రెండో ఇంటిపై కూడా పన్ను ర‌ద్దు

బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన ప్ర‌కారం రెండు సొంత‌ ఇళ్లు క‌లిగి ఉన్న‌ప్ప‌టికీ ప‌న్ను చెల్లించ‌న‌వ‌స‌రం లేదు

రెండో ఇంటిపై కూడా పన్ను ర‌ద్దు

2019-20 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి స్థిరాస్తి రంగానికి పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఇప్పటి వరకూ పన్ను చెల్లింపుదారుడు ఒక ఇంటిని మాత్రమే సొంత నివాసానికి ఎలాంటి ఆదాయం చూపించాల్సిన అవసరం లేకుండా ఎంచుకోవచ్చు. ఇప్పుడు తాజా బ‌డ్జెట్‌లో సెక్షన్‌ 23కి కొత్త బడ్జెట్‌లో సవరణ చేశారు. దీని ప్రకారం ఇకపై రెండు ఇళ్లను సొంతంగా నివాసం ఉంటున్నట్లుగా చూపించుకోవచ్చు. ఇది కొంత ప్రయోజనం చేకూర్చే అంశంగానే చెప్తున్నారు. ఉదాహరణకు మీకు ఉద్యోగం చేసే చోట ఒక ఇల్లు, మీ సొంత ఊరిలో మరో ఇల్లు ఉందనుకోండి. ఈ రెండు ఇళ్లనూ సొంతంగా నివాసం ఉంటున్నట్లు చూపించుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప‌న్ను చెల్లింపులు త‌గ్గుతాయి.

రెండిళ్లు ఉన్న వారు, ఒక ఇంట్లో నివసిస్తూ, మరొకదాంట్లో తమ తల్లిదండ్రులు/కుటుంబీకులను ఉంచడమో చేస్తుంటారు. రెండో ఇంటినీ ఇలా సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నా, దానిపై ఆదాయమేమీ పొందకున్నా, దీనిపై అద్దె వస్తున్నట్లే (ఆదాయంగా) పరిగణిస్తూ, పన్ను వసూలు చేస్తున్నారు. ఇందుకు ఆ ప్రాంత మున్సిపాలిటీ/నగర పాలక సంస్థ వంటి స్థానిక ప్రభుత్వాలు నిర్ణయించే అద్దె విలువను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అయితే దీనిపై పన్ను నుంచి మినహాయింపు ఇవ్వ‌నున్న‌ట్లు తాజా బడ్జెట్ లో ప్రతిపాదించారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly