ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్స్ స్టేట‌స్‌ను చెక్ చేసుకున్నారా?

ఇ-వెరిఫికేష‌న్ పూర్తి చేస్తేనే ఆదాయ‌పు ప‌న్ను శాఖ రిట‌ర్నుల‌ను ప్రాసెస్ చేయ‌డం ప్రారంభిస్తుంది

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్న్స్ స్టేట‌స్‌ను చెక్ చేసుకున్నారా?

వ్య‌క్తిగ‌త ఆదాయ‌ప‌న్ను రిట‌ర్నుల‌ను ఫైల్ చేసేందుకు ఆగ‌ష్టు 31తో గ‌డువు ముగిసింది. అయితే రిట‌ర్నుల‌ను ఫైల్ చేయ‌డం మాత్ర‌మే కాదు, దాని స్టేట‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్రేక్ చేస్తుండాలి. ఇది మీరు ఫైల్ చేసిన రిట‌ర్నులు ప్రాసెస్ అవుతుందో లేదో తెలుసుకునేందుకు స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా మీకు రావ‌ల‌సిన ఆదాయ‌పు ప‌న్ను వాప‌సుల‌ను కూడా త‌ప్ప‌నిస‌రిగా ట్రాక్ చేయాలి.

ఆదాయపు పన్ను రిటర్నుల స్టేట‌స్‌ను చెక్‌చేయ‌డం చాలా సులభం. ఇందుకోసం ముందుగా ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. త‌దుప‌రి డాష్‌బోర్డ్‌లోని “వ్యూ రిట‌ర్న్‌/ ఫార‌మ్” ల‌ను క్లిక్ చేస్తే, మీరు రిట‌ర్నుల‌ను ఫైల్ చేసిన‌ అసెస్‌మెంట్ ఇయర్, ఉపయోగించిన ఐటీఆర్ ఫారం, దాఖలు చేసిన తేదీ మొదలైన వివ‌రాలను చూపిస్తుంది, చివ‌రి కాల‌మ్ స్టేట‌స్‌ను సూచిస్తుంది.

మీరు ఐటీర్‌ను దాఖలు చేసి, ధృవీక‌రించ‌క‌పోతే, ఐటీఆర్ V/e వెరిఫికేష‌న్ కోసం పెండింగ్‌లో ఉంది అని స్టేట‌స్ వ‌స్తుంది. ఒక‌వేళ ఇ-వెరిఫికేష‌న్ పూర్తైతే ప్ర‌స్తుతం ఉన్న స్టేట‌స్‌ను తెలియ‌జేస్తుంది. రిట‌ర్నుల‌ను వెరిఫై చేసిన త‌రువాత మాత్ర‌మే ఆదాయ‌పు ప‌న్ను శాఖ రిట‌ర్నుల‌ను ప్రాసెస్ చేయ‌డం ప్రారంభిస్తుంది. అందువ‌ల్ల మీ ఐటీఆర్ వెరిఫై చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి.

మీ ఐటీఆర్‌ను ఆదాయపు పన్ను విభాగం ప్రాసెస్ చేయ‌డం ప్రారంభించిన త‌రువాత దానికి త‌గిన‌ట్లుగా స్టేట‌స్ మారుతుంటుది. ఇ-వెరిఫికేష‌న్ కోసం పెండింగ్‌లో ఉన్న‌దీ లేనిదీ కూడా వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

ఎక్‌నాలెడ్జ్‌మెంట్ నెంబ‌రు “Ack. No” పై క్లిక్ చేయ‌డం ద్వారా ఇ-ఫైల్లింగ్ చేసేప్పుడు నింపిన మొత్తం ITR-V ఫార‌మ్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఈ ఫార‌మ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రికార్డుల‌లో భ‌ద్ర‌ప‌ర‌చుకోవ‌చ్చు.

ఈ విభాగం ద్వారా ఇ-వెరిఫికేష‌న్‌లో అంగీరించారా? లేదా? తెలుసుకోవ‌డంతో పాటు ప్రాసెస్ పూర్తియిందో లేదో కూడా తెలుపుతుంది. రిఫండ్ కోసం కూడా ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ను నెంబ‌రును ఉప‌యోగించి స్టేట‌స్ తెలుసుకోవ‌చ్చు.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly