ఇక‌పై బీమా ప్రీమియంల‌ను కూడా బీబీపీఎస్ ద్వారా చెల్లించ‌వ‌చ్చు

ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు మిన‌హా అన్ని బిల్లుల‌ను భార‌త్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ద్వారా చెల్లించేందుకు ఆర్‌బీఐ అనుమ‌తించింది

ఇక‌పై బీమా ప్రీమియంల‌ను కూడా బీబీపీఎస్ ద్వారా చెల్లించ‌వ‌చ్చు

భారత్ బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్‌) పిరిధిని విస్త‌రించేందుకు రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమ‌తించింది. ఇకపై రికరింగ్ బిల్లులు కూడా పూర్తిస్థాయిలో ఆటోమేటిక్ గా చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఇందులో భాగంగా స్కూలు ఫీజులు, ఇన్సురెన్స్ ప్రీమియంలు, మున్సిప‌ల్ ప‌న్నులు వంటి వాటిని బీబీపీఎస్ ద్వారా చెల్లించ‌వ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు బీబీపీఎస్ హోమ్ డీటీహెచ్, ఎల‌క్ట్రిసిటీ, గ్యాస్ టెలికాం, నీటి బిల్లుల‌ను చెల్లించేందుకు అనుమతించేది. ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు మిన‌హాయించి మిగిలిన అన్ని ర‌కాల బిల్లుల‌ను చెల్లించేందుకు అనుమ‌తించిన‌ట్లు ఆర్‌బీఐ త‌న సెర్కుల‌ర్‌లో తెలిపింది.

నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) ఆధ్వర్యంలో కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తున్న బీబీపీఎస్, ద్వారా ఇన్సురెన్స్ ప్రీమియం, మ్యూచువ‌ల్ ఫండ్లు, స్కూల్ ఫీజులు, ఈఎమ్ఐలు, మున్సిపాల్టీ ప‌న్నులు, ఇత‌ర రిక‌రింగ్ చెల్లింపుల‌ను చేసే స‌దుపాయాన్ని అందించ‌డం క‌చ్చితంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

న‌గ‌దు, చెక్కుల‌తో పాటు ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్‌(డెబిట్ కార్డ్‌, క్రెడిట్ కార్డ్‌), డిజిట‌ల్ చెల్లింపుల విధానాలు)ద్వారా చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

బీబీపీఎస్‌ను కొన్ని ర‌కాల బిల్లుల‌ను మాత్ర‌మే చెల్లించేందుకు ప‌రిమితం చేయ‌కుండా అన్ని ర‌కాల బిల్లుల‌ను అనుమ‌తిస్తే భార‌త్ బిల్లు పేమెంట్ వ్య‌వ‌స్థ‌లో వినియోగ‌దారుల సంఖ్య పెరుగుతుంది. ప్ర‌స్తుత వ్య‌వ‌స్థ‌ల‌కు దీటుగా స‌మ‌ర్థ‌వంత‌మైన‌, త‌క్కువ ఖ‌ర్చుతోకూడిన ప్రత్యామ్నాయాన్ని అందించేంద‌కు వీల‌వుతుంది. అంతేకాకుండా వినియోగ‌దారుల‌లో డిజిట‌ల్ చెల్లింపుల ప‌ట్ల విశ్వాసం, న‌మ్మ‌కం పెరుగుతుంద‌ని ట్యాక్స్‌మెన్ డీజీఎమ్ ర‌చిత్ శ‌ర్మ తెలిపారు.

స్కూల్స్‌ ( ఫీజుల కోసం), హౌసింగ్ సొసైటీలు (నిర్వహణ ఛార్జీల కోసం) వంటివి చెల్లింపుల‌ ప్లాట్‌ఫామ్‌లపైకి రావడం తక్కువ. ఇటువంటి నాన్ యూటిలిటీల‌ను కూడా చెల్లింపుల ప్లాట్‌ఫైమ్‌పైకి తీసుకురావ‌డం ద్వారా న‌గ‌దు ర‌హిత ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయ‌వ‌చ్చ‌ని ఫిన్‌టెక్ లెండ‌ర్ పీడబ్ల్యుసీ భాగస్వామి వివేక్ బెల్గావి అన్నారు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly