోగాల‌కు 2-4 ఏళ్ల వెయిటింగ్ పీరియ‌డ్‌ను విధిస్తాయి.

ఇనీషియ‌ల్ వెయిటింగ్ పిరియ‌డ్:
ప్రాథ‌మికంగా 30-90 రోజులు పూర్త‌యిన త‌రువాత మాత్ర‌మే ఆరోగ్య బీమా ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌స్తుంది. అయితే గ్రూపు ఆరోగ్య బీమా ప‌థ‌కాల్లో వెయిటింగ్ పిరియ‌డ్ ఉండ‌దు.

ప్ర‌సూతి స‌దుపాయం:
సాధార‌ణంగా అన్ని ఆరోగ్య బీమా పాల‌సీలు ప్ర‌సూతి ఖ‌ర్చుల‌ను భ‌ర్తీ చేయ‌వు. కొన్ని బీమా పాల‌సీలు వెయిటింగ్ పిరియ‌డ్ 24 నెల‌ల నుంచి 48నెల‌ల వెయిటింగ్ పిరియ‌డ్ తో పాల‌సీలు అందిస్తున్నాయి. ఇలాంటి పాలసీలలో ప్రీమియం అధికంగా ఉంటుంది.

ఆరోగ్య బీమా పాల‌సీని తీసుకునే ముందు వెయిటింగ్ పిరియ‌డ్ నిబంధన గురించి తెలుసుకోవాలి. వెయిటింగ్ పిరియ‌డ్ పాల‌సీ పాల‌సీకి, సంస్థ‌ సంస్థ‌కు మారుతుంటుంది. కాబ‌ట్టి త‌క్కువ వెయిటింగ్ పిరియ‌డ్ ఉన్న పాల‌సీల‌ను తీసుకోవ‌డం మంచిది. వయసు కాస్త పెరిగాక అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, అప్పుడు పాలసీ తీసుకున్నట్లయితే వెయిటింగ్ పీరియడ్ పూర్తయ్యే లోపు ఆ అనారోగ్యాన్ని పాలసీ కవర్ చేయదు. చిన్న వయసులోనే పాలసీ తీసుకోవడం వలన , వెయిటింగ్ పీరియడ్ కవర్ చేయొచ్చు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly