అద్దె, బీమా ప్రీమియంపై 25 శాతం టీడీఎస్ ని తగ్గించిన కేంద్రం...

23 వస్తువులపై టీడీఎస్ తగ్గించినట్లు సీబీడీటీ నోటిఫికేషన్ లో తెలిపింది

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనల తరువాత, ప్రస్తుత మిగిలిన ఆర్ధిక సంవత్సరంలో డివిడెండ్, ఇన్సూరెన్స్ పాలసీ, రెంట్, ప్రొఫెషనల్ ఫీజు, స్థిరమైన ఆస్తి సముపార్జన చెల్లింపులపై ఆదాయపు పన్ను శాఖ 25 శాతం టీడీఎస్ ను తగ్గించింది.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సీబీడీటీ), ఈ రోజు నుంచి మార్చి 31, 2021 వరకు వర్తించే సవరించిన టీడీఎస్, టీసీఎస్ రేట్లను జారీ చేసింది.

ఈ నోటిఫికేషన్ లో, రూ. 10 లక్షలకు పైబడిన మోటారు వాహనాల అమ్మకంపై టీసీఎస్ 0.75 శాతానికి తగ్గించారు, అంతకుముందు ఇది 1 శాతంగా ఉండేది. అలాగే 23 వస్తువులపై టీడీఎస్ తగ్గించినట్లు సీబీడీటీ నోటిఫికేషన్ లో తెలిపింది.

అదే విధంగా జీవిత బీమా పాలసీకి చెల్లించే టీడీఎస్‌ను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని, డివిడెండ్, వడ్డీతో పాటు స్థిరాస్తుల అద్దెను 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించామని సీబీడీటీ తెలిపింది.

స్థిరమైన ఆస్తి సముపార్జన కోసం చేసిన చెల్లింపుపై వసూలు చేసిన 1 శాతం టీడీఎస్‌ను ఇప్పుడు 0.75 శాతానికి తగ్గించారు. వ్యక్తి లేదా హెచ్‌యూఎఫ్ అద్దె చెల్లింపు 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించారు.

ఈ-కామర్స్ పార్టిసిపెంట్స్ పై టీడీఎస్ కూడా 1 శాతం నుంచి 0.75 శాతానికి తగ్గించారు. అదేవిధంగా, ప్రొఫెషనల్ ఫీజుపై పన్నును 2 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించారు.

జాతీయ పొదుపు పథకం డిపాజిట్ల విషయంలో చేసే చెల్లింపులపై టీడీఎస్ ను 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించడంతో పాటు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా యూనిట్లను తిరిగి కొనుగోలు చేసే చెల్లింపులపై టీడీఎస్ ను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు.

బీమా కమీషన్, బ్రోకరేజీపై టీడీఎస్ ను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించారు. అలాగే మ్యూచువల్ ఫండ్ల ద్వారా డివిడెండ్ చెల్లింపుపై టీడీఎస్ ను 10 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు. టెండూ లీవ్స్, స్క్రాప్, కలప, అటవీ ఉత్పత్తులు, బొగ్గు, లిగ్నైట్ లేదా ఐరన్ ఓర్ వంటి ఖనిజాల అమ్మకాలపై టీసీఎస్ ను కూడా తగ్గించారు.

పాన్ / ఆధార్ సమర్పించకపోవడం వలన పన్నును తగ్గించాల్సిన అవసరం లేదా అధిక రేటును వసూలు చేయాల్సిన అవసరం ఉన్న టీడీఎస్ లేదా టీసీఎస్ రేట్లలో తగ్గింపు ఉండదని సీబీడీటీ తెలిపింది.

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly