ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ ఆదా...

ఏప్రిల్ 1, 2019 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రోత్సాహకాలను అందించనున్నారు

ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ ఆదా...

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఇటీవల ఫేమ్ 2 పథకాన్ని ఆమోదించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ 1, 2019 నుంచి ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రోత్సాహకాలను అందించనున్నారు. ఈ పథకం కోసం భారత ప్రభుత్వం రూ. 10,000 కోట్లను కేటాయించింది. అలాగే ఇది 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పాటు అమలులో ఉండనుంది. ఫేమ్ 2 పథకంలో భాగంగా ఒక్కో ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనానికి రూ. 20,000 చొప్పున 10 లక్షల ద్విచక్ర వాహనాలకు, ఒక్కో ఎలక్ట్రిక్‌ కారుకి రూ.1.5 లక్షల చొప్పున 35,000 కార్లకు, ఒక్కో హైబ్రిడ్‌ కారుకి రూ.13,000 నుంచి రూ. 20,000 వరకు, ఒక్కో ఈ-రిక్షాకు రూ. 50,000 చొప్పున 5 లక్షల ఈ-రిక్షాలకు, ఒక్కో ఈ-బస్సుకు రూ. 50 లక్షల చొప్పున 7,090 ఈ-బస్సులకు సబ్సిడీ లభించనుంది. దీని కోసం 2019–20 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,500 కోట్లు, 2020–21 ఆర్ధిక సంవత్సరంలో రూ. 5,000 కోట్లు, 2021–22 ఆర్ధిక సంవత్సరంలో రూ. 3,500 కోట్లను కేటాయించారు. వాహనాలలో ఉపయోగించే బ్యాటరీల పరిమాణం ఆధారంగా వాహనాలపై అందించే ప్రోత్సాహకాలు ఆధారపడి ఉంటాయి. అలాగే స్థానికీకరణను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ బ్యాటరీలపై దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి 15 శాతానికి పెంచనుంది.

ఒకసారి ఫేమ్ 2 స్కీమ్ దేశంలో అమలులోకి వచ్చిన తరువాత, భారతదేశంలోని ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ కు పెద్ద ఊపును అందించనుంది. ఫేమ్ 2 అనేది పథకంలో రెండవ ఫేస్, మొట్టమొదటిసారిగా దీనిని 2015 సంవత్సరంలో ప్రవేశపెట్టారు, అప్పుడు దానికి రూ. 895 కోట్లను కేటాయించారు.

సిరి లో ఇంకా:
మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly