డెబిట్ కార్డుల‌పై కాంప్లిమెంట‌రీ బీమా అందిస్తున్న‌ ఎస్‌బీఐ..

ఎంచుకున్న డెబిట్ కార్డు ఆధారంగా రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా అందిస్తుంది

డెబిట్ కార్డుల‌పై కాంప్లిమెంట‌రీ బీమా అందిస్తున్న‌ ఎస్‌బీఐ..

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌మ ఖాతాదారుల‌కు వివిధ ర‌కాల డెబిట్ కార్డుల‌ను అందిస్తుంది. ముఖ్యంగా డెబిట్ కార్డుల‌లో రెండు ర‌కాలు ఉన్నాయి. 1.బేసిక్ కార్డులు, 2. ప్రీమియం కార్డులు. ఎస్‌బీఐ ప్రీమీయం గోల్డ్‌, ఎస్‌బీఐ ప్లాటిన‌మ్‌, ఎస్‌బీఐ ప్రైడ్‌, ఎస్‌బీఐ ప్రీమియం, ఎస్‌బీఐ వీసా సిగ్నేచ‌ర్ డెబిట్ కార్డులు ప్రీమియం ర‌కానికి చెందిన‌వి. ఈ డెబిట్ కార్డుదారుల‌కు ఎస్‌బీఐ కాంప్లిమెంట‌రీ బీమా క‌వ‌రేజ్‌ను అందిస్తుంది.

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా(నాన్ ఎయిర్‌-మ‌ర‌ణిస్తే):
డెబిట్ కార్డు హోల్డ‌ర్‌లు విమాన ప్ర‌మాదంలో కాకుండా ఇత‌ర ఏప్ర‌మాదంలోనైనా మ‌ర‌ణిస్తే ఈ బీమా వ‌ర్తిస్తుంది. తీసుకున్న డెబిట్ కార్డు ఆధారంగా హామీ మొత్తం వ‌ర్తిస్తుంది. అయితే ఖాతాదారులు ఏటీఎమ్‌/పీఓఎస్‌/ఇకామ్ వంటి వాటిలో ఏదో ఒక విధానం ద్వారా ప్ర‌మాదం జ‌రిగే ముందు 90 రోజులలో ఒక‌సారైనా ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉప‌యోగించి ఉండాలి.

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా(ఎయిర్‌-మ‌ర‌ణిస్తే):
ఇది ఎయిర్ యాక్సిడెంట్‌ల‌ను మాత్ర‌మే క‌వ‌ర్ చేస్తుంది. ఖాతాదారుని డెబిట్ కార్డు ర‌కంపై హామీ మొత్తం ఆధార‌ప‌డుతుంది. విమాన ప్ర‌మాదంలో డెబిట్ కార్డు తీసుకున్న వ్య‌క్తి మ‌ర‌ణిస్తే ఈ బీమా వ‌ర్తిస్తుంది. ఖాతాదారులు ఏటీఎమ్‌/పీఓఎస్‌/ఇకామ్ వంటి వాటిలో ఏదో ఒక విధానం ద్వారా ప్ర‌మాదం జ‌రిగే ముందు 90 రోజులలో ఒక‌సారైనా ఎస్‌బీఐ డెబిట్ కార్డు ఉప‌యోగించి ఉండాలి. అంతేకాకుండా విమాన టికెట్‌ను కూడా ఎస్‌బీఐ డెబిట్ కార్డుతోనే కొనుగోలు చేసి ఉండాలి.
sbi1.jpg

కొనుగోలు భ‌ద్ర‌త‌(ప‌ర్చేస్ ప్రొట‌క్ష‌న్): ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో కొనుగోలు చేసిన వ‌స్తువులు దొంగిలించ‌బ‌డితే…వాటికి ప‌ర్చేస్ ప్రొట‌క్ష‌న్ క‌వ‌రేజ్ వ‌ర్తిస్తుంది. బంగారం, విలువైన రాళ్ళు, ఎక్కువ రోజులు నిలువ ఉండ‌ని(ఆహారం) వంటి వాటికి ఇది వ‌ర్తించ‌దు. దొంగ‌త‌నం/ఇంటిని ద్వంసం చేసి దొంగిలించ‌డం/ వాహ‌నం నుంచి దొంగిలించిన వ‌స్తువులకు కూడా ఈ బీమా క‌వ‌ర‌వుతుంది. అయితే వ‌స్తువు కొనుగోలు చేసిన రోజు నుంచి 90 రోజుల వరకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా పాయింట్ ఆఫ్ సేల్ / వ‌్యాపార‌ సంస్థలలో అర్హత కలిగిన డెబిట్ కార్డ్ వేరియంట్‌లను ఉపయోగించి వస్తువులను కొనుగోలు చేసి ఉండాలి.

sbi2.jpg
వేత‌న‌ ఖాతాదారుల‌కు ప‌ర్చేస్ ప్రొట‌క్ష‌న్ క‌వ‌రేజ్:
వేత‌న ఖాతాదారుల‌కు ప‌ర్చేస్ ప్రొట‌క్ష‌న్ క‌వ‌రేజ్ అందుబాటులో ఉంది. ఇది అన్ని మాస్ట‌ర్‌/మేస్ట్రోకార్డు/ వీసా కార్డు వేరియంట్ల‌కు వ‌ర్తిస్తుంది. రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు క‌వ‌రేజ్ ఉంటుంది.

యాడ్ ఆన్ క‌వ‌ర్స్‌: అర్హ‌త గ‌ల డెబిట్ కార్డు వేరియంట్‌ల‌కు పైన తెలిపిన బీమా స‌దుపాయ‌ల‌తో పాటు ఈ కింది అద‌న‌పు ప్ర‌యోజ‌నాల‌ను ఎస్‌బీఐ అందిస్తుంది

వ్య‌క్తి ప్ర‌మాద బీమా క్లెయిమ్‌ల‌ను సంస్థ ఆమోదిస్తే, మ‌ర‌ణించిన వ్య‌క్తిని, వారి ఇద్ద‌రు కుటుంబ స‌భ్యుల‌ను ఆసుప‌త్రి నుంచి ఇంటి తీసుకువ‌చ్చేందుకు అయ్యే ఖ‌ర్చును చెల్లిస్తారు. గోల్డ్‌(మాస్ట‌ర్‌/వీసా), యువ‌(వీసా), ప్లాటిన‌మ్‌(మాస్ట‌ర్‌/వీసా), ప్రైడ్‌(మాస్ట‌ర్‌/వీసా), ప్రీమియం(మాస్ట‌ర్‌/వీసా), సిగ్నేచ‌ర్‌(వీసా) కార్డుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. రూ.50 వేల వ‌ర‌కు హామీ మొత్తం ఉంటుంది.

చెక్-ఇన్ బ్యాగేజ్ లాస్ కవర్: విమాన ప్ర‌యాణ(దేశీయ‌, విదేశీ ప్ర‌యాణాలు) స‌మ‌యంలో ఎయిర్‌పోర్ట్ లోప‌ల చెకిన్ అయిన త‌రువాత స‌మాను పోతే, ఎయిర్లైన్స్ సంస్థ నుంచి ల‌భించే క‌వ‌ర్‌కు అదనంగా చెక్-ఇన్ బ్యాగేజ్ లాస్ కవర్‌ను అందిస్తారు. అయితే ప్ర‌యాణానికి సంబంధించిన టికెట్‌ను డెటిట్ కార్డును ఉప‌యోగించి కొనుగోలు చేసి ఉండాలి. గోల్డ్‌(మాస్ట‌ర్‌/వీసా), యువ‌(వీసా), ప్లాటిన‌మ్‌(మాస్ట‌ర్‌/వీసా), ప్రైడ్‌(మాస్ట‌ర్‌/వీసా), ప్రీమియం(మాస్ట‌ర్‌/వీసా), సిగ్నేచ‌ర్‌(వీసా) కార్డుల‌కు ఇది వ‌ర్తిస్తుంది. రూ.25 వేల వ‌ర‌కు హామీ మొత్తం ఉంటుంది.

సిరి లో ఇంకా

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

source: SBI

Comments

0

Post Comment

Thank you for submitting your comment. We will review it, and make it public shortly