కరోనా వైరస్ సమయంలో సీనియర్ సిటిజన్లకు ఉత్తమ పెట్టుబడి ఆప్షన్లు..

గవర్నమెంట్ అఫ్ ఇండియా సేవింగ్స్ బాండ్లను ఆర్‌బీఐ బాండ్లు అని కూడా అంటారు

కరోనా వైరస్ సమయంలో సీనియర్ సిటిజన్లకు ఉత్తమ పెట్టుబడి ఆప్షన్లు..

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా సీనియర్ సిటిజన్ల ఆర్థిక జీవితాలు ప్రభావితమయ్యాయి, ఎందుకంటే వారు సాధారణంగా బ్యాంకులు లేదా పోస్టాఫీసులను సందర్శించి వారి పెట్టబడులను నిర్వహిస్తారు.

సీనియర్ సిటిజన్లు పరిగణించాల్సిన కొన్ని పెట్టుబడి ఆప్షన్ లు కింద ఉన్నాయి :

జీఓఐ (గవర్నమెంట్ అఫ్ ఇండియా) సేవింగ్స్ బాండ్స్ :

గవర్నమెంట్ అఫ్ ఇండియా సేవింగ్స్ బాండ్లను ఆర్‌బీఐ బాండ్లు అని కూడా అంటారు. ఈ బాండ్లు సావరిన్ గ్యారంటీని అందిస్తాయి, అలాగే ఇవి 7.75 శాతం వడ్డీ రేటుతో వస్తాయి. ఈ పథకానికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి నాన్-క్యుములేటివ్ ఆప్షన్, ఇక్కడ వడ్డీని రెండు సంవత్సరాలకు చెల్లిస్తారు, మరొకటి క్యూములేటివ్ ఆప్షన్, ఇక్కడ మెచ్యూరిటీ సమయాన వడ్డీ చెల్లిస్తారు.

ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టే మొత్తానికి ఏలాంటి పరిమితి లేదు, కానీ ఆదాయపు పన్ను స్లాబ్ ప్రకారం ఆదాయాలకు పన్ను వర్తిస్తుంది. 60 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల పెట్టుబడిదారులకు లాక్-ఇన్ పీరియడ్ ఆరు సంవత్సరాలు, 70 నుంచి 80 సంవత్సరాల వయస్సు వారికి లాక్ ఇన్ పీరియడ్ ఐదు సంవత్సరాలు. అలాగే 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి లాక్-ఇన్ పీరియడ్ నాలుగు సంవత్సరాలుగా ఉంటుంది. కనీస లాక్-ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఆగస్టు 1, ఫిబ్రవరి 1 న మాత్రమే బాండ్ల ముందస్తు సరెండర్ కు అనుమతి ఉంటుంది. బాండ్ల ముందస్తు సరెండర్ పై జరిమానా వర్తిస్తుంది.

బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు :

బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీలు) పెట్టుబడి వ్యవధిలో స్థిర వడ్డీ రేట్లను అందిస్తాయి, ఇది ఒక్కో బ్యాంకుకు ఒక్కోలా మారుతూ ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు 0.25 శాతం నుంచి 0.5 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తారు. వడ్డీ రేటును క్రమానుగతంగా సవరిస్తూ ఉంటారు, కానీ ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించవలసి వచ్చింది. సీనియర్ సిటిజన్లు తమ బ్యాంకు డిపాజిట్ల నుంచి వచ్చే వడ్డీ ఆదాయంపై ఎక్కువగా ఆధారపడడం వలన వారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది.

డెట్ ఫండ్స్ :

డెట్ ఫండ్స్ అనేవి ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ, కార్పొరేట్ బాండ్ల వంటి అధిక-నాణ్యత స్థిర-ఆదాయ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ల రకం. సీనియర్ సిటిజన్లు లిక్విడ్ ఫండ్స్, ఓవర్ నైట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు, ఎందుకంటే ఇవి అధిక లిక్విడిటీ, భద్రతను అందిస్తాయి. డెట్ ఫండ్ల నుంచి వచ్చే రాబడిపై ఆదాయ స్లాబ్ ప్రకారం పన్ను వర్తిస్తుంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)

ఎస్సీఎస్ఎస్ అనేది ప్రభుత్వ పొదుపు పథకం, ఇది క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందిస్తుంది, అలాగే ఇది సెక్షన్ 80సీ కింద పన్నులను ఆదా చేసే సాధనం. ఎస్సీఎస్ఎస్ ఖాతాలో కనీస పెట్టుబడి రూ. 1000 కాగా, గరిష్టంగా అన్ని ఖాతాలలో కలిపి రూ. 15,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ మీ జీవిత భాగస్వామి సీనియర్ సిటిజన్ అయితే, వారితో కలిసి ఉమ్మడి ఖాతా తెరవడానికి మీకు అనుమతి ఉంది. ఎస్సీఎస్ఎస్ ఖాతాలు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ తో వస్తాయి, అలాగే మూడేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ముందస్తు ఉపసంహరణకు అనుమతి ఉంది. ఏదేమైనా, ఒకవళ మీరు ఒక సంవత్సరం తరువాత ఖాతాను మూసివేసినట్లయితే, జమ చేసిన మొత్తంలో 1.5 శాతం ముందస్తు చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు రెండేళ్ల తర్వాత ఉపసంహరించుకున్నట్లైతే, జమ చేసిన మొత్తంలో 1 శాతం జరిమానా ఉంటుంది.

గమనిక : మీరు ఆన్‌లైన్‌లో ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరవలేరు. దీని కోసం మీరు బ్యాంకు లేదా పోస్టాఫీసు శాఖను సందర్శించాల్సి ఉంటుంది.

కార్పొరేట్ డిపాజిట్లు :

కార్పొరేట్ డిపాజిట్లు, బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. సీనియర్ సిటిజన్లు AAA, అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న కార్పొరేట్ డిపాజిట్లలో మాత్రమే పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly